8 ఏళ్ల రిలేషన్ బ్రేకప్.. ఆ రోజు చూడకూడనిది చూశా.. బిగ్ బాస్ బ్యూటీ బ్రేకప్ స్టోరీ

బిగ్‌బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన యాంకర్ అరియానా గ్లోరీ. ఈ బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సాధారణంగా చాలా యాక్టివ్‌గా, బోల్డ్‌గా కనిపించే అరియానా.. తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో భావోద్వేగాలు, బాధలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా చిన్న వయసులోనే ప్రేమలో పడటం, ఆ రిలేషన్‌షిప్ కోసం ఎన్నో కలలు కట్టుకోవడం, చివరకు అపార్థాలతో విడిపోవడం గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. మరోసారి తన ప్రేమ, బ్రేకప్ గురించి చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
ఆ సీరియల్ వల్ల చాలా నష్టపోయాను.. కార్తీక్ దీపం డాక్టర్ బాబు చేదు అనుభవం
ఆ సీరియల్ వల్ల చాలా నష్టపోయాను.. కార్తీక్ దీపం డాక్టర్ బాబు చేదు అనుభవం

అరియానా చెప్పిన ప్రకారం.. ఆమె తొమ్మిదో తరగతిలో చదువుతున్నప్పుడే తన బావతో ప్రేమలో పడింది. చిన్నప్పటి నుంచే తండ్రి ప్రేమకు దూరమైన ఆమెకు, తన బావ చూపించిన కేరింగ్ చాలా ప్రత్యేకంగా అనిపించిందట. "తిన్నావా? ఎలా ఉన్నావు?" అంటూ ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోవడం వల్ల అతనితో ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యానని తెలిపింది. అతను విజయవాడలో ఉండేవాడని, తాను తాండూరులో ఉండేదాన్నని చెప్పింది. ఫోన్ కాల్స్, చాట్స్‌తో మొదలైన ఆ బంధం క్రమంగా మరింత బలపడిందని తెలిపింది.

Recommended For You
1000 ఏళ్ల ఆలయంలో ప్రియాంకతో పెళ్లి.. ఆ రూమర్స్‌కు నటుడు శివ్ చెక్!
1000 ఏళ్ల ఆలయంలో ప్రియాంకతో పెళ్లి.. ఆ రూమర్స్‌కు నటుడు శివ్ చెక్!
Throwback Bigg Boss Ariyana Glory Recalls Painful 8-Year Love Story and Emotional Breakup

ఇంటర్ పూర్తి అయిన తర్వాత అరియానా హైదరాబాద్‌కు రావడం, అదే సమయంలో తన బావకు కూడా జాబ్ రావడంతో ఇద్దరూ కలిసి ఒకే చోట ఉండడం మొదలుపెట్టారట. దాదాపు మూడు సంవత్సరాల పాటు ఇద్దరూ కలిసి జీవించారని, ఆ సమయంలో ఒకరిపై ఒకరికి చాలా గాఢమైన అనుబంధం ఏర్పడిందని వెల్లడించింది. "మేమిద్దరం చాలా డీప్‌గా కనెక్ట్ అయ్యాం. అతడే నా ప్రపంచం అనుకునేదాన్ని" అంటూ అరియానా ఎమోషనల్ అయ్యింది.

You May Also Like
రామ్ చరణ్ టాప్ 5 బాక్సాఫీస్ కలెక్షన్స్.. పెద్దితో 1000కోట్ల క్లబ్లో చేరుతారా?
రామ్ చరణ్ టాప్ 5 బాక్సాఫీస్ కలెక్షన్స్.. పెద్దితో 1000కోట్ల క్లబ్లో చేరుతారా?

అయితే ఆ రిలేషన్‌షిప్‌లో అనుకోని మలుపు తిరిగిందని అరియానా తెలిపింది. "ఒకరోజు నేను చూడకూడనిది చూశాను. అది చూసిన తర్వాత నా గుండె బద్దలైంది. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు" అంటూ చాలా ఎమోషనల్‌గా చెప్పింది. అయితే అక్కడ అసలు ఏమి జరిగిందో మాత్రం ఆమె బయటపెట్టలేదు. "ఆ విషయం ఈ ప్రపంచానికి కూడా చెప్పుకోలేను" అని చెప్పడం మరింత ఆసక్తిని పెంచింది. ఆ సంఘటన తర్వాత ఇద్దరూ విడిపోదామని నిర్ణయించుకున్నప్పటికీ, తన బావ వచ్చి సముదాయించడంతో మళ్లీ అతడితో కలిసి కొనసాగానని తెలిపింది.

ప్రతీ ఒక్కరిని తృప్తి పరచడం కష్టం.. అది లోపం కాదు.. ప్రియ ఎమోషనల్ కామెంట్
ప్రతీ ఒక్కరిని తృప్తి పరచడం కష్టం.. అది లోపం కాదు.. ప్రియ ఎమోషనల్ కామెంట్

మరో రెండేళ్ల పాటు ఆ రిలేషన్‌ను కొనసాగించిందట. అయితే అదే సమయంలో తనకు ఆర్జే అవ్వాలనే కోరిక కలిగిందని, దాని కోసం ఒక ట్రైనింగ్ కోర్స్‌లో చేరానని చెప్పింది. అక్కడ ఒక అబ్బాయి పరిచయం కావడం తమ రిలేషన్‌లో పెద్ద సమస్యగా మారిందని తెలిపింది. "ఆ అబ్బాయితో నాకు ఎలాంటి రిలేషన్ లేదు. కానీ మా బావ నాపై అనుమానం పెంచుకున్నాడు. కావాలనే టార్చర్ చేశాడు. ఎంత చెప్పినా అర్థం చేసుకోలేదు" అంటూ అరియానా ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు ఆ అనుమానాల వల్లే ఇద్దరూ విడిపోవాల్సి వచ్చిందని తెలిపింది. "ఇంత అనుమానిస్తుంటే నా వల్ల కాదనిపించింది. అందుకే బ్రేకప్ చెప్పుకున్నాం" అంటూ తన బ్రేకప్ వెనక అసలు కారణాన్ని వెల్లడించింది.

చిరంజీవితో ఆ సీన్ చేశాక.. నన్ను నేను చాలా తిట్టుకున్నాను
చిరంజీవితో ఆ సీన్ చేశాక.. నన్ను నేను చాలా తిట్టుకున్నాను

అయితే బ్రేకప్ తర్వాత కూడా తన బావను మర్చిపోలేకపోయానని అరియానా చెప్పిన మాటలు మరింత భావోద్వేగానికి గురిచేశాయి. "జాబ్ చేస్తున్న రోజుల్లో కూడా అతడే గుర్తొచ్చేవాడు. ప్లీజ్ మాట్లాడూ బావా.. మళ్లీ కలిసిపోదాం అని చాలా బతిమిలాడాను" అంటూ చెప్పింది. అంతేకాదు, తన బావ పుట్టినరోజు సందర్భంగా తెల్లవారుజామున నాలుగు గంటలకు పింక్ కలర్ పట్టు చీర తీసుకుని అతడి ఇంటికి వెళ్లిన విషయాన్ని కూడా గుర్తుచేసుకుంది. "హ్యాపీ బర్త్‌డే బావా అని గిఫ్ట్ ఇచ్చాను. కానీ ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారంటూ తీసుకోలేదు. నేను సంపాదిస్తున్నాను కాబట్టి మొదటిసారి అతడికి ఏదైనా కానుక ఇవ్వాలని అనుకున్నా.. అది కూడా రిజెక్ట్ అయిపోయింది" అంటూ అరియానా కన్నీళ్లు పెట్టుకుంది. "7-8 ఏళ్ల రిలేషన్‌షిప్.. చివరకు సెట్ కాలేదు అంతే" అని చెప్పడం ఆమె మనసులో ఇప్పటికీ ఆ బాధ ఎంత ఉందో చూపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X