Bigg Boss Telugu 8: ఆ కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ షాక్.. చివరి నిమిషంలో మొండి చెయ్యి
తెలుగులో స్మాల్ స్క్రీన్ దగ్గర అనేక ఛానెల్స్ ఉన్నాయి. వాటిలో ఎన్నెనో ధారావాహికలు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు మరెన్నో వినూత్న షోలు కూడా ఉన్నాయి. కాగా ఒకరకమైన షోలతో వెళుతున్న సమయంలో తెలుగులో వచ్చిన ఒక గేమ్ ఛేంజింగ్ రియాలిటీ గేమ్ షోనే "బిగ్ బాస్". అవ్వడానికి వెస్ట్రన్ దేశాల్లో మొదలైంది. కానీ మన దేశంలో కూడా గట్టి పాపులారిటీ ఈ షోకి ఉంది. అది కూడా మన దేశంలో తెలుగు వెర్షన్ బిగ్గెస్ట్ హిట్ కావడం విశేషం.
ఇలా మొత్తం తెలుగులో ఏడు టెలివిజన్ సీజన్స్ ఓటిటిలో ఒక సీజన్ చేశారు. అయితే ఓటిటిలో మాత్రం తెలుగు వెర్షన్ ప్లాప్ అయ్యింది. దీనితో ఓటిటి వెర్షన్ ని ఆపేసి మొత్తం బుల్లితెర మీద ద్రుష్టి పెట్టారు మేకర్స్. కాగా తెలుగులో ఈసారి ఎనిమిదవ సీజన్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఫైనల్ గా ఆ సమయం రాబోతుంది. ఇప్పటికే చాలా మంది పేర్లు, షో ప్లానింగ్ లు ఇంటర్వ్యూస్ అంటూ చాలానే తతంగం నడిచిపోయింది.

అయితే ఇన్ని రోజులు హౌస్ లోకి ఎవరెవరు వెళతారు ఎవరు కనిపిస్తారు అనే అంశం గట్టిగా వినిపిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు హౌస్ లోకి ఎవరెవరు వెళ్ళరు, ఎవరెవరు కనిపించబోరు అనే విషయాలు వినిపిస్తున్నాయి. కాగా ఇది వరకు చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ లు, యూట్యూబ్ స్టార్స్ ఇంకా జబర్దస్త్ వాళ్ళు కనిపిస్తారు అని చాలా రూమర్స్ ఉన్నాయి.
కానీ అలా వినిపించిన చాలా మంది ఇప్పుడు లేరట. మొదటిగా జబర్దస్త్ నుంచే చూస్తే చమ్మక్ చంద్ర, నరేష్, రియాజ్ వంటి వాళ్ళ పేర్లు గట్టిగా వినిపించాయి కానీ వీళ్ళెవరూ బిగ్ బాస్ కి వెళ్లడం లేదట. అలాగే సద్దాం పేరు కూడా వినిపించింది కానీ తాను కూడా వెళ్లడం లేదట. ఇక యూట్యూబ్ సంబంధించి కమెడియన్ బంచిక్ బబ్లు వెళ్తాడని ఆ మధ్య బాగా రూమర్స్ వినిపించాయి.
కానీ బబ్లు కూడా ఈసారి హౌస్ లో కనిపించడు అని తెలుస్తుంది. ఇంకా చాలా మంది ఎక్కువగా ఆశిస్తున్న పేరు తేజస్వి గౌడ.. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ చాలా ఉందని టాక్ ఉంది ఇంకా చాలా మంది ఈమె వెళ్లకుండానే విన్నర్ అంటూ మాట్లాడేసుకునేవారు కూడా ఉన్నారు. కానీ ట్విస్ట్ ఏమిటంటే ఈమె వెళ్ళడానికి ఎంత ఛాన్స్ ఉందొ వెళ్లకపోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉందట.
ఈమెకి బిగ్ బాస్ యాజమాన్యానికి రెమ్యునరేషన్ దగ్గర పొంతన కుదరడం లేదట. ఇందుకే ఈమె తగ్గితే తప్ప బిగ్ బాస్ హౌస్ లో కనిపించదు అని అప్డేట్.. ఇలా ప్రస్తుతానికి వీరైతే దాదాపు బిగ్ బాస్ హౌస్ లో కనిపించరనే తెలుస్తుంది. ఇంకా వీరిలో కొంతమంది అయితే తమకి ఉన్న పర్శనల్ పనులు మూలాన చివరి నిమిషంలో నో చెప్పారట. కాగా ఓ పక్క నాగ్ తన ఎన్ కన్వెన్షన్ కేసులో బిజీగా ఉన్నారు. ఇంకో పక్కక ఈ సెప్టెంబర్ 1 నుంచే షో స్టార్ట్ అవ్వనుంది. దీనితో నాగ్ ఎలా ఈ పరిస్థితిని హ్యాండిల్ చేస్తాడు అని చాలా మంది చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











