అవే శ్రీముఖి కొంప ముంచాయి.. బిగ్ బాస్ టైటిల్ కోల్పోవడం వెనుక అసలు కారణం ఇదే!
Recommended Video
తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్ నవంబర్ 3వ తేదీన సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎవ్వరూ ఊహించని రీ ఎంట్రీ ఈ మూడో సీజన్‌కు హైలెట్‌గా నిలిచాయి. స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ, తనస్టైల్లో సీజన్‌ను విజయవంతం చేసిన నాగార్జున ఇలా ఎన్నో విశిష్టతలతో కూడిన బిగ్‌బాస్ మూడో సీజన్‌కు వీడ్కోలు పలకడం జరిగింది. టైటిల్ విన్నర్‌గా రాహుల్ సిప్లిగంజ్ నిలవగా, రన్నరప్‌గా శ్రీముఖి నిలిచింది.

నిరాశ చెందిన శ్రీముఖి ఫ్యాన్స్
బిగ్ బాస్ ఫైనల్ వీక్ అంతా శ్రీముఖి విన్నర్ అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ ఊహించని విధంగా రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ విన్నర్ కావడం ఆశ్చర్యం కలిగించింది. అందరూ శ్రీముఖి విజయం సాధించడం ఖాయం అనుకున్న తరుణంలో అనూహ్యంగా రాహుల్ సిప్లిగంజ్ గెలవడం చూసి శ్రీముఖి ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు.

శ్రీముఖి ఓటమి.. దాని వెనుక రహస్యం
కాగా శ్రీముఖి ఓటమి వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నాయని తెలుస్తోంది. శ్రీముఖి విన్నర్ అయితే సమస్యలు వచ్చే అవకాశం ఉందనే కారణంగానే రాహుల్ సిప్లిగంజ్చేతిలో బిగ్ బాస్ టైటిల్ పెట్టారని ఆరోపిస్తున్నారు శ్రీముఖి ఫ్యాన్స్. దీంతో షో అయిపోయాక కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 వార్తల్లో నిలవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆరోపణలే కొంపముంచాయా..?
మరోవైపు షో ప్రారంభం నుంచే శ్రీముఖి పై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారంతా శ్రీముఖి మీద ఆరోపణలు గుప్పిస్తూ నెగెటివ్ కామెంట్స్ చేయడం చూశాం. ఆమెకు బిగ్ బాస్ సైతం భయపడతారని కొందరు చెప్పడం, షో అంతా ఆమె చుట్టే తిరుగుతుందని ఆరోపణలు చేశారు. దీంతో ఆ ఆరోపణలే శ్రీముఖి కొంప ముంచాయా..? అనే కోణంలోనూ చర్చలు నడుస్తున్నాయి.

శ్రీముఖి ఓటమిపై విశ్లేషణలు.. ఆ ఒక్క కారణమే!
బిగ్ బాస్ ప్రారంభానికి ముందే టైటిల్ శ్రీముఖికి ఫిక్స్ అయిందని గాయత్రి గుప్తా లాంటి వారు కూడా చెప్పేశారు. కానీ చివరకు చూస్తే ఆమె రన్నరప్‌గా నిలిచింది. దీంతో శ్రీముఖి ఓటమిపై కారణాలు విశ్లేషిస్తున్నారు. శ్రీముఖి విన్నర్ కాకపోవడం వెనుక అసలు కారణం ఒకటుందని చెప్పుకుంటున్నారు.

అందుకే చివరకు రాహుల్‌ని చేశారు
ఆ ఒక్క కారణమే శ్రీముఖి ఓవర్ యాక్షన్ అని చెప్పుకుంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు. హౌస్‌లో శ్రీముఖి చాలా ఓవర్ యాక్షన్ చేసిందని హౌస్‌మేట్స్ కూడా ఆరోపించారు. ఆ ఓవర్ యాక్షన్ ఆమె ఓటమిలో ప్రధాన భూమిక అంటున్నారు. ఇన్ని ఆరోపణలు వచ్చాక కూడా శ్రీముఖినే విన్నర్‌గా ప్రకటిస్తే బిగ్ బాస్‌పై నెగెటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉందని, అందుకే చివరకు రాహుల్‌ని విన్నర్‌గా అనౌన్స్ చేశారని టాక్ నడుస్తోంది.


Click it and Unblock the Notifications











