వాళ్ల వల్లే మోనాల్ గజ్జర్ ఎలిమినేట్: ఫినాలే ముందు బయటకొచ్చిన షాకింగ్ విషయాలు
పదహారు మంది కంటెస్టెంట్లతో అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది బిగ్ బాస్ నాలుగో సీజన్. ఆ తర్వాత మరో ముగ్గురు వచ్చి చేరడంతో మొత్తం 19 మంది ఇందులో కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున 14 వారాలకు పద్నాలుగు మంది ఎలిమినేట్ అయిపోయారు. గత వారానికి సంబంధించి మోనాల్ గజ్జర్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. వాస్తవానికి ఎప్పుడో ఎలిమినేట్ అవుతుందనుకున్న ఆమె.. ఫినాలేకు ముందు నిరాశతో వెనుదిరిగింది. ఈ నేపథ్యంలో మోనాల్ ఎలిమినేషన్‌కు కారణాలు వాళ్లేనంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

మొత్తం ఐదుగురు సభ్యులు నామినేట్
గత వారం మొత్తం ఆరుగురు సభ్యులు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నారు. వీరిలో అఖిల్ సార్థక్ అంతకు ముందే రేస్ టు ఫినాలే మెడల్ గెలుచుకుని ఫైనల్‌లోకి ముందుగానే అడుగు పెట్టేశాడు. మిగిలిన ఐదుగురిని నేరుగా నామినేట్ చేసిన బిగ్ బాస్.. ప్రేక్షకుల హృదయాలు గెలుచుకునేలా వాళ్లకు కొన్ని టాస్కులను ఇచ్చాడు. వీరిలో నలుగురు ఫినాలేలోకి, ఒకరు బయటకు వెళ్తారని చెప్పాడు.

అభిజీత్‌కు మొదటి నుంచీ సపోర్ట్ అదే
గత వారం నామినేట్ అయిన వారిలో అభిజీత్ ఒకడు. ఆటతో సంబంధం లేకుండా అతడికి మొదటి నుంచీ మద్దతు లభిస్తూనే ఉంది. నిజాయితీగా ఉంటూ ఎవరితోనూ గొడవలకు దిగని అతడి నైజం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఫలితంగా ఎన్నో సార్లు నామినేషన్‌లో ఉన్నా సేఫ్ అవుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే 14వ వారం కూడా ఎక్కువ ఓట్లు సాధించి ఫినాలేలో అడుగెట్టాడు.

సోహెల్‌కు కలిసొచ్చిన అంశాలు ఇవన్నీ
14వ వారం నామినేట్ అయిన వారిలో సయ్యద్ సోహెల్ రియాన్ కూడా ఉన్నాడు. ఈ వారం టాస్కుల్లో అద్భుత ప్రదర్శన చేసిన అతడు ఆరియానాతో గొడవ వల్ల విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ, అఖిల్, మెహబూబ్ ఫ్యాన్స్ మద్దతుతో పాటు రాహుల్ సిప్లీగంజ్ సహా కొందరు టీవీ ఆర్టిస్టులు అతడి సపోర్ట్ చేశారు. దీంతో ఎక్కువ ఓట్లు సాధించి ఎలిమినేషన్ తప్పించుకుని ఫైనల్‌కు చేరాడు.

హారికక వాళ్ల మద్దతు... అఖిల్ కూడా
మొదటి నుంచీ మంచి గేమ్ ఆడుతూ ఫైటర్‌గా పేరు తెచ్చుకుంది హారిక. ఈమె కూడా ఫినాలేలో అడుగు పెట్టింది. గత వారం ఎలిమినేషన్ తప్పించుకోవడం కోసం ఎంతగానో శ్రమించింది. దీనికితోడు, గత బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్లు ఆమెకు మద్దతు తెలపడంతో పాటు నోయల్ సీన్, రోల్ రైడా వంటి వారి సపోర్ట్ ఆమెకు కలిసొచ్చింది. అలాగే, అఖిల్‌తో క్లోజ్ అవడమూ ప్లస్ అయింది.

ఆరియానాకు ఆటతో పాటు వాళ్లందరు
అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్న వారిలో ఆరియానా ఒకరు. ఈమె కచ్చితంగా టాప్-5లో ఉంటుందని తెలుగు ప్రేక్షకులంతా అభిప్రాయపడ్డారు. అందుకు అనుగుణంగానే న్యూట్రల్ ఓట్స్ అన్నీ అమెకే పడ్డాయి. అలాగే, అవినాష్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేశారు. వీరితో పాటు రాహుల్ సిప్లీగంజ్, రోల్ రైడా సహా కొందరు సెలెబ్రిటీల మద్దతుతో ఆమె టాప్ -5లో చోటు దక్కించుకుంది.
Recommended Video

వాళ్లందరి వల్లే మోనాల్ గజ్జర్ ఎలిమినేట్
వాస్తవానికి మోనాల్ గజ్జర్ ఎప్పుడో ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, బిగ్ బాస్ చొరవ వల్లే ఆమె షోలో కొనసాగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇక, చివర్లో లోకల్ కంటెస్టెంట్లకే ప్రేక్షకులు మద్దతు పలికారు. అలాగే, సెలెబ్రిటీలు సైతం మన వారికే అండగా నిలవడంతో గుజరాతీ భామ బయటకు వెళ్లిపోవాల్సి వచ్చిందన్న విశ్లేషనలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











