Elections 2024 ఎన్నికల ముందు మోస్ట్ కాంట్రవర్సియల్ మూవీ.. సరికొత్త వివాదంలో కేరళ స్టోరీ మూవీ!
ప్రముఖ నటి అదా శర్మ లీడ్ రోల్‌లో నటించిన వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ. హిజాబ్, లవ్ జిహాద్ లాంటి అంశాల చుట్టూ తిరిగే ఈ మూవీకి ఈ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. లవ్ జిహాద్ ద్వారా కేరళకు చెందిన 32 వేల మందిని ముస్లిం మతంలోకి మార్చి, అక్రమంగా సిరియాకు తరలించారనే ఆరోపణల నేపథ్యంలో సాగే ఈ సినిమా గతేడాది మే 5న విడుదలైంది.
వివాదాలను రౌండప్ చేస్తున్నా.. డోంట్ కేర్ అంటూ బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత ఈ మూవీ మరోసారి వార్తల్లోకెక్కింది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ది కేరళ స్టోరీని ప్రసారం చేయాలనే దూరదర్శన్ నిర్ణయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు.

ఈ చిత్రం లోక్‌సభ ఎన్నికలకు ముందు మత విద్వేషాలు, ఉద్రిక్తతలను తీవ్రం చేసే అవకాశం ఉందని, సినిమా ప్రసారాన్ని నిలిపేయాలని పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్‌ను కోరినట్టు సమాచారం. మరి దూరదర్శన్ ఈ సూచనలను పాటిస్తుందా..? లేదా..? ఇంతకీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది.
దక్షిణాదిలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంతో సంఘ్ పరివార్ శక్తులు ది కేరళ స్టోరీని తెరకెక్కించాయంటూ గతంలోనే సీపీఎం, కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపణలు చేశాయి. ఈ సినిమా ప్రదర్శనను నిషేధించాలని డిమాండ్ చేశాయి. అయితే వివాదాల మధ్య రిలీజైన ఈ చిత్రం 200 కోట్లకుపైగా కలెక్షన్లను బాక్సాఫీస్ వద్ద రాబట్టింది.

అయితే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ఓటీటీ సంస్థలు వెనుకంజ వేశాయి. రిలీజ్ తర్వాత చాలా నెలల తర్వాత ఇటీవల కేరళ స్టోరీ జీ5 ఓటీటీలో రిలీజ్ అయింది. కానీ ఓటీటీలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుతం దూరదర్శన్‌లో రిలీజ్ చేస్తే వర్కవుట్ అవుతుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











