అది గుర్తొస్తే ఇప్పటికీ బాధే.. చిరంజీవిపై సీనియర్ హీరోయిన్ ఎమోషనల్!
టాలీవుడ్‌లో ఓ సీనియర్ స్టార్ హీరోయిన్‌కు జీవితాంతం మరిచిపోలేని బాధ ఒకటి ఉందట. స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు చేసినా.. మెగాస్టార్ చిరంజీవి పక్కన హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చినా, చివరి నిమిషంలో చేజారిపోయిందట. ఆ సినిమా కోల్పోయిన తర్వాత చాలా రోజులు బాధపడిందట. అంతేకాదు.. ఆ తరువాత అదే చిరంజీవి సినిమాలో మరో కీలక పాత్ర ఆఫర్ వచ్చినా తిరస్కరించిందట. ఇంతకీ చిరంజీవి సినిమా కోల్పోయి అంతగా బాధపడిన ఆ హీరోయిన్ ఎవరు? అసలు ఏం జరిగింది? అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఆ సీనియర్ ఎవరో కాదు.. అలనాటి నటి ఆమని (Aamani). తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది. ముఖ్యంగా 90వ దశకంలో కుటుంబ కథా చిత్రాలు, భావోద్వేగ పాత్రలు, సహజమైన నటనతో ఆమె ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా, పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ హీరోయిన్ నటించిన జంబలకిడి పంబ, మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం సినిమాలు మైల్ స్టోన్ మూవీస్ అనే చెప్పాలి. నటిగా సహజత్వం, భావోద్వేగాలను హృదయానికి హత్తుకునేలా చూపించడంలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని, తన సినీ కెరీర్‌లోని కొన్ని మధుర జ్ఞాపకాలతో పాటు, ఒక పెద్ద బాధను కూడా అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి పట్ల తనకున్న అభిమానాన్ని, ఆయనతో నటించే అవకాశం చేజారిపోవడం ఇప్పటికీ బాధ కలిగిస్తుందని భావోద్వేగంగా చెప్పారు. ఆమని మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే తాను చిరంజీవికి వీరాభిమానినని తెలిపారు. "చిరంజీవి సినిమా అంటే నాకు పండగ. ఆయనను దేవుడిలా ఆరాధించేదాన్ని. స్కూల్ రోజుల్లోనే ఆయన సినిమాలు చూసి అభిమానిగా మారాను. నా డ్రీమ్ హీరో చిరంజీవి" అని అన్నారు. అంతే కాదు.. రాధ, విజయశాంతి వంటి హీరోయిన్లతో చిరంజీవి పాటల్లో నటించిన సన్నివేశాలు చూసి, ఒకరోజు నేనూ ఆయన పక్కన డ్యాన్స్ చేస్తానని ఊహించుకునేదాన్ని అని చెప్పారు.
ఆమని కల నిజమయ్యే అవకాశం రిక్షావోడు (Rickshawodu) సినిమా రూపంలో వచ్చిందట. శుభలగ్నం విజయం తర్వాత దర్శకుడు ఏ కొండరామిరెడ్డి (A. Kodandarami Reddy) తెరకెక్కిస్తున్న రిక్షావోడు సినిమాలో హీరోయిన్‌గా తనను సంప్రదించారని చెప్పారు. ఆ వార్త విన్న వెంటనే ఎంతో సంతోషపోయానని, వెంటనే డేట్స్ కూడా ఇచ్చానని తెలిపారు. అంతేకాదు, చిరంజీవితో ఫోన్‌లో మాట్లాడే అవకాశం కూడా వచ్చిందని చెప్పారు. 'త్వరలో షూటింగ్‌లో కలుద్దాం' అని ఆయన చెప్పడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయని గుర్తుచేసుకున్నారు. ఆ సినిమాలో సౌందర్య కూడా ఉండటంతో ఇద్దరం కలిసి నటించబోతున్నామనే ఆలోచనతో చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నానని తెలిపారు.
అయితే కొద్దిరోజుల తర్వాత పేపర్‌లో హీరోయిన్‌గా నగ్నా పేరు చూసి షాక్ అయ్యానని ఆమని చెప్పారు. వెంటనే తన మేనేజర్‌ను అడగగా, దర్శకుడు మారిపోయారని, కోదండరామిరెడ్డి స్థానంలో కోడి రామకృష్ణ వచ్చారని, అందుకే హీరోయిన్‌ను కూడా మార్చేశారని తెలిసిందన్నారు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యానని, చిరంజీవి పక్కన నటించే అవకాశం చేతుల మీదుగా జారిపోవడం జీవితంలో మర్చిపోలేని బాధగా మిగిలిపోయిందని చెప్పారు. 'ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఏడ్చేదాన్ని' అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
తర్వాత స్టాలిన్ (Stalin) సినిమాలో చిరంజీవికి సోదరి పాత్ర కోసం తనను సంప్రదించారని ఆమని వెల్లడించారు. పలుమార్లు ఫోన్ చేసినా, తాను ఆ పాత్రను తిరస్కరించానని చెప్పారు. 'చిన్నప్పటి నుంచి డ్రీమ్ హీరోగా చూసిన వ్యక్తిని తెరపై అన్నయ్య అని పిలవడం నా వల్ల కాలేదు. హీరోయిన్‌గా ఊహించుకున్న వ్యక్తికి సిస్టర్‌గా నటించడం నాకు కష్టంగా అనిపించింది' అని స్పష్టం చేశారు. చివరకు ఆ పాత్రను కుష్బు సుందర్ (Khushbu Sundar) చేశారు.
తన కెరీర్‌లో ఎన్నో మంచి పాత్రలు చేసి సంతోషంగా ఉన్నప్పటికీ, చిరంజీవి పక్కన ఒక్క సినిమా చేయలేకపోయాననే బాధ మాత్రం ఇంకా అలాగే ఉందని ఆమని అన్నారు. ఒక నటిగా కొన్ని అవకాశాలు చేజారిపోవడం సహజమే అయినా, అభిమాన నటుడితో నటించే ఛాన్స్ మిస్ కావడం జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పారు. ఆమని చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications