శ్రీముఖి ముందే.. అతడిని ముద్దులతో ముంచెత్తిన రీతూ చౌదరి..
బుల్లితెరపై ప్రేక్షకులకు వినోదాన్ని అందించే కార్యక్రమాలు ఇటీవలి కాలంలో తగ్గిపోతున్నాయి. రియాలిటీ షోలు, సింగింగ్ కాంపిటీషన్స్, డ్యాన్స్ షోలతో స్మాల్ స్క్రీన్‌ను నింపేస్తున్నారు. జబర్దస్త్ హిట్ కావడంతో అన్ని ఛానెల్స్ అదే తరహా కంటెంట్‌తో ప్రోగ్రామ్స్‌ను తెరకెక్కిస్తున్నాయి. కానీ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అంతంత మాత్రమే. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై మాటీవీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. సీరియల్స్, కొత్త సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఇలా అన్నింటిలోనూ దూసుకెళ్తూ మంచి టీఆర్‌పీలు అందుకుంటోంది స్టార్ మా. త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్‌తో ఈ ఛానెల్ రేటింగ్స్ దుమ్ములేపుతాయని ఇండస్ట్రీ టాక్.
బిగ్‌బాస్ రేంజ్‌లో మరో ఐకానిక్ షో ఒకటి ఉండాలిన స్టార్ మా ఎన్నో ప్రయోగాలు చేసింది. కానీ వీటిలో చాలా వరకు బెస్ట్ రిజల్ట్ అందించలేదు. ఇలాంటి టైంలో స్టార్ మాలో ప్రసారమైన నీతోనే డ్యాన్స్ 2.0 షో బాగా పాపులర్ అయ్యింది. ఈ డ్యాన్స్ షో ప్రేక్షకుల ఆదరణ పొంది ఏకంగా 13 వారాల పాటు నాన్‌స్టాప్‌గా కొనసాగింది. ఇటీవలే ఈ షోకి ఎండ్ కార్డ్ పడింది. దీనిని రిప్లేస్ చేసేలా స్టార్ మా మరో షోని లాంచ్ చేసింది అదే 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్'. జూన్ 29 నుంచి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారవమవుతున్న ఈ షో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది.

స్టార్ యాంకర్ అనసూయ ఖిలాడీ బ్యూటిస్‌కి , కిర్రాక్ బాయ్స్‌కి శేఖర్ మాస్టర్ లీడర్స్‌గా ఉంటే.. మన రాములమ్మ శ్రీముఖీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ గేమ్‌లో గెలిచిన టీమ్‌కి ఏకంగా రూ.20 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. మొన్నామధ్య ఈ షోలో ఓ చిన్న టాస్క్‌లో భాగంగా అనసూయ తన టాప్‌ని విప్పగా, శేఖర్ మాస్టర్ తన షర్ట్ విప్పి షాకిచ్చారు. దీంతో ఈ షో జనాల్లోకి బాగా వెళ్లింది. ప్రతి వీకెండ్‌లానే ఈ వారం కూడా కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సిద్ధమైంది. ఈ వారం పబ్‌లో జరిగే పార్టీ థీమ్‌తో జంటలుగా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది.
అర్జున్ అంబటి ప్యాంట్‌పై విష్ణుప్రియ జోకులు వేయగా.. కంగారులో మా వైఫ్‌ది వేసుకొచ్చానని అతను పంచ్ విసురుతాడు. రీతూ, చైతూ జంటగా రావడంతో తూ.. చండాలమైన కాంబినేషన్ అంటూ శ్రీముఖీ కామెంట్ చేసింది. అలాగే అస్తమానం శోభ వెంట పడతావెంటీ అని టేస్టీ తేజాని అడగ్గా.. అమ్మాయిలందరూ నా వెంట పడుతున్నారని అతను ఆన్సర్ ఇస్తాడు. అయితే పక్కన అమ్మాయిలు ఎవరూ లేకుండా షోలో అడుగుపెట్టేందుకు యత్నించిన యదమ్మరాజును బౌన్సర్లు అడ్డుకుంటారు. దీంతో అతను ఇద్దరు అమ్మాయిలను తీసుకుని స్టేజ్‌పైకి వస్తాడు.. మీ ఆవిడ చూస్తే ఏం చేస్తావని అడిగితే.. కేబుల్ కనెక్షన్ కట్ చేశానని చెబుతాడు.

కేవలం కిరాక్ బాయ్స్, ఖిలాడి గర్ల్స్ మాత్రమే కాదు.. అనసూయ, శేఖర్ మాస్టర్ కూడా జంటగా వచ్చి స్టెప్పులు వేస్తారు. పాట చివరి వరకు ఉండాలి, మధ్యలో వెళ్లకూడదని అనసూయ అడగ్గా.. ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకుని పాట లాస్ట్ వరకు ఉండకుండా ఎలా వెళ్తానని శేఖర్ మాస్టర్ అంటాడు. అది చూసిన శ్రీముఖీ.. పార్టీ ఉంది అన్నాను కానీ, పోటీ లేదు అనలేదు. పులిహోర కలిపింది చాలని కామెంట్ చేస్తుంది. ఇదే ప్రోమోలో సీరియస్ టాస్క్‌ల్లో పాల్గొంటారు అబ్బాయిలు, అమ్మాయిలు. బాయ్స్ గెలిచిన ప్రతీసారి రీతూ చౌదరిని పిలిచి అల్లం రసం తాగిస్తారు, ఈ క్రమంలో ఆమె శేఖర్ మాస్టర్ వద్దకు వచ్చి అతని బుగ్గపై ముద్దు పెడుతుంది. అది చూసి అంతా షాక్ అవుతారు. చివరిలో శోభాపై కిరణ్ సీరియస్ అవ్వడంతో ప్రోమో ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











