»   »  జైలుగదిలో బిగ్‌బాస్ సభ్యుల బందీ.. మొదటివారమే పరువు తీస్తున్నారు..

జైలుగదిలో బిగ్‌బాస్ సభ్యుల బందీ.. మొదటివారమే పరువు తీస్తున్నారు..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్11 అట్టహాసంగా ప్రారంభమైంది. బిగ్‌బాస్ ఇంటిలోకి చేరిన సభ్యుల్లో ఇద్దరు మొదటి రోజే ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఇంట్లో సర్దుకోకుముందే ఘర్షణకు దిగితున్నారు. తెలుగు బిగ్‌బాస్‌ను చూసిన వారందరూ ఇదేం గేమ్ షో రా బాబూ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. తాజా ఎపిసోడ్‌లో ముగ్గురు సభ్యులను ఇంట్లో ఏర్పాటు చేసిన జైలు గదిలో బంధించడం ఈ షోకు పరాకాష్టకు చేరిందనడానికి నిదర్శనంగా మారింది. వివరాల్లోకి వెళితే..

  మొదటి వారమే మాటల యుద్దాలు

  మొదటి వారమే మాటల యుద్దాలు

  ఇంటి సభ్యుల్లో శిల్పా షిండే, వికాస్ గుప్తా అనే ఇద్దరు ఇంటి సభ్యులు ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుకొంటున్నారు. ఏకంగా హోస్ట్ సల్మాన్ ఖాన్ ఎదుటే వాగ్వాదానికి దిగారు. గత ఐదు రోజుల్లో పలుమార్లు ఘర్షణకు పాల్పడటంతో ఈ షో రచ్చ రచ్చగా మారింది. ఆ దశలో శిల్ప బ్యాగ్‌పూ వికాస్ గుప్తా టీ చల్లడంతో ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకొన్నది.

  కఠిన శిక్ష అమలు

  కఠిన శిక్ష అమలు

  ఇంటి నిబంధనలు ఉల్లఘించిన వారికి కఠిన శిక్షలు విధించడం కోసం ఓ జైలు గదిని ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి ప్రసారమైన ఎపిసోడ్‌లో ఇంటి నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను శిల్పా, జుబేర్ ఖాన్, ఆకాశ్ దల్దానీని జైలు గదిలో బంధించారు. ఈ జైలుగదికి దారుణంగా, అత్యంత కంపుకొట్టే అటాచ్డ్ బాత్రూంనే వీరు వాడుకోవాల్సి ఉంటుంది.

  ముగ్గురు జైలుగదిలోనే

  ముగ్గురు జైలుగదిలోనే

  బిగ్ బాస్ లేదా హోస్ట్ సల్మాన్ ఖాన్ నుంచి ఆదేశాలు వెలువడే వరకు ముగ్గురు ఇంటిసభ్యులను జైలుగదిలోనే ఉంచుతారు. బిగ్‌బాస్11 ప్రారంభమైన తొలివారంలోనే ఈ గేమ్ షో రచ్చ రచ్చగా మారుతున్నది. ఇక మున్ముందు ఎలాంటి ఎపిసోడ్స్ చూడాల్సి వస్తుందో అనే భయం ప్రేక్షకులను వెంటాడటం గమనార్హం.

  సులభమైన బడ్జెట్ టాస్క్

  సులభమైన బడ్జెట్ టాస్క్

  బిగ్‌బాస్‌11లో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే.. ఇంటి సభ్యులతోపాటు హౌస్ చుట్టుపక్కల ఇరుగుపొరుగు వారు కూడా ఉండటం. తొలి లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇంటి సభ్యులకు, ఇరుగుపొరుగ వారికి జరిగింది. అయితే గత సీజన్‌తో పోల్చుకొంటే ఈసారి చాలా సులభమైన బడ్జెట్ టాస్క్‌ను ఇవ్వడం గమనార్హం. ఇరుగు పొరుగు వ్యవహరిస్తున్న లవ్ త్యాగి, మెహ్జాబీ సిద్ధిఖీ, లుసిండా నికోలస్, సవ్యసాచి సతాపతిపై ఇంటి సభ్యులు గెలిచారు.

  English summary
  What an explosive season of Bigg Boss this is turning out to be. Usually they all take a day or two to settle, but the fights and drama began right from the very first week. Shilpa, Zubair Khan and Akash Dadlani are the first contestants to get locked in the kaalkothri. In fact these three will have to spend a considerable time in the jail, until Bigg Boss or Salman Khan decides to relieve them.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more