Bigg Boss 8 Nominations: వాళ్ల జోలికొద్దన్న బిగ్‌బాస్..లాస్ట్ మినిట్‌లో ట్విస్ట్, ఈ వీక్ నామినేషన్స్‌లో వీళ్లే
బిగ్‌బాస్ తెలుగు 8 ఉత్కంఠ భరితంగా సాగుతోంది. మొత్తం 14 మందితో ఈ సీజన్ ప్రారంభం కాగా.. వీరిలో ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. వారిలో బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల తొలి నాలుగు వారాలు ఎలిమినేట్ కాగా.. 5వ వారం మిడ్ వీక్‌లో ఆదిత్య ఓం, ఆదివారం నాడు నైనికలు హౌస్‌ను వీడారు. వీకెండ్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని చెప్పినట్లుగానే బిగ్‌బాస్ చేశాడు. మొత్తం 8 మంది వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లో అడుగుపెట్టడంతో సీజన్ కొత్త టర్న్ తీసుకుంది. మరి ఈ వారం ఎవరు ఎవరిని నామినేట్ చేశారో చూస్తే :
బిగ్‌బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ద్వారా గత సీజన్లలో కంటెస్టెంట్స్‌గా చేసిన హరితేజ, టేస్టీ తేజ, నయని పావని, మెహబూబ్, రోహిణి, గౌతమ్ కృష్ణ, ముక్కు అవినాస్, గంగవ్వలు ఎంట్రీ ఇచ్చారు. వీరితో కలిపి మొత్తంగా ఇప్పుడు 16 మంది హౌస్‌లో ఉన్నారు. ఇప్పటికే ఇంట్లో ఉన్న వారిని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్‌గా.. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చినవాళ్లను రాయల్ క్లాన్‌గా వ్యవహరించనున్నారు. కొత్తగా ఎంట్రీ ఇచ్చినవాళ్లకు ఆల్రెడీ బిగ్‌బాస్‌లో ఉన్న అనుభవం ఉండటంతో ఇక నుంచి షో అదిరిపోతుందని.. వీరిని ఎదుర్కోవడం పాత వారికి కష్టమేనని బిగ్‌బాస్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఫిజికల్ టాస్క్‌ల్లో మెహబూబ్, గౌతమ్ లాంటి వారు చెమటలు పట్టించగలరు.

వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చినవాళ్లంతా గతంలో మధ్యలోనే బిగ్‌బాస్‌ను విడిచి వెళ్లడంతో బాగా డిజప్పాయింట్ అయ్యామని అంటున్నారు. ఈసారి కప్ సాధించి తీరతామని చెబుతున్నారు. గంగవ్వ అయితే అప్పుడు ఆరోగ్యం బాలేక హౌస్‌ను వీడానని ఈసారి మాత్రం మీరు వెళ్లగొట్టే వరకు వెళ్లేది లేదని తేల్చిచెప్పిందంటే వీళ్ల ఫైర్ అర్ధం చేసుకోవచ్చు. స్టేజ్‌పై అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ బిగ్‌బాస్ తమను ఎంతగా మార్చిందో , ఏమిచ్చిందో చెప్పి ఎమోషనల్ అయ్యారు.
మొత్తం 16 మందితో కొత్తగా రెడీ అయిన బిగ్‌బాస్‌లో 6వ వారం నామినేషన్స్ హీటెక్కిపోతాయని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. గత సీజన్‌లలో మాదిరిగా తప్పులు చేయకుండా ఈసారి నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దీనిలో భాగంగా రాయల్ క్లాన్ (వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా వచ్చినవారు) సభ్యులకు ఈ వారం నామినేషన్స్‌లో ఇమ్యూనిటీ ఇచ్చాడు బిగ్‌బాస్. దీని ప్రకారం వారిని నామినేట్ చేయడానికి వీల్లేదు. పాత కంటెస్టెంట్స్.. వాళ్లలో వాళ్లే నామినేట్ చేసుకోవాలన్నది దీని సారాంశం.
మెగా చీఫ్‌గా ఉన్న నబీల్.. రాయల్ క్లాన్ సభ్యులకు బెడ్స్ కేటాయించాడు. బిగ్‌బాస్ ఆదేశాల మేరకు ఓజీ క్లాన్ సభ్యులు (పాత కంటెస్టెంట్స్) వారిలో వారే నామినేట్ చేసుకున్నారు. సోషల్ మీడియా కథనాలను బట్టి బిగ్‌బాస్ తెలుగు 8లో 6వ వారం విష్ణుప్రియ, కిరాక్ సీత, పృథ్వీ, యష్మీగౌడ నామినేట్ అయ్యారు. అయితే ఓజీ క్లాన్‌కి బిగ్‌బాస్ ఓ పవర్ ఇస్తారు.. దీని ప్రకారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వారిలో ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. దీంతో గంగవ్వ, మెహబూబ్‌లు నామినేషన్స్‌లోకి వచ్చారు. మొత్తంగా బిగ్‌బాస్ ఆరో వారం ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారని టాక్.


Click it and Unblock the Notifications











