Bigg Boss Nominations : ఆ బ్యాచ్‌ని ఉతికారేసిన టేస్టీ తేజ .. 11వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా 10 వారాలు పూర్తి చేసుకుని 11వ వారంలోకి అడుగుపెట్టింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన రాయల్ క్లాన్ సభ్యులైన గంగవ్వ, హరితేజలు ఒకే వారంలో ఎలిమినేట్ కావడంతో కంటెస్టెంట్స్, ప్రేక్షకులు షాకయ్యారు. గంగవ్వ అనారోగ్య కారణాలతో సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వగా.. ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్న హరితేజ ఆదివారం హౌస్‌ను వీడారు. వీరిద్దరి ఎలిమినేషన్ తర్వాత 11వ వారం నామినేషన్స్ ఓ రేంజ్‌లో జరిగాయి. మరి వీక్ నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారు.. ఏ ఇంటి సభ్యుడిని కంటెస్టెంట్స్ ఎక్కువగా టార్గెట్ చేశారో ఒకసారి పరిశీలిస్తే :
ఆదివారం ఆటపాటలతో బిగ్‌బాస్ షోను రక్తి కట్టించారు హోస్ట్ నాగార్జున నాగార్జున . 10వ వారం గౌతమ్, నిఖిల్, యష్మిగౌడ, ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, హరితేజలు నామినేషన్‌లో ఉన్నారు. నాగార్జున ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ రాగా చివరికి యష్మి - హరితేజలు మిగిలిచారు. దీంతో వీరిద్దరితో పాటు ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ గెలుచుకున్న నబీల్‌ని యాక్టివిటీ ఏరియాకు పిలిచారు నాగార్జున. ఇద్దరిలో ఎవరి కోసమైనా ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను ఉపయోగిస్తావా అని నబీల్‌ను నాగ్ అడిగారు. ఇప్పట్లో దీనిని ఉపయోగించనని అతను ఆన్సర్ ఇచ్చారు.

దీంతో యష్మి, హరితేజలను ఓ బాక్స్ లోపల చేయి పెట్టమన్నారు నాగ్.. గ్రీన్ కలర్ ఎవరి చేతికి అంటుకుంటే వాళ్లు సేఫ్, రెడ్ కలర్ అంటుకుంటే ఎలిమినేట్ అన్నారు. హరితేజ చేతికి రెడ్ కలర్ ఉండటంతో ఆమె ఎలిమినేట్ అయినట్లుగా నాగ్ ప్రకటించారు. హరితేజ ఎలిమినేట్ కావడంతో నిఖిల్, విష్ణుప్రియ బాగా ఎమోషనల్ అయ్యారు. స్టేజ్ పైకి వెళ్లిన తర్వాత హరితేజకు ఓ టాస్క్ ఇచ్చారు నాగార్జున. హౌస్‌లో ముసుగు తీసి ఆడాల్సిన ఐదుగురు వ్యక్తులు ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. దీనికి అవినాష్, టేస్టీ తేజ, ప్రేరణ, నిఖిల్, రోహిణి అని చెప్పి అందరికీ వీడ్కోలు పలికింది హరితేజ.
బిగ్‌బాస్ తెలుగు 8లో ఇప్పటి వరకు బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, నైనిక, ఆదిత్య ఓం, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, మెహబూబ్ , నయని పావని, గంగవ్వ, హరితేజలు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం పాత ఓజీ క్లాన్‌లో నిఖిల్, నబీల్, విష్ణుప్రియ, యష్మి గౌడ, ప్రేరణ, పృథ్వీరాజ్ శెట్టి మిగిలారు. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన రాయల్ క్లాన్‌లో రోహిణి, అవినాష్, టేస్టీ తేజ, గౌతమ్‌లు మిగిలారు. మరో 5 వారాల్లో బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ ముగియనున్న నేపథ్యంలో టాప్ 5లో ఎవరెవరు నిలుస్తారోనని ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఇక 11వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారంటూ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఈ వారం నామినేషన్స్‌లో ఆరుగురు ఉన్నారట. వారు గౌతమ్, టేస్టీ తేజ, పృథ్వీరాజ్, అవినాష్, యష్మిగౌడ, విష్ణుప్రియ. ముఖ్యంగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ విషయంలో చోటు చేసుకున్న గొడవలు నామినేషన్స్‌లో ఎక్కువ కనిపించాయి. ముఖ్యంగా తనకు వరస్ట్ ప్లేయర్ అనే ట్యాగ్ ఇచ్చి.. ఫ్యామిలీ వీక్ కోసమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తనకు ఆ అవకాశాన్ని దూరం చేసినందుకు టేస్టీ తేజ రివెంజ్ తీర్చుకున్నాడని నెటిజన్లు అంటున్నారు. మరి 11 వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











