This Week OTT Releases: ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీస్‌లు ఇవే!
This Week OTT Releases: మరో కొత్త వారం వచ్చేసింది అంటే సినిమాల సందడి కూడా మొదలైనట్టే. ప్రతి వారం లాగే ఈసారి కూడా థియేటర్లతో పాటు ఓటీటీ వేదికలపై కూడా అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఉగాది పండుగ సందర్భంగా సినీ ప్రియులకు ఇది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ వారం అని చెప్పాలి. థియేటర్లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', రణ్ వీర్ సింగ్ 'ధురంధర్ 2' సినిమాలు మార్చి 19న విడుదల కానున్నాయి. అదే సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా పలు సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. మార్చి 16 నుంచి మార్చి 22 వరకు దాదాపు 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ వేదికలపై విడుదల కానున్నాయి. మీరు కూడా ఓ లూక్కేయండి.
బోర్డర్ 2 - నెట్‌ఫ్లిక్స్ (మార్చి 20)
ఈ ఏడాది జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలై భారీ విజయాన్ని సాధించిన 'బోర్డర్ 2' సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. 1971 ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన ఈ దేశభక్తి సినిమా మార్చి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్‌జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. భారత సైన్యం చేసిన సాహసాలను చూపించే యాక్షన్, భావోద్వేగ సన్నివేశాలు ఈ మూవీకి ప్రధాన ఆకర్షణ.

జటాధర - జీ5 (మార్చి 20)
హీరో సుధీర్ బాబు నటించిన మిథికల్ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ 'జటాధర' కూడా ఈ వారం ఓటీటీలోకి వస్తోంది. మార్చి 20 నుంచి జీ5లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించగా, సోనాక్షి సిన్హా ప్రతినాయకురాలిగా కనిపిస్తుంది. కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ తిరిగే రహస్యాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.
సుమతీ శతకం - ఈటీవీ విన్ (మార్చి 19)
గ్రామీణ ప్రేమ కథాంశంతో రూపొందిన 'సుమతీ శతకం' సినిమా కూడా ఓటీటీలోకి వస్తోంది. అమర్‌దీప్ చౌదరి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 19 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఒక గ్రామంలో మూఢనమ్మకాల మధ్య ప్రేమ కథ ఎలా ముందుకు సాగుతుంది? ప్రేమ కోసం హీరో ఏం చేశాడు? అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.
సీతా పయనం - సన్ నెక్ట్స్ (మార్చి 20)
ప్రముఖ నటుడు అర్జున్ సర్జా దర్శకత్వంలో రూపొందిన 'సీతా పయనం' మూవీ కూడా ఓటీటీలోకి రాబోతోంది. మార్చి 20 నుంచి సన్ నెక్ట్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఐశ్వర్య అర్జున్, నిరంజన్ సుధీంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రోడ్ రొమాంటిక్ డ్రామా కథ వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించే యువతి జీవితంలో జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది.
కాసరగోడ్ ఎంబసీ - జీ5 (మార్చి 20)
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'కాసరగోడ్ ఎంబసీ' కూడా ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. నకిలీ పాస్‌పోర్టులు, సర్టిఫికెట్లు తయారు చేసే ఇద్దరు కజిన్స్ జీవితాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. క్రైమ్, థ్రిల్లర్ కథలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సిరీస్ మంచి ఆప్షన్‌గా ఉండనుంది.
చిరయ్య - జియో హాట్‌స్టార్ (మార్చి 20)
సున్నితమైన సామాజిక అంశం ఆధారంగా రూపొందిన హిందీ వెబ్ సిరీస్ చిరయ్య. ఈ వెబ్ సిరీస్ కూడా ఈ వారం విడుదల కానుంది. మార్చి 20 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. వైవాహిక అత్యాచారం (Marital Rape) అనే సున్నితమైన అంశంపై ఈ కథ సాగుతుంది. కుటుంబ గౌరవం కోసం నిజాన్ని దాచాలా? లేక న్యాయం కోసం పోరాడాలా? అనే ప్రశ్న చుట్టూ ఈ సిరీస్ కథ తిరుగుతుంది.
జాజ్ సిటీ - సోనీ లివ్ (మార్చి 19)
1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం నేపథ్యంలో రూపొందిన చారిత్రాత్మక మ్యూజికల్ స్పై థ్రిల్లర్ 'జాజ్ సిటీ' కూడా ఈ వారం సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. కళ, సంగీతం, రాజకీయాల మేళవింపుతో ఈ సిరీస్ తెరకెక్కింది.
ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల ఫుల్ లిస్ట్ ఇదే..
నెట్ ఫ్లిక్స్
ఏ డిఫరెంట్ మ్యాన్ - మార్చి 20
బార్డర్ 2 - మార్చి 20
పీకి బ్లెయిండర్స్ ఇమ్మోర్టల్ మ్యాన్ - మార్చి 20
బీటీఎస్ ది కమ్ బ్యాక్ - మార్చి 21
జియో హాట్ స్టార్...
ఆస్కార్ అవార్డ్స్ 2026 - మార్చి 16
చిరాయా - మార్చి 20
వీక్డ్ ఫర్ గుడ్ - మార్చి 21
జీ5
ఆగా ఆగా సుంబాయి - మార్చి 19
లాండ్ లార్డ్ - మార్చి 19
జటాధార - మార్చి 20
కసర్ గాడ్ ఎంబెస్సి - మార్చి 20
సోని లీవ్..
జాజ్ సిటీ - మార్చి 19
అమెజాన్ ప్రైమ్ వీడియో..
ది హౌస్ మెడ్ - మార్చి 19
డెడ్ లాచ్ సీజన్ 2 - మార్చి 20
సన్ నెక్స్ట్..
సీతా పరిణయం - మార్చి 20
వలవార - మార్చి 20
ఈటీవీ విన్..
సుమతి శతకం - మార్చి 19


Click it and Unblock the Notifications











