Survey on BiggBoss Telugu7 మూడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు? ఫిల్మీబీట్ సర్వేలో తేలింది ఇదే
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో అట్టహాసంగా సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. మరోసారి హోస్ట్‌గా నాగార్జున అక్కినేని తెరపైకి వచ్చి.. తనదైన శైలిలో షోను నడిపిస్తున్నారు. తొలి విడుతగా ఇంటిలోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంటర్ అవ్వగా... ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌజ్ లో 12 మంది మాత్రమే ఉన్నారు. అయితే మూడో వారం కంటెస్టెంట్ల గురించి, ఆట తీరు గురించి ఫిల్మీబీట్ తెలుగు పోల్ నిర్వహించింది. ఈ పోల్ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ 7 తెలుగు షోలో రెండో వారం షకిలా ఎలిమినేషన్ కరెక్టేనా? అనే ప్రశ్నకు అవును అని 57 శాతం మంది ఓటు వేయగా... కాదు అని 28 శాతం మంది చెప్పుకు వచ్చారు. ఇక చెప్పలేమని 14 శాతం మంది వెల్లడించారు. ఇక మొత్తం మీద ఈ సర్వేలో తేలింది ఏంటంటే.. షకీలా ఎలిమినేట్ అవ్వడం కరెక్టే అని చాలా మంది భావించారు.

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో మూడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారనే ప్రశ్నకు ఫిల్మీ బీట్ సర్వేలో ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అంటూ 8 శాతం మంది ఓటు వేశారు. ఇక ప్రియాంక జైన్ అని 4 శాతం మంది, రతికా రోజ్ అని 13 శాతం మంది, శుభశ్రీ రాయగురు అని 8శాతం మంది, అమర్‌దీప్ చౌదరి అని 8శాతం మంది, డాక్టర్ గౌతమ్ కృష్ణ అని 8శాతం మంది ఓటు వేశారు. ఇక అత్యధికంగా ఎలిమినేట్ అయ్యేది మాత్రం సింగర్ దామిని అంటూ 47శాతం మంది ఓటు వేశారు. ఇక ఈ వారం దామిని వెళ్లిపోతుందని నెటిజన్స్ భావిస్తున్నారు.

పవర్ అస్త్ర టాస్క్‌లో గౌతమ్ కృష్ణకు అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా? అంటూ అడిగిన ప్రశ్నకు బాగానే రెస్పాన్స్ వచ్చింది. అవును అని 57శాతం రాగా... కాదు అని 21శాతం, చెప్పలేం అని 21 శాతం నమోదు అయింది. ఇక బిగ్ బాస్ హోజ్ లో గౌతమ్ కృష్ణకు అన్యాయం జరిగినట్లు నెటిజన్స్ భావిస్తున్నారు.

బిగ్‌బాస్ తెలుగు 7లో ప్రిన్స్ యావర్‌ను సీరియల్ ఆర్టిస్టులు టార్గెట్ చేస్తున్నారాని అనుకొంటున్నారా? దానిపై అవును అని 62 శాతం,
కాదు అని 18శాతం, చెప్పలేం అని 18శాతం మంది ఓటు వేశారు. ఇక ప్రిన్స్ యావర్ ను టార్గెట్ చేస్తున్నట్లు నెటిజన్స్ అనుకుంటున్నట్లు సర్వేలో తేలింది.

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ ఎలా సాగుతుందని మీరు అనుకొంటున్నారు? అనే ప్రశ్నకు చాలా మంది బాగుంది అని ఓటు వేశారు. 44 శాతం మందికి నచ్చగా.. బాగాలేదు అని 33శాతం, చెప్పలేం 22 శాతం మంది ఓటు వేశారు.



Click it and Unblock the Notifications











