Bigg Boss Nominations : తొడగొట్టిన అవినాష్ .. K బ్యాచ్‌కి ముచ్చెమటలు, 13వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్‌లో భాగంగా 12వ వారం ముగిసి 13వ వారంలోకి అడుగుపెట్టింది. ఎవరూ ఊహించని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న కన్నడ నటి యష్మి గౌడ ఎలిమినేట్ అయ్యారు. ఓటింగ్‌లో తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లుగా నాగ్ ప్రకటించారు. మరోవైపు.. ఎలిమినేషన్ ముగియడంతో 13వ వారం నామినేషన్స్‌లో ఎవరున్నారు అనేది ఉత్కంఠగా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..
12వ వారం నామినేషన్స్‌లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో నబీల్, యష్మి, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ. నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చాడు నాగార్జున. చివరికి యష్మి- పృథ్వీలు మిగిలిపోయారు. మీ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో మెయిన్ డోరే చెబుతుందని నాగ్ అంటాడు. కౌంట్‌డౌన్ మధ్యలో యష్మీ ఎలిమినేటెడ్ అన్న బోర్డు కనిపించడంతో షాకైన యష్మి.. ఇంటి సభ్యులందరికీ వీడ్కోలు చెప్పి స్టేజ్ మీదకు చేరుకుంది.

ఎలిమినేట్ అవుతానని అనుకున్నావా అని నాగార్జున అడగ్గా.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ రావడం బాగా దెబ్బేసిందని యష్మి చెప్పింది. అనంతరం యష్మి బిగ్‌బాస్ జర్నీని నాగార్జున చూపించగా.. తన తండ్రి వచ్చినప్పటి రోజును తలచుకుని ఆమె ఎమోషనల్ అయ్యింది. తర్వాత హౌస్‌లో నీ ఫ్రెండ్స్ ఎవరు? నీ శత్రవులెవరు? చెప్పాలంటూ నాగార్జున ఓ టాస్క్ ఇస్తాడు. దీంతో తన తోటి కన్నడ బ్యాచ్ నిఖిల్, ప్రేరణ, పృథ్వీలతో పాటు విష్ణుప్రియలను ఫ్రెండ్స్‌గా చెప్పింది. శత్రువుల విషయానికి వస్తే .. గౌతమ్, అవినాష్, రోహిణిలను పేర్కొంది. ఇక బిగ్‌బాంబ్ పేరుతో నిఖిల్ - గౌతమ్‌లలో ఒకరిని నామినేట్ చేయమని నాగ్ చెప్పగా.. గౌతమ్ పేరు చెప్పింది యష్మి. దీంతో గౌతమ్ ఈ వారం నేరుగా నామినేషన్స్‌కి వచ్చాడు.
మొత్తంగా 12 వారాల వరకు బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, నైనిక, ఆదిత్య ఓం, కిర్రాక్ సీత, మెహబూబ్, గంగవ్వ, హరితేజ, యష్మి గౌడలు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతానికి నిఖిల్, నబీల్, పృథ్వీ , ప్రేరణ, విష్ణుప్రియ, అవినాష్, రోహిణి, టేస్టీ తేజ, గౌతమ్‌లు హౌస్‌లో ఉన్నారు. మరికొద్దివారాల్లో బిగ్‌బాస్ తెలుగు 8 ముగుస్తుండగా .. 13వ వారం ఎవరు హౌస్‌ను వీడబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.
యష్మి గౌడ ఎలిమినేట్ అయిన వెంటనే బిగ్‌బాస్ 13వ వారం నామినేషన్స్‌కు శ్రీకారం చుట్టారు. ఎవరైతే ఫైనలిస్టులుగా ఉండకూడదని అనుకుంటున్నారో వారిపై రంగు పోసి నామినేట్ చేయాలని చెప్పాడు బిగ్‌బాస్. ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరు ఇంటి సభ్యులను నామినేట్ చేయొచ్చని.. మెగా చీఫ్ అయినందున రోహిణిని ఎవ్వరూ నామినేట్ చేయకూడదని ఆదేశించాడు. నామినేషన్స్ సందర్భంగా గౌతమ్ - నబీల్, అవినాష్ - పృథ్వీల మధ్య వాడివేడి ఆర్గ్యూమెంట్ నడిచింది.
మరోసారి తనను నామినేట్ చేయడంతో అవినాష్ తొడగొట్టడం హాట్ టాపిక్‌గా నిలిచింది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు బట్టి 13వ వారం ఏడుగురు ఇంటి సభ్యులు నామినేషన్స్‌లో ఉన్నారట. వారు నిఖిల్, పృథ్వీ , ప్రేరణ, విష్ణుప్రియ, అవినాష్, టేస్టీ తేజ, గౌతమ్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











