Bigg Boss 8 Nominations : ఆ బ్యాచ్ మొత్తానికి షాక్ .. 7వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా ఏడో వారంలోకి అడుగుపెట్టింది. 14 మందితో మొదలైన ఈ సీజన్‌లో బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, నైనికలు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం కిర్రాక్ సీత హౌస్‌ను వీడారు. దీంతో పాత ఇంటి సభ్యుల్లో ఏడుగురు హౌస్‌ని వీడినట్లయ్యింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన వారిని రాయల్ క్లాన్‌గా, పాత కంటెస్టెంట్స్‌ని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సీత హౌస్‌ను వీడిన తర్వాత 7వ వారం నామినేషన్స్ ఎలా జరిగాయి.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారు.. ఆ వివరాల్లోకి వెళితే..
దసరా సీజన్ కావడంతో ఆదివారం పండగ సెలబ్రేషన్స్ హౌస్‌లో ఘనంగా జరిగాయి. కంటెస్టెంట్స్‌తో బతుకమ్మ ఆడించడంతో పాటు ఫరియా అబ్ధుల్లా, అమృత అయ్యర్, డింపుల్ హయాతిలు స్టేజ్‌పై తమ పెర్ఫార్మెన్స్‌తో ఇరగదీశారు. గోపీచంద్, శ్రీనువైట్ల తమ విశ్వం సినిమా ప్రమోషన్ కార్యక్రమం కోసం బీబీ హౌస్‌కు వచ్చారు. కంటెస్టెంట్స్‌కి ఐదు టాస్క్‌లు పెట్టగా.. నాలుగింట్లో రాయల్ క్లాన్ విజయం సాధించింది. వారికి మిఠాయిలు, ఓ సర్‌ప్రైజ్ కింద చీఫ్ కంటెండెర్ ట్రోఫీ ఇచ్చారు నాగ్. అంటే 7వ వారంలో చీఫ్ అయ్యేందుకు రాయల్ క్లాన్ పోటీ పడొచ్చన్న మాట. ఈ సీజన్‌లో అన్ని అన్‌లిమిటెడ్ అన్న నాగార్జున.. హౌస్‌లో మరో కొత్త రూమ్ ఓపెన్ చేస్తున్నామని.. కానీ అందులోకి అడుగుపెట్టే ఛాన్స్ ఒక్కరికే ఉంటుందని చెబుతారు. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్‌లో నుంచి ఒకరిని సెలక్ట్ చేయాలని రాయల్ క్లాన్‌కు చెబుతాడు నాగ్.

వీరంతా కలిసి నబిల్ అఫ్రిదిని సెలెక్ట్ చేశారు. దీంతో నాగ్ అతనిని ఇన్ఫినిటీ రూమ్‌కు పంపారు. అందులోకి వెళ్లిన నబిల్‌ని ఏదైనా కోరుకోమనగా.. హౌస్‌మేట్స్ అందరికీ అన్‌లిమిటెడ్ ఫుడ్ కావాలని అడుగుతాడు నబీల్. అయితే ఇందుకు ప్రైజ్ మనీలో కొంత కట్ అవుతుందని నాగ్ కండీషన్ పెట్టగా.. అయినా పర్లేదు ఫుడ్ ఇప్పించమని నబీల్ ఒప్పుకుంటాడు. మధ్య మధ్యలో నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చారు నాగార్జున. చివరికి మెహబూబ్, సీత మిగలగా.. కిర్రాక్ సీత ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించారు.
స్టేజ్‌పైకి వెళ్లిన సీతకు జర్నీ చూపించిన నాగ్.. ఇంత త్వరగా బయటికి వచ్చేస్తానని అనుకున్నావా అని అడుగుతాడు . తాను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదని , అయినా జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డానని.. ఇది విషయం కాదని టేక్ ఈట్ ఈజీ అన్నట్లుగా చెప్పింది సీత. అలాగే హౌస్‌లో ఉన్న వాళ్లలో ఎవరికి వైట్ హార్ట్, ఎవరికి బ్లాక్ హార్ట్ ఇస్తావని నాగ్ అడగ్గా.. విష్ణుప్రియ, నబీల్, అవినాష్ లకు వైట్ హార్ట్ ఇచ్చింది. నిఖిల్, గౌతమ్ కృష్ణ, నయని పావనిలకు బ్లాక్ హార్ట్ ఇచ్చి అందరికీ వీడ్కోలు పలికింది కిర్రాక్ సీత.
స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న సీత హౌస్‌ను వీడటంతో ఏడో వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉండబోతున్నారు అనే దానిపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి ఏడో వారం ఏకంగా 9 మంది నామినేషన్స్‌లో ఉన్నారట. వారు హరితేజ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీరాజ్, గౌతమ్ కృష్ణ, యష్మి గౌడ, నబీల్ అఫ్రిది, టేస్టీ తేజా, నాగ మణికంఠ. దీనిని బట్టి నామినేషన్స్ ఓ రేంజ్‌లో జరిగాయని అర్ధమవుతోంది. మరి సోమవారం నాటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











