నీ మొగుడు.. నీ ఇష్టం.. మాకేం సంబంధం.. టెలివిజన్ నటికి షాక్

సీనియర్ నటి తోట హరిత (Thota Haritha) అలియస్ ఘట్టమనేని అఖిలాండేశ్వరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హరిత.. తన సినీ ప్రస్థానాన్ని 'డబ్బు పెద్ద జబ్బు' సినిమాతో ప్రారంభించింది. కేవలం 16 ఏళ్లలో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె వరుస అవకాశాలను అందుకుంది. అలా ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, చినరాయుడు, పేకాట పాపారావు, దొంగ పోలీస్ వంటి సినిమాల్లో నటించే అవకాశం అందుకుంది. ఇక వెండితెర అవకాశాలు తగ్గడంతో బుల్లితెర వైపు అడుగుపెట్టింది.

దాదాపు 80కి పైగా సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించి మెప్పింది. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి మరింత పటిష్టమైన పాత్రలను ఎంచుకుంది. ముఖ్యంగా 'ముద్దమందారం' సీరియల్ ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఆ సీరియల్ ద్వారా ఆమె మరింత మంది ప్రేక్షకులకు చేరువైంది. కేవలం నటిగా మాత్రమే కాకుండా రియాలిటీ షోలలో న్యాయనిర్ణేతగా కూడా తనదైన ముద్ర వేసింది హరిత. సహనటుడు జాకీని వివాహం చేసుకున్న హరిత, కుటుంబ జీవితం , వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కొనసాగిస్తోంది. దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆమె తన 30 ఏళ్ల నట ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది.

Thota Haritha Opens Up on Marriage Modern Relationships amp amp 20-Year Struggle for Recognition

తాజాగా నటి హరిత యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న కిస్సిక్ టాక్స్ షో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె ప్రస్తుత జనరేషన్‌లో ప్రేమ,పెళ్లి, పిల్లలు,డివోర్స్ వంటి విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నాకు ఇదే అలవాటు... మా ఇంట్లో అలాగే ఉండేదాన్ని... నేను ఇంతే..." అనే మాటలు అమ్మాయిలు మాట్లాడకూడదని హరిత సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడం నేర్చుకోవాలన్నారు. వివాహ జీవితంలో గొడవలు సహజమే, కానీ చిన్న చిన్న కారణాలకే సంబంధాలను తెంచుకోవడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

'మా పెళ్లికి ఈ ఆగస్టుతో 25 సంవత్సరాలు పూర్తవుతాయి. గొడవపడి గడప దాటిన రోజు ఒక్కటి లేదు'అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే.. కుటుంబం నుంచి తనకు ప్రత్యేక సపోర్ట్ లేకపోయిందని, "నీ ఇష్టం, నీ మొగుడు, నీ ఇల్లు, నీ కాపురం, మధ్యలో మాకేం సంబంధం' అనే సమాధానం చెప్పేవాళ్లని తెలిపారు. 'భర్త గురించి బయట తప్పుగా చెప్పినా పరువు పోయేది భార్యదే' అని భర్త గౌరవాన్ని కాపాడుకోవడం భార్య బాధ్యత అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అలాగే.. ప్రస్తుతం రిలేషన్‌షిప్‌లపై మాట్లాడుతూ. 'గర్ల్‌ఫ్రెండ్ ఎలా ఉన్నా సరే... కానీ పెళ్లయ్యాక భార్యగా మారితే ఆ బాధ్యతను అర్థం చేసుకోవాలి. 'అప్పుడు నచ్చాను, ఇప్పుడు ఎందుకు నచ్చలేదు?' అని ప్రశ్నించకూడదు. పెళ్లయ్యాక నువ్వు భార్యవే, గర్ల్‌ఫ్రెండ్ కాదు" అని ఆమె చెప్పారు.

తన కెరీర్ గురించి మాట్లాడిన హరిత..'నా గుర్తింపుకి 20 ఏళ్లు పట్టింది' అంటూ భావోద్వేగానికి గురయ్యారు. కొందరికి వెంటనే గుర్తింపు వస్తుందని, కొందరికి పదేళ్లలో వస్తుందని... కానీ తనకు రెండు దశాబ్దాల తర్వాతే దక్కిందని చెప్పారు. 'మనం చదివి పరీక్ష రాస్తే మార్కులు అడిగే హక్కు ఉంటుంది. కానీ నటనలో అలా కాదు. మన కష్టం ఎప్పుడో ఫలిస్తుంది' అని ఆమె వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Read more about: anchor varsha marriage jackie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X