Bigg Boss Nominations : యష్మికి గుద్దిపడేసిన కంటెస్టెంట్స్ .. 9వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా 8వారాలు పూర్తి చేసుకుని 9వ వారంలోకి అడుగుపెట్టింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న మెహబూబ్ ఎనిమిదో వారంలో ఎలిమినేట్ కావడంతో అంతా షాక్ అయ్యారు. ఆదివారం ఆటపాటలతో అలరించిన హోస్ట్ అక్కినేని నాగార్జున చివరిలో ఈ షాకింగ్ ట్విస్ట్ రివీల్ చేశారు. ఎలిమినేషన్ తర్వాత 9వ వారం నామినేషన్స్ ఓ రేంజ్‌లో జరిగాయి. మరి వీక్ నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారు.. ఎవరిని కంటెస్టెంట్స్ ఎక్కువగా టార్గెట్ చేశారో ఒకసారి పరిశీలిస్తే :
ఆదివారం నాడు ఆటపాటలతో అలరించారు నాగార్జున. ముందుగా మెగా చీఫ్‌గా ఎంపికైన విష్ణుప్రియకు ఆయన కంగ్రాట్స్ చెప్పారు. లక్కీ భాస్కర్, క, కంగువా టీమ్, అమరన్ టీమ్‌లు తమ సినిమాల ప్రమోషన్స్ కోసం బిగ్‌బాస్ స్టేజ్‌పై అడుగుపెట్టారు. ఈ సందర్భంగా స్ట్రెయిట్‌గా తెలుగు సినిమా చేస్తానని ప్రామీస్ చేశారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఇక ప్రతీ సీజన్ మాదిరిగానే హైపర్ ఆది 8వ సీజన్‌లోనూ ఎంట్రీ ఇచ్చి తన పంచ్‌లు విసిరారు. ఇక ఈ వారం కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్‌పై నాగ్ రివ్యూ చేసి క్లాస్ పీకి, బాగా ఆడినవారిని మెచ్చుకున్నారు.

8వ వారంలో ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, మెహబూబ్, నయని పావనిలు నామినేషన్స్‌లో నిలిచారు. వీరిలో నలుగురిని నాగార్జున సేవ్ చేస్తూ రాగా.. చివరికి నయని పావని, మెహబూబ్‌లు నిలిచారు. ఓటింగ్‌లో లీస్ట్‌లో నిలిచిన మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లుగా నాగ్ ప్రకటించడంతో హౌస్‌మెట్స్ షాకయ్యారు. 5వ వారం చివరిలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ మూడు వారాల పాటు హౌస్‌లో ఉన్నాడు. అంతేకాదు.. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన 8 మందిలో ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచాడు.
ఊహించని ఎలిమినేషన్‌తో మెహబూబ్ షాకయ్యాడు. స్టేజ్ మీదకొచ్చిన అనంతరం గత సీజన్‌లో దీపావళి పండుగ సమయంలోనే ఎలిమినేట్ అయ్యానని.. ఇప్పుడు కూడా దివాళికే హౌస్‌ను వీడాల్సి వస్తోందని మెహబూబ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ది బెస్ట్ ఇవ్వాలనే ప్రతి టాస్క్‌లోనూ పోరాడానని.. కానీ దురదృష్టవశాత్తూ ఎమోషనల్ అయ్యాడు మెహబూబ్. వెళ్తూ వెళ్తూ హౌస్‌లో ఉన్న వారు ఏ రకం టపాసులో చెప్పాలని నాగ్ టాస్క్ ఇచ్చారు. దీంతో అవినాష్‌ని థౌజండ్ వాలా అని.. గంగవ్వకి లక్ష్మీబాంబ్, నబీల్‌కి తారాజువ్వ, రోహిణికి కాకరవత్తి, గౌతమ్‌కి అగ్గిపెట్టే ఇచ్చారు మెహబూబ్.
ఎలిమినేషన్ ముగియడంతో బిగ్‌బాస్ హౌస్‌లో 9వ వారానికి గాను నామినేషన్స్ హోరాహోరీగా జరిగాయి. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి 9వ వారం ఐదుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో నిలిచినట్లుగా ప్రచారం జరుగుతోంది . వారు గౌతమ్ కృష్ణ, యష్మి గౌడ, టేస్టీ తేజ, నయని పావని , హరితేజ. అయితే ఆదివారం బిగ్‌బాస్ ముగిసిన తర్వాత టెలికాస్ట్ అయిన ప్రోమోలో అవినాష్.. తాను కడుపునొప్పి తట్టుకోలేకపోతున్నానని చెప్పాడు. ఇక నా వల్ల కాదని నేను వెళ్లిపోతానని అంటాడు. అతను హౌస్‌ను వీడాడా.. బిగ్‌బాస్ తెలుగు 9వ వారంలో నామినేషన్స్‌లో ఎవరెవరు నిలిచారో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











