గుండెల్లో గుచ్చి నామినేట్ చెయ్యాల్సిందే.. హారిక, అభిలకు సోహైల్ కౌంటర్

70రోజుల తరువాత బిగ్ బాస్ హౌజ్ లో మరొక కొత్త తరహా వాతావరణం క్రియేట్ అయ్యింది. ఆదివారం వచ్చిందంటే నాగార్జున ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఇస్తారో అదే తరహాలో ట్విస్టులతో షాక్ లు కూడా ఇస్తుంటారు. ఎవరో ఒకరిని హౌజ్ లో నుంచి ఎలిమినేట్ చేశారు అంటే చాలు ఒక్కసారిగా అందరి ఫేస్ లు మారిపోతాయి. ఇక సోమవారం నామినేషన్ల ప్రక్రియ కూడా మరింత వేడెక్కుతోంది. రీసెంట్ గా స్టార్ మా వదిలిన ప్రోమో మంచి హైప్ క్రియేట్ చేస్తోంది.

ఎడవడంలో మోనాల్ రికార్డును బ్రేక్ చేశాడు

ఎడవడంలో మోనాల్ రికార్డును బ్రేక్ చేశాడు

మొన్న ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్టుల తరువాత మెహబూబ్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. నాగార్జున అధివారం సందడి చేస్తూనే చివరి నిమిషంలో కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యేలా చేశాడు. మెహబూబ్ వెళ్ళిపోతున్నాడు అనగానే అతని ప్రాణ స్నేహితుడు సోహైల్ ఎడవడంలో మోనాల్ రికార్డును బ్రేక్ చేశాడు.

గుండెల్లో గుచ్చాలి

గుండెల్లో గుచ్చాలి

ఇక ఈ రోజు ఆటలో సరికొత్త రంగులు క్రియేట్ కాబోతున్నాయి. ఎలిమినేషన్ ప్రక్రియలో నామినేట్ చేసే విధానాన్ని విభిన్నంగా క్రియేట్ చేసే బిగ్ బాస్ ఈ సారి గుండెల్లో గుచ్చే ప్రక్రియను క్రియేట్ చేశాడు. మెడలో హార్ట్ సింబల్ వేసుకున్న కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయాలి అంటే కత్తితో గుచ్చాలి. ఈ ప్రక్రియ కాస్త ఆగ్రహాన్ని తెప్పించేలా ఉంది.

అవినాష్ గండేల్లో గుచ్చిన మోనాల్

అవినాష్ గండేల్లో గుచ్చిన మోనాల్

ఇక సోహైల్ నామినేషన్ స్టార్ట్ చేయగానే తన కోపాన్ని చూపించినట్లు అర్ధమయ్యింది. హారిక, అభిజిత్ లపై అతను కోపంతో రెచ్చిపోయాడు. మధ్యలో వచ్చిన అవినాష్ కి కూడా కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మోనాల్ ఎవరు ఊహించని విధంగా అవినాష్ గుండెల్లో గుచ్చి షాక్ ఇచ్చింది. మీ పనులు మీరు సక్రమంగా చేయకుండా నన్ను ఎలా అంటరాని అవినాష్ కూడా కౌంటర్ ఇచ్చాడు.

లాస్య, అరియానా మధ్య మాటల తూటాలు

లాస్య, అరియానా మధ్య మాటల తూటాలు

ఇక లాస్య, అరియానా మధ్య కూడా మాటల తూటాలు గట్టిగానే పేలాయి. అరియానా నాకు పోటీనే కాదు అంటూ గతంలో లాస్య అన్న మాటలను గుర్తు చేసిన అరియానా ఆమెను నామినేట్ చేసేసింది. ఇక వేస్ట్ గాడు అంటూ హారిక అన్న మాటలను గుర్తు చేసిన సోహైల్ గట్టిగా అరిచేశాడు. దీంతో హారిక నేను కూడా నీ కంటే గట్టిగా అరవగలను అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Abijeet Getting Support From Pawan Kalyan Fans
సోహైల్ vs అభిజిత్

సోహైల్ vs అభిజిత్

ఇక చివరలో అభిజిత్ సోహైల్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ఇదివరకే కొన్నిసార్లు నీకు చెప్పాను అలా మాట్లాడవద్దని అనగానే సోహైల్ ఏ మాత్రం వినకుండా నేను బ్రో బ్యాచ్ కాదు అంటూ.. ఎదో స్టైల్ గా బ్రో అనుకుంటూ ఉండే రకం కాదని కౌంటర్ ఇచ్చాడు. చూస్తుంటే ఈ వారం నామినేషన్ ప్రక్రియ నెవర్ బిఫోర్ అనేలా ఉంది. మరి ఎవరు నామినేట్ అవుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X