Bigg Boss Telugu 8 : ఆ సీరియల్ నటిపై షాకింగ్ రూమర్స్.. డీలా పడ్డ ఆడియన్స్

తెలుగు బుల్లితెరపై వినోదాన్ని పంచేందుకు రెడీ అయ్యింది స్టార్ మా. కోట్లాది మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 త్వరలో ప్రారంభంకానుంది. దీంతో తెలుగునాట బిగ్‌బాస్ ఫీవర్ పట్టుకుంది. షో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, కంటెస్టెంట్స్‌గా ఎవరెవరు రానున్నారు , కొత్తగా రూల్స్ ఏమైనా వచ్చాయా ఇలాంటి అంశాల గురించి తెలుసుకోవడానికి ఆడియన్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. ఏ నలుగురు కలిసినా ప్రస్తుతం బిగ్‌బాస్ గురించే మాట్లాడుకుంటున్నారు.

గత సీజన్‌ల మాదిరిగానే ఈసారి కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. బిగ్‌బాస్ తెలుగు ప్రారంభమయ్యాక కేవలం రెండు సార్లు తప్పితే మిగిలిన అన్ని సార్లు నాగ్ ఈ షోకి వ్యాఖ్యాతగా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి, నాని మరోసారి హోస్ట్‌లుగా చేశారు. తాజా సీజన్‌కు గాను కొద్దిరోజుల క్రితమే స్టార్ మా ప్రోమోను రిలీజ్ చేసింది. వరాలిచ్చే కింగ్‌గా జీని గెటప్‌లో నాగ్ కనిపించి సందడి చేశారు. ఏం కావాలన్నా లిమిట్ లెస్‌గా ఇస్తానని , కానీ అడిగే ముందే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని చెబుతాడు. ఈ ప్రోమో.. నాగ్ గెటప్ చూస్తే నిర్వాహకులు ఈసారి కొత్తగా ఏదో ప్లాన్ చేసి ఉంటారని నెటిజన్లు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు.

this serial actress not interested as a contestant for bigg boss telugu 8

బిగ్‌బాస్ మేనియా నేపథ్యంలో ఈ షో గురించి అప్‌డేట్స్ తెలుసుకోవడానికి యూట్యూబర్లను, సోషల్ మీడియా ఖాతాలను ప్రేక్షకులు తెగ జల్లెడ పడుతున్నారు. దీంతో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ , ఇతర సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల ఖాతాలను ఫాలో అయ్యే వారి సంఖ్య రీసెంట్‌గా పెరిగింది. బిగ్‌బాస్ 8 తెలుగులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరా అన్నదానిపై చాలా సీక్రసి మెయింటైన్ చేస్తున్నారు నిర్వాహకులు . సోషల్ మీడియాలో మాత్రం యాదమ్మ రాజు, రీతూ చౌదరి, విష్ణుప్రియ, బర్రెలక్క, కుమారి ఆంటీ, అబ్బాస్, అంబటి రాయుడు, రాజ్ తరుణ్, సౌమ్యా రావు సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఎక్కువ మంది వీళ్ల పేర్లే చెబుతుండటంతో .. దాదాపుగా వీరు కన్ఫర్మ్ అయినట్లుగానే ఆడియన్స్ భావిస్తున్నారు.

ఇప్పటికే ఇంటర్వ్యూలు, ఫైనల్ కాల్ పూర్తయ్యిందని.. ఎంపికైన కంటెస్టెంట్స్‌ను త్వరలోనే క్వారంటైన్‌కు తరలించి, వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈసారి దాదాపు 20 మంది హౌస్‌లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎప్పటిలాగే ఈ షోకి ఒకరిద్దరు సీరియల్ నటులు కంటెస్టెంట్స్‌గా ఎంటరవుతారని అంటున్నారు. వీరిలో బుల్లితెర నటుడు, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అమర్‌దీప్ చౌదరి సతీమణి తేజస్వినీ గౌడ పేరు బలంగా వినిపిస్తోంది.

కర్ణాటకకు చెందిన ఈమె మల్టీ టాలెంటెడ్. తేజస్విని హౌస్‌లోకి ఎంటరైతే మంచి కంటెంట్ ఇస్తారని చాలా మంది బల్లగుద్ది చెబుతున్నారు. ఇలాంటి దశలో ఆమె గురించి ఓ షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. బిగ్‌బాస్ 8 తెలుగుకు ఈసారి తేజస్విని దూరంగా ఉండనున్నారని కొందరు యూట్యూబర్లు చెబుతున్నారు. ఇప్పటి వరకైతే ఎలాంటి కాంట్రాక్ట్ సైన్‌లు కానీ, ఏమీ జరగలేదని అంటున్నారు. ఒకరేమో తేజస్విని గౌడ బిగ్‌బాస్‌కి వస్తుందని అంటే.. మధ్యలో వీళ్లెందుకు ఇలా మాట్లాడుతున్నారని ఆడియన్స్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X