OTTలోకి ఫ్రైడే ఫెస్టివల్.. ఒక్కరోజే 17 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి మాత్రం?
వీకెండ్ వచ్చేసింది.. సీని జాతర మొదలైంది. ఓటీటీలోకి కొత్త కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి... సందడి చేస్తున్నాయి. ఒకటి రెండు కాదు.. ఏకంగా 32 సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. ఒక్క శుక్రవారం రోజే 17 సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ అవ్వబోతున్నాయి. ఇక అందులో ఏ సినిమా, ఏ సీరిసు ఎక్కడ రిలీజ్ అవ్వనుంది.. అందులో ఏవి ఇంట్రెస్ట్ కలిగిస్తుంది.. కచ్చితంగా చూడాల్సిన సినిమాలు, సిరీసులు ఏంటి.. అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రతి శుక్రవారం సీని ప్రేక్షకులకు పండగే. ఎందుకంటే ఓవైపు థియేటర్లలో సినిమాలు... మరోవైపు ఓటీటీలో చిత్రాలు, సిరీసులు.. సందడి చేస్తాయి. ఇక థియేటర్ దాకా పోయే ఓపిక లేని వాళ్లకు మాత్రం ఓటీటీయే ది బెస్ట్ ఎంటర్ టైన్మెంట్. ఇక ఈ వారం ఎలాగూ పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద లేవు. చిన్న చిన్న చిత్రాలు పోటీ పడుతున్నాయి. దీంతో అందరి చూపు ఓటీటీ కంటెంట్ వైపే ఉంది.

మరి ఓటీటీలో ఈ వారం ఏకంగా 32 సినిమాలు, సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. అందులో శుక్రవారం మాత్రం ఏకంగా 17 సినిమాలు, సిరీసులు ఉన్నాయి. మరి అందులో ఇంట్రెస్ట్ కలిగించేవి ఏంటంటే... ఇప్పటికే జవాన్, స్కంద సినిమాలు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. రామ్ నటించిన స్కంద సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు. ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఓసారి మాత్రం చూడొచ్చు.

మరోవైపు కింగ్ ఖాన్ షారుఖ్ బర్త్ డే కానుకగా జవాన్ సినిమాను రిలీజ్ చేశారు. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే థియేటర్లో చూసినా మళ్లీ చూసేలా కొత్త వర్షన్ తో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. మీరు ఈ సినిమాను థియేటర్లో చూసినా సరే.. మళ్లీ చూసేయండి.

ఎన్టీఆర్ బామ్మర్ది నటించిన మ్యాడ్ సినిమా కూడా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవనుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు వర్షం కురిపించింది. మరి ఓటీటీలోకి రాబోతుంది. ఇక థియేటర్లో మిస్ అయితే కనుక ఈ సినిమా ఓటీటీలో చూడాల్సిన సినిమానే. స్కామ్ 2003: ద తెల్గీ స్టోరీ Vol 2, ఆర్య సీజన్ 3, మ్యాడ్, PI మీనా వంటి వెబ్ సిరీసులు సైతం ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కూడా ఓటీటీలో టైం ఉంటే చూసేయొచ్చు.

ఈ వీకెండ్ ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీసుల లిస్టు ఇదే...
నెట్‌ఫ్లిక్స్
1. లాక్డ్ ఇన్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 01న స్ట్రిమింగ్ అవుతుంది.
2. న్వువో ఒలింపో (ఇటాలియన్ సినిమా) - నవంబరు 01న స్ట్రిమింగ్ అవుతుంది.
3. వింగ్ ఉమెన్ (ఫ్రెంచ్ చిత్రం) - నవంబరు 01న స్ట్రిమింగ్ అవుతుంది.
4. ఆల్ ద లైట్ వుయ్ కాంట్ సీ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 02న స్ట్రిమింగ్ అవుతుంది.
5. సిగరెట్ గర్ల్ (ఇండోనేసియన్ సిరీస్) - నవంబరు 02న స్ట్రిమింగ్ అవుతుంది.
6. హిగ్యుటా: ద వే ఆఫ్ ద స్కార్పియన్ (స్పానిష్ సినిమా) - నవంబరు 02న స్ట్రిమింగ్ అవుతుంది.
7. జవాన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 02న స్ట్రిమింగ్ అవుతుంది.
8. ఒనిముషా (జపనీస్ సిరీస్) - నవంబరు 02న స్ట్రిమింగ్ అవుతుంది.
9. యూనికార్న్ అకాడమీ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 02న స్ట్రిమింగ్ అవుతుంది.
10. బ్లూ ఐ సమురాయ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 03న స్ట్రిమింగ్
11. డైలీ డోస్ ఆఫ్ సన్‌షైన్ (కొరియన్ సిరీస్) - నవంబరు 03న స్ట్రిమింగ్
12. ఫెర్రీ: ద సిరీస్ (డచ్ సిరీస్) - నవంబరు 03న స్ట్రిమింగ్
13. న్యాద్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 03న స్ట్రిమింగ్
14. సెల్లింగ్ సన్‌సెట్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 03న స్ట్రిమింగ్
15. స్లై (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 03న స్ట్రిమింగ్
16. ద టైలర్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) - నవంబరు 03న స్ట్రిమింగ్
17. మ్యాడ్ (తెలుగు సినిమా) - నవంబరు 03న స్ట్రిమింగ్
అమెజాన్ ప్రైమ్
18. నకుల్ గర్ల్ (జపనీస్ సినిమా) - నవంబరు 02
19. తాకేషి క్యాసిల్ జపాన్ (జపనీస్ సిరీస్) - నవంబరు 02
20. టేక్ హిజ్ క్యాజిల్ (హిందీ సిరీస్) - నవంబరు 02
21. ఇన్విన్సబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 03
22. PI మీనా (హిందీ సిరీస్) - నవంబరు 03
హాట్‌స్టార్
23. బిహైండ్ ద ఎట్రాక్షన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 01
24. ద త్రీ డిటెక్టివ్స్ (జర్మన్ సిరీస్) - నవంబరు 01
25. స్కంద (తెలుగు సినిమా) - నవంబరు 02
26. ఆర్య సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 03
ఆహా
27. ఆర్ యూ ఓకే బేబీ? (తమిళ సినిమా) - అక్టోబరు 31
సోనీ లివ్
28. స్కామ్ 2003: ద తెల్గీ స్టోరీ Vol 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 03
బుక్ మై షో
29. హాఫ్ వే హోమ్ (హంగేరియన్ మూవీ) - నవంబరు 03
30. మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 03
31. ద థీప్ కలెక్టర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 03
ఆపిల్ ప్లస్ టీవీ
32. ఫింగర్ నెయిల్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 03
జియో సినిమా
33. టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా (హిందీ సిరీస్) - నవంబరు 03


Click it and Unblock the Notifications











