Bigg Boss Nominations: సోనియా రీ ఎంట్రీ..నిఖిల్‌కి ఇచ్చిపడేసిందిగా, 12వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా 11 వారాలు పూర్తి చేసుకుని 12వ వారంలోకి అడుగుపెట్టింది. 11వ వారంలో ఎలిమినేట్ అవుతారనుకున్న అవినాష్, టేస్టీ తేజ ఇద్దరూ సేవ్ కావడంతో బిగ్‌బాస్ ప్రియులు మంచి వినోదాన్ని అందుకున్నారు. ఈ ఎపిసోడ్ తర్వాత 12వ వారం నామినేషన్స్ ఓ రేంజ్‌లో జరిగాయి. మరి వీక్ నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారు.. ఏ ఇంటి సభ్యుడిని కంటెస్టెంట్స్ ఎక్కువగా టార్గెట్ చేశారో ఒకసారి పరిశీలిస్తే :
ఈ వారం నామినేషన్స్‌లో గౌతమ్, యష్మిగౌడ, పృథ్వీరాజ్ శెట్టి, విష్ణుప్రియ, టేస్టీ తేజ, అవినాష్ ఉన్నారు. హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ రాగా.. చివరికి టేస్టీ తేజ, అవినాష్‌లు మిగిలారు. దీంతో నబీల్‌ను పిలిచిన నాగ్.. వీరిద్దరిలో ఒకరి కోసం నీ ఎవిక్షన్ షీల్డ్ వాడతావా లేక నీ కోసం వాడుకుంటావా అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అవినాష్.. తాను ఆ షీల్డ్ గెలుచుకోవడానికి కారణమైన వారిలో అవినాష్ కీ రోల్ ప్లే చేశాడని, అతని కోసం వాడతానని మరో మాట లేకుండా తేల్చి చెప్పేశాడు.

నబీల్ తన ఎవిక్షన్ షీల్డ్ వాడటంతో అవినాష్ సేవ్ అయ్యాడు. అతను బతికిపోవడంతో తేజను పంపేస్తారని అంతా అనుకున్నారు. కానీ అవినాష్‌కి మించి ఓట్లు రావడంతో అతను కూడా ఈ వారం సేవ్ అయినట్లుగా నాగ్ ప్రకటించడంతో హౌస్‌లో సందడి నెలకొంది. అలా బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లో తొలిసారి ఎలాంటి ఎలిమినేషన్ లేకుండా వారం ముగిసింది. అయితే టేస్టీ తేజ కాకుండా యష్మి, అవినాష్ కనుక ఉండి ఉంటే ఎవిక్షన్ వాడేందుకు ఆలోచించేవాడినని నబీల్ తెలిపాడు.
ఇక ఎలిమినేషన్ ముగిసిన వెంటనే ఎప్పటి లాగే నామినేషన్స్‌కు శ్రీకారం చుట్టారు బిగ్‌బాస్. మెగా చీఫ్ అయిన కారణంగా అవినాష్‌ను ఎవరూ నామినేట్ చేయకూడదని చెప్పారు. అయితే గత సీజన్లకు భిన్నంగా ఈ వీక్ నామినేషన్స్ ప్లాన్ చేశాడు. బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లో ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారిని హౌస్‌లోకి తీసుకొచ్చి వారితో ఇద్దరేసి ఇంటి సభ్యులను నామినేట్ చేయాలని చెప్పాడు. ఆ వెంటనే డోర్స్ ఓపెన్ అవ్వగా.. ఎదురుగా సోనియా ఆకుల ప్రత్యక్షమైంది. వచ్చీ రావడంతోనే ప్రేరణ, నిఖిల్‌లను నామినేట్ చేసేసేంది. దీంతో కంటెస్టెంట్స్, ప్రేక్షకులు షాకయ్యారు. సోనియాతో పాటు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కూడా నామినేషన్స్‌లో తమ పాయింట్‌ని గట్టిగానే రైజ్ చేశారట.
ఇక 12వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారంటూ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు ఉన్నారట. వారు రోహిణి, నబీల్, విష్ణుప్రియ, యష్మి, పృథ్వీరాజ్, నిఖిల్, ప్రేరణ . మరి 12వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











