Bigg Boss Nominations : పృథ్వీపై కసితీరా .. ఇంతగా పగబట్టారా? 8వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా ఏడువారాలు పూర్తి చేసుకుని 8వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ సీజన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన మణికంఠ ఏడో వారంలో ఎలిమినేట్ కావడంతో అంతా షాక్ అయ్యారు. ఆదివారం ఆటపాటలతో అలరించిన హోస్ట్ నాగార్జున చివరిలో షాకింగ్ ట్విస్ట్ రివీల్ చేశారు. ఎలిమినేషన్ తర్వాత 8వ వారం నామినేషన్స్ ఓ రేంజ్‌లో జరిగాయి. మరి వీక్ నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారు.. ఎవరిని ఎక్కువగా టార్గెట్ చేశారో ఒకసారి పరిశీలిస్తే :

ఆదివారం ఆటపాటలతో షోను మొదలెట్టారు నాగార్జున . బీబీ టైమ్స్ అనే టాస్క్ ఇచ్చి.. హౌస్‌లోని కంటెస్టెంట్‌కు సెట్ అయ్యే హెడ్ లైన్స్‌ను పెట్టాలని చెప్పాడు. ముందుగా ప్రైజ్‌మనీ పెంచేందుకు గడ్డం చేయించుకున్న అవినాష్‌ను మొనగాడు అని మెచ్చుకున్నారు నాగ్. ఈ త్యాగం చేసినందుకు గాను అవినాష్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు నాగార్జున. అతని భార్య పంపిన వాయిస్ మెసేజ్‌ని వినిపించడంతో అవినాష్ ఎమోషనల్ అయ్యారు.

these contestants nominated for elimination in 8th week in bigg boss telugu 8

ఇంతలో మణికంఠను లేపి.. ఆటలో వీక్, డ్రామాలో పీక్.. కన్నీరు మాత్రమే నా ఆయుధం అనే ట్యాగ్ ఇచ్చారు నాగార్జున. దీనికి తోటి కంటెస్టెంట్స్ యస్ అంటూ బోర్డులు ఎత్తారు. దీనికి మణికంఠ డిఫెండ్ చేసుకుంటూ నా బాడీ నా కంట్రోల్‌లో లేదని, నవ్వినా పెయిన్ వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తాడు. మెడికల్ రూంలో అన్ని టెస్టులు చేయించుకున్నావ్.. ఏమైంది అని నాగార్జున అడుగుతాడు. తాను బిగ్‌బాస్ హౌస్‌లో ఇక ఉండలేనని, డిఫెన్స్ చేసుకోలేకపోతున్నానని మణికంఠ వాపోతాడు.

ఈ వారం హరితేజ, మణికంఠ, యష్మిగౌడ, నబిల్, నిఖిల్, టేస్టే తేజ, పృథ్వీ, ప్రేరణ, గౌతమ్ కృష్ణలు నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చారు హోస్ట్ నాగార్జున. చివరికి గౌతమ్ , మణికంఠ మిగులుతాడు. మణికంఠతో పోల్చితే గౌతమ్‌కి తక్కువ ఓట్లు పోలవ్వగా అంతా అతనే హౌస్‌ని వీడతాడని అనుకున్నారు. కానీ మణికంఠ మాత్రం నా వల్ల కాదు ఎలిమినేట్ చేసేయమని బతిమలాడుకున్నాడు. అయితే నాగార్జున మాత్రం ఒకటికి రెండు సార్లు ఛాన్స్ ఇచ్చి ఆలోచించుకోమని చెబుతారు.

లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకూడదని నాగ్ హిత బోధ చేసినా మణికంఠ పూర్తిగా చేతులెత్తేశాడు. చివరికి అతని కోరిక మేరకు బిగ్‌బాస్ సీజన్ 8 నుంచి ఎలిమినేట్ చేసినట్లుగా నాగార్జున ప్రకటించారు. అనంతరం వేదిక మీదకి వచ్చిన మణికంఠను ఎందుకిలా చేశావ్ అని నాగ్ ప్రశ్నించారు. బీబీ హౌస్‌లో చాలా స్ట్రెస్ ఫీలవుతున్నానని.. కానీ ఏదోలా నెట్టుకొస్తున్నానని , ఎలిమినేట్ అయ్యాక చాలా రిలీఫ్‌గా ఉందని చెప్పాడు మణికంఠ. నా ఆరోగ్యం నాకు ముఖ్యమని , బిగ్‌బాస్ వల్ల ఎంతో ఫేమ్ వచ్చిందని చెప్పాడు మణి. నైని పావని, విష్ణుప్రియ, నబీల్, మెహబూబ్, అవినాష్, రోహిణి, హరితేజలను మెచ్చుకుని అందరి దగ్గర సెలవు తీసుకున్నాడు మణికంఠ.

ఇక 8వ వారం నామినేషన్స్ హాట్ హాట్‌గా జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారో సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయి. వీటిని బట్టి ఈ వారం ఆరుగురు నామినేట్ అయ్యారట. వారు నిఖిల్, ప్రేరణ, మెహబూబ్, నయని పావని, విష్ణుప్రియ, పృథ్వీరాజ్ ఉన్నారు. గత వారం హౌస్‌లో జరిగిన సంఘటనలతో ఎక్కువ మంది పృథ్వీని టార్గెట్ చేసినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X