Bigg Boss Nominations : షాకిచ్చిన బిగ్‌బాస్.. వాళ్లందరికీ డైరెక్ట్ నామినేషన్స్ , 14వ వారం లిస్ట్ ఇదే!

బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా 13వ వారం పూర్తి చేసుకుని 14వ వారంలోకి అడుగుపెట్టింది. మరికొద్దివారాల్లో సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. ఈ వారం టేస్టీ తేజ, పృథ్వీలు ఎలిమినేట్ కాగా.. 14వ వారానికి సంబంధించి నామినేషన్స్ ఎలా జరిగాయి? ఎవరెవరు నామినేషన్స్‌లో ఉన్నారు? ఏ కంటెస్టెంట్‌ని ఎక్కువగా టార్గెట్ చేశారంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లుగానే 13వ వారం బిగ్‌బాస్ తెలుగులో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం టేస్టీ తేజా ఎలిమినేట్ కాగా.. ఆదివారం పృథ్వీలు హౌస్‌ను వీడారు. ఈ సీజన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా, కన్నడ బ్యాచ్‌‌లో బలమైన క్యాండిడేట్స్‌లో ఒకరిగా ఉన్న పృథ్వీ ఎలిమినేషన్ ఎవ్వరూ ఊహించలేదు. సండే కావడంతో ఆటపాటలతో అలరించారు నాగార్జున. నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చిన ఆయన.. ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్ ముగిసిన వెంటనే చివరికి మిగిలిన పృథ్వీ, విష్ణుప్రియలను యాక్షన్ రూమ్‌కి పిలిపించాడు.

these contestants nominated for elimination in 14th week in bigg boss telugu 8

వారిద్దరి ముందు రెండు అక్వేరియంలు పెట్టి.. లిక్విడ్ వేశాక ఎవరి వాటర్ అయితే రెడ్ కలర్ ‌లోకి మారిపోతాయో వారు ఎలిమినేట్ అయినట్లు అని చెబుతారు నాగ్. విష్ణుప్రియ వాటర్ ఎల్లో కలర్ రాగా.. పృథ్వీ వాటర్ రెడ్ కలర్‌లోకి మారిపోయాయి. దీంతో పృథ్వీ ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించారు. ఆ మాట వినగానే పక్కనే ఉన్న విష్ణుప్రియ బాగా ఎమోషనలై హగ్గు ఇచ్చింది. నిఖిల్, నబీల్, ప్రేరణ హగ్గు ఇచ్చినప్పుడు మాత్రం పృథ్వీ భావోద్వేగానికి గురయ్యాడు.

స్టేజ్ మీదకి రాగానే పృథ్వీకి తన జర్నీ చూపించగా.. ఎక్కువగా విష్ణుతో లవ్ ట్రాక్‌ని హైలైట్ చేశారు. అనంతరం స్టేజ్ మీద పృథ్వీకి ఒక టాస్క్ ఇచ్చాడు నాగార్జున. హౌస్‌లో ఉన్న వారిలో సూపర్‌హిట్, సూపర్ ప్లాప్ ఎవరో చెప్పాలని అన్నాడు. నిఖిల్, నబీల్, విష్ణులకు సూపర్‌హిట్.. రోహిణి, అవినాష్‌లకు సూపర్‌ఫ్లాప్స్ ఇచ్చాడు. నామినేషన్స్‌లోకి వచ్చి.. జనాల్లోకి వెళ్లి నిరూపించుకోవాలని వారికి సలహా ఇచ్చాడు. 13 వారాలు హౌస్‌లో కొనసాగడానికి కారణం మీరేనంటూ ఆడియన్స్‌కి థ్యాంక్స్ చెప్పాడు పృథ్వీ. బయటికి వెళ్లాక నిఖిల్, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియలకు ఓటేస్తానని పృథ్వీ చెప్పాడు.

ఇదిలాఉండగా.. బిగ్‌బాస్ తెలుగు 8లో 14వ వారం నామినేషన్స్ విషయానికి వస్తే . బిగ్‌బాస్ ఈసారి ట్విస్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందరినీ గార్డెన్ ఏరియాకి పిలిపించిన బిగ్‌బాస్.. ఈసారి ఆడియన్స్ నిర్ణయం ప్రకారం నామినేషన్స్‌లో ఉంటారని చెప్పాడు. అవినాష్ ఫైనలిస్ట్ కావడంతో అతనిని తప్పించి నిఖిల్, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ, గౌతమ్, రోహిణిలు నేరుగా నామినేట్ అయినట్లుగా చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. మొత్తం మీద 14వ వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో నిలిచారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో? ఎవరు గ్రాండ్ ఫినాలేలో అడుగుపెడతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X