Bigg Boss Nominations : నిఖిల్‌పై రివెంజ్.. గుద్దిపడేశారంతే, 10వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా 9 వారాలు పూర్తి చేసుకుని 10వ వారంలోకి అడుగుపెట్టింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న నయని పావని ఎలిమినేట్ కావడంతో అంతా షాక్ అయ్యారు. సండే ఆటపాటలతో అలరించిన హోస్ట్ అక్కినేని నాగార్జున చివరిలో ఈ షాకింగ్ ట్విస్ట్ రివీల్ చేశారు. నయని ఎలిమినేషన్ తర్వాత 10వ వారం నామినేషన్స్ ఓ రేంజ్‌లో జరిగాయి. మరి వీక్ నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారు.. ఏ ఇంటి సభ్యుడిని కంటెస్టెంట్స్ ఎక్కువగా టార్గెట్ చేశారో ఒకసారి పరిశీలిస్తే :

సండే కావడంతో లెహరాయి సాంగ్‌తో నాగ్ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ప్రేరణ భర్త శ్రీపాద్‌కి బర్త్ డే విషెస్ చెప్పారు నాగార్జున. తర్వాత కంటెస్టెంట్స్‌ని రెండు టీమ్‌లు విభజించి సరదా సరదా గేమ్స్ ఆడించాడు. యష్మితో గౌతమ్ డ్యాన్స్ చేయగా.. అక్కకి పెళ్లి చేసిన తమ్ముడు అంటూ కంటెస్టెంట్స్ అంతా సెటైర్లు కూడా వేశారు. ఇలా అంటే తీసుకోలేకపోతున్నానని యష్మి అనగా నాకు కూడా అలాగే ఉందమ్మా అని నాగ్ రిప్లయ్ ఇచ్చారు. నీ గాజులు అందరిపోయాయి సెలక్షన్ ఎవరిదని ప్రశ్నించగా.. నిఖిల్‌దని యష్మి సిగ్గు పడింది.

these contestants nominated for elimination in 10th week in bigg boss telugu 8

తర్వాత ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న యష్మి, గౌతమ్, టేస్టీ తేజలను ఒక్కొక్కరిగా సేవ్ చేశారు నాగార్జున. చివరికి హరితేజ, నయని పావనిలు నిలవడంతో వారిద్దరిని యాక్టివిటీ రూమ్‌కి పిలిచారు. ఇద్దరి ముందు రెండు ఫోటో ఫ్రేమ్స్ పెట్టి సుత్తితో పగులగొట్టమన్నారు. అందులో నయని పావని ఎలిమినేటెడ్ అని రావడంతో ఆమె అందరికీ వీడ్కోలు పలికి స్టేజ్ మీదకి వచ్చింది.

స్టేజ్ పైన నయని పావనితో హౌస్‌లో ఉన్న ఐదుగురు డమ్మీ ప్లేయర్లు ఎవరో చెప్పాలని టాస్క్ ఇచ్చారు నాగార్జున. దీంతో గంగవ్వ, రోహిణి, ప్రేరణ, గౌతమ్, విష్ణుప్రియల పేర్లు చెప్పింది. హౌస్‌లో ముగ్గురు బెస్ట్ కంటెస్టెంట్స్‌ ఎవరు అని నాగార్జున ప్రశ్నించారు. దీనికి హరితేజ, నిఖిల్, పృథ్వీ పేర్లు చెప్పింది నయని పావని. హౌస్‌‌లో అందరి కంటే జెన్యూన్ పర్సన్ పృథ్వీయే అని, నీ మాట మీదే ఎప్పుడు నిలబడు అని చెప్పి అందరికీ నయని పావని బై బై చెప్పింది. వెళ్తూ వెళ్తూ పృథ్వీ చాలా కొంటె కుర్రాడని చెప్పడంతో విష్ణుప్రియ ఫేస్ అదోలా పెట్టింది.

these contestants nominated for elimination in 10th week in bigg boss telugu 8

బిగ్‌బాస్ తెలుగు 8లో ఇప్పటి వరకు బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, నైనిక, ఆదిత్య ఓం, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, మెహబూబ్‌ తాజాగా నయని పావని హౌస్‌ను వీడారు. ఆమె ఎలిమినేషన్ ముగియడంతో బిగ్‌బాస్ హౌస్‌లో 10వ వారానికి గాను నామినేషన్స్ ఎప్పటిలాగే‌ హోరాహోరీగా జరిగినట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీటిని ఒకసారి పరిశీలిస్తే..

10 వారం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో నిలిచినట్లుగా ప్రచారం జరుగుతోంది . వారు గౌతమ్ కృష్ణ, యష్మి గౌడ, హరితేజ, విష్ణుప్రియ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ. మరి బిగ్‌బాస్ తెలుగు 8లో 10వ వారంలో నామినేషన్స్‌లో ఎవరెవరు నిలిచారో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X