twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గొడవ పడిన రోజా, నాగబాబు.. సోషల్ మీడియాలో సెన్సేషనల్ వీడియో

    |

    Recommended Video

    Avunu Valliddaru Godava Paddaru Promo

    బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో అంటే ముందుగా గుర్తొచ్చేది నాగబాబు, రోజా ఇద్దరే ఇద్దరు. ఆ ఇద్దరి నవ్వులే ఈ కామెడీ షోకి కితకితలు. అయితే ఎప్పుడైతే ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మొదలయ్యాయో అప్పటి నుంచి ఈ ఇద్దరి జబర్దస్త్ ప్రయాణం హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా వీరు తరుచుగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు, రోజాల మధ్య జరిగిన గొడవ తాలూకు వీడియో నెట్టింట సెన్సేషన్‌గా మారింది. ఇంతకీ ఆ ఇద్దరి మధ్య వచ్చిన గొడవేంటి? వివరాల్లోకి పోతే..

    నాగబాబు, రోజా మధ్య గొడవ

    నాగబాబు, రోజా మధ్య గొడవ

    ప్రస్తుతం బుల్లితెరపై ఓ వీడియో హంగామా చేస్తోంది. ఆ వీడియోలో నాగబాబు, రోజా గొడవ పడుతూ కనిపించడంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే ఇది నిజమైన గొడవ కాదులెండి. ఎప్పటిలాగే బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచడంలో భాగంగా జరిగిన గొడవ. 'ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు' అనే ప్రోగ్రాం కోసం నాగబాబు, రోజా ఇలా గొడవ పడాల్సి వచ్చింది.

    వినాయక చవితి సందర్బంగా..

    వినాయక చవితి సందర్బంగా..

    ప్రతీ పండగకు బుల్లితెరపై వినోదం పంచుతూ ఖుషీ చేస్తున్న ఈ స్టార్స్.. ఎప్పటిలాగే ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా 'ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు' అనే ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రోగ్రాంకి సంబందించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    నవ్వుపైనే అసలు గొడవ.. రోజా, నాగబాబు మాటల యుద్ధం

    నా నవ్వు బాగుంటుందా.. లేక నీ నవ్వు బాగుంటుందా అంటూ నాగబాబు, రోజాల మధ్య జరుగుతున్న వార్ తాలూకు కొన్ని క్లిప్స్ ఈ వీడియోలో చూపించారు. అంతేకాదు ఈ వీడియోలో జబర్దస్త్ కమెడియన్లతో పాటు ప్రదీప్, రవి లాంటి వారి సందడి కూడా కనిపించింది. దీంతో ఈ వినాయక చవితికి ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు అని ఫిక్స్ అవుతున్నారు బుల్లితెర ఆడియన్స్.

    జబర్దస్త్‌కి రోజా గుడ్ బై

    జబర్దస్త్‌కి రోజా గుడ్ బై

    మరోవైపు జబర్దస్త్‌కి రోజా గుడ్ బై చెప్పిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో జడ్జ్ స్థానంలో రోజా బదులుగా శేఖర్ మాస్టర్ కనిపించడంతో రోజా జబర్దస్త్ నుంచి తప్పుకుందని అంటున్నారు. అయితే దీనిపై అఫీషియల్ సమాచారం బయటకు రాకపోవడం గమనార్హం.

    English summary
    In 2019 Ap Elections Ysr cp got presigious win. Roja is also got victory in Nagari. As per latest information roja will fullstop for Jabardasth comedy show. One more intresting news viral on social media. that is..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X