అభిజీత్ విజయానికి అసలు కారణం ఇదే: వాళ్లు చేసిన తప్పే అతడికి ప్లస్ అయింది

గ్రాండ్ ఓపెనింగ్‌తో ప్రారంభం అయింది బిగ్ బాస్ నాలుగో సీజన్. 105 రోజుల పాటు సాగిన ఈ షో.. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌తో ముగిసింది. అంగరంగ వైభవంగా జరిగిన ఇందులో సినీ తారలు అదిరిపోయే ప్రదర్శనతో అలరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక, ఈ ఎపిసోడ్ చివర్లో అందరూ అనుకున్నట్లుగా అభిజీత్‌ను విన్నర్‌గా ప్రకటించాడు హోస్ట్ అక్కినేని నాగార్జున. చిరంజీవి అతడికి బిగ్ బాస్ విన్నింగ్ ట్రోఫీని అందించాడు. ఈ నేపథ్యంలో అసలు అతడు ఎలా గెలిచాడు అన్న దానిపై స్పెషల్ స్టోరీ మీకోసం!

మాస్టర్ మైండ్ అనిపించుకున్నాడు

మాస్టర్ మైండ్ అనిపించుకున్నాడు

సాదాసీదా కంటెస్టెంట్‌గానే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అభిజీత్. షో ఆరంభంలో అతడిపై ఎలాంటి అంచనాలూ లేవు. అమ్మాయిలతో ట్రాకులు నడపడం కోసమే అతడిని ఎంపిక చేసుంటారని అంతా అనుకున్నారు. అయితే, క్రమ క్రమంగా అభిజీత్‌లోని టాలెంట్‌ బయటకు వచ్చింది. మాస్టర్ మైండ్‌తో అతడు తీసుకున్న నిర్ణయాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

క్లిష్ట సమయంలో సహనంగా ఉంటూ

క్లిష్ట సమయంలో సహనంగా ఉంటూ

నాలుగో సీజన్‌లో మిగిలిన కంటెస్టెంట్లతో పోలిస్తే అభిజీత్ మాత్రమే తక్కువగా గొడవలు పెట్టుకున్నాడు. ఒక్క నామినేషన్ టాస్కుల్లో మినహా అతడు ఎప్పుడూ కామ్‌గానే కనిపించేవాడు. అంతేకాదు, క్లిష్ట సమయంలోనూ సహనాన్ని ప్రదర్శిస్తూ అబ్బురపరిచాడు. అదే అతడికి బాగా కలిసొచ్చింది. మోనాల్.. అఖిల్ ప్రవర్తించిన తీరు కూడా అభిజీత్‌కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.

11 సార్లు నామినేట్ అవడం వల్ల ప్లస్

11 సార్లు నామినేట్ అవడం వల్ల ప్లస్

ఫిజికల్ టాస్కుల్లో సరిగా ఆడడం లేదనో.. తనతో కలవడం లేదనో.. హౌస్‌లో కొందరితోనే ఉంటున్నాడనో.. తనను హర్ట్ చేశాడనో.. ఇలా ఎన్నో కారణాలతో అభిజీత్‌ను హౌస్‌మేట్స్ అంతా కలిసి 11 సార్లు నామినేట్ చేశారు. నామినేషన్ జరిగిన 14 వారాల్లో 11 సార్లు నామినేట్ అవడం వల్ల ప్రేక్షకులు అతడికి ఓట్లు వేయడానికి అలవాటు పడ్డారు. ఇది కూడా అతడి విజయానికి కారణమైంది.

మాజీ కంటెస్టెంట్ల మద్దతుతో ఓటింగ్

మాజీ కంటెస్టెంట్ల మద్దతుతో ఓటింగ్

నాలుగో సీజన్‌లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు అభిజీత్ గురించి మంచిగా చెప్పేవారు. అదే సమయంలో బయటకు వచ్చిన నోయల్ సీన్, లాస్య మంజునాథ్ సహా గత సీజన్లకు చెందిన మాజీ కంటెస్టెంట్లలో చాలా మంది అభిజీత్‌కు మద్దతు ప్రకటించారు. అంతేకాదు, అతడి గెలుపు కోసం సోషల్ మీడియా వేదికగా ప్రచారం కూడా చేశారు. ఇది కూడా అతడికి బాగా ఉపయోగపడింది.

సినీ ప్రముఖుల సపోర్టు వల్ల మేలు

సినీ ప్రముఖుల సపోర్టు వల్ల మేలు

కొన్ని సినిమాల్లో నటించడంతో అభిజీత్ అంటే ఏంటో సినీ ప్రముఖులకు కూడా తెలుసు. అందుకే క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ, మెగా బ్రదర్ నాగబాబు, సీనియర్ హీరో శ్రీకాంత్ సహా ఎంతో మంది అతడికి సపోర్ట్ చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా పోస్టులో, వీడియోలో వదిలారు. వీళ్లే కాదు.. ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది అతడికి అండగా నిలిచారు. దీంతో అభీకి ఓట్లు బాగా పడ్డాయి.

Recommended Video

Bigg Boss Telugu 4 : Netizens trolls bigg Boss for splitting winner Abhijeet prize money to Sohel
అభిజీత్‌ విజయానికి పునాది అక్కడే

అభిజీత్‌ విజయానికి పునాది అక్కడే

అభిజీత్‌కు ఇంత పేరు రావడానికి కారణం.. అతడి విజయానికి పునాది పడడం ఒకేసారి జరిగింది. బిగ్ బాస్ ఇచ్చిన రోబో టాస్క్‌లో అతడు దివిని కిడ్నాప్ చేయడం పెద్ద సంచలనం అయింది. అప్పుడు సోహెల్, మెహబూబ్, అఖిల్, మోనాల్‌లు అతడిని తిడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో కొట్టేందుకు మీదకెళ్లారు. అప్పుడే అభి పట్ల ప్రేక్షకుల్లో సానుభూతి పెరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X