1800 కోసం అలాంటి పనులు చేశా.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఒకప్పుడు నెలకు కేవలం రూ.1800 జీతంతో చిన్న చిన్న పనులు చేస్తూ జీవితం నెట్టుకొచ్చిన ఓ బిగ్ బాస్ బ్యూటీ.. ఈరోజు స్టార్ యాంకర్‌గా, సోషల్ మీడియా సెలబ్రిటీగా దూసుకుపోతోంది. అద్దె కట్టేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడిన రోజులు కూడా చూసిందట. ఒకేసారి ఐదారు పనులు చేస్తూ కష్టపడి పైకి వచ్చిన ఈ అందాల భామ.. తాజాగా చేసిన ఎమోషనల్ కామెంట్స్ అందరినీ షాక్‌కు గురిచేశాయి. ఇంతకీ ఇన్ని కష్టాలు దాటి స్టార్‌గా ఎదిగిన ఆ బిగ్ బ్యూటీ ఎవరు? ఆమె జీవితంలో అసలు ఏమైంది?

ఆ బిగ్ బాస్ బ్యూటీ ఎవరో కాదు.. అరియానా గ్లోరి (Ariyana Glory).. ఆ అమ్మడు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో వీడియోలతో గుర్తింపు తెచ్చుకుని, తర్వాత టెలివిజన్ యాంకర్‌గా, ఆపై బిగ్ బాస్ తెలుగు ద్వారా భారీ క్రేజ్ సంపాదించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం టీవీ షోలు, వెబ్ కంటెంట్, ప్రత్యేక కార్యక్రమాలతో బిజీగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఆమె గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ మళ్లీ వైరల్ అవుతోంది. అందులో అరియానా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, కెరీర్ ప్రారంభం గురించి చెప్పిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి.

Bigg Boss Ariyana Glory Reveals 1800 Salary Struggles Before Stardom Journey

అసలు పేరు అరియానా కాదు
ఇంటర్వ్యూలో అరియానా ఓ ఆసక్తికర విషయం వెల్లడించింది. తన అసలు పేరు అరియానా కాదని, తల్లిదండ్రులు పెట్టిన పేరు అర్చన అని తెలిపింది. అయితే ఆ పేరుతో ఉన్న సమయంలో జీవితంలో ఎక్కువ కష్టాలు ఎదురయ్యాయని భావించి, తానే పేరు మార్చుకుని అరియానా గ్లోరీగా మారినట్లు చెప్పింది. పేరు మారిన తర్వాత జీవితంలో మంచి మార్పులు వచ్చాయని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది.

రూ.1800 జీతంతో జీవితం
ఇప్పుడు గ్లామర్ ప్రపంచంలో స్టార్‌గా కనిపిస్తున్న అరియానా.. ఒకప్పుడు చాలా కష్టమైన పరిస్థితుల్లో జీవించిందని చెప్పింది. నెలకు కేవలం రూ.1800 జీతంతో చిన్న చిన్న పనులు చేసేదాన్నని తెలిపింది. కానీ ఆమె ఉండే గది అద్దె మాత్రం రూ.3000 ఉండేదట. దీంతో జీవితం నెట్టుకురావడం ఎంత కష్టమైందో చెప్పుకొచ్చింది. "డబ్బుల కోసం నేను రకరకాల పనులు చేశాను. లైన్లో నిలబడి పన్నీరు చల్లే పని కూడా చేశాను. వచ్చిన డబ్బుతో జీవితం నెట్టుకొచ్చాను" అని ఆమె చెప్పిన మాటలు ఎంతో మందిని కదిలించాయి.

అద్దె కట్టేందుకు కొంత డబ్బు పోగు చేసి పెట్టుకున్న సమయంలో, ఓ అమ్మాయి ఆ డబ్బులు దొంగిలించిందని అరియానా గుర్తు చేసుకుంది. ఆ సంఘటన తన జీవితంలో ఎంతో బాధ కలిగించిన కఠినమైన అనుభవమని తెలిపింది. ఆ సమయంలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని చెప్పింది. జీవితం నిలబడేందుకు ఒకేసారి ఐదు నుంచి ఆరు పనులు కూడా చేసేదాన్నని, ఆ రోజులు చాలా కఠినంగా గడిచాయని పేర్కొంది.

తాను ముందుగా యాంకర్ అవుతానని అసలు అనుకోలేదని అరియానా తెలిపింది. ఒకరోజు టీవీ చూస్తుండగా యాంకర్స్ కావాలనే ప్రకటన చూసి, వెంటనే ఆడిషన్స్‌కు వెళ్లానని చెప్పింది. అదృష్టవశాత్తూ సెలెక్ట్ అయ్యానని, అక్కడి నుంచి చిన్న చిన్న అవకాశాలు రావడం మొదలై, తన కెరీర్ మలుపు తిరిగిందని వెల్లడించింది. ఆ తర్వాత సోషల్ మీడియా వీడియోలు, ఇంటర్వ్యూలు, ప్రత్యేకంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)తో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ద్వారా ఆమె ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఆపై బిగ్‌బాస్‌లో పాల్గొని మరింత పాపులర్ అయింది.

దేవుడు ప్రత్యక్షమైతే నన్ను తీసుకెళ్లమంటా
ఇంటర్వ్యూలో అరియానా చేసిన మరో వ్యాఖ్య పెద్ద చర్చకు దారితీసింది. "మీకు ఏ దేవుడు అంటే ఇష్టం?" అని అడగగా, తాను క్రిస్టియన్‌గా పెరిగినా ఇప్పుడు సుబ్రమణ్య స్వామిపై విశ్వాసం పెరిగిందని చెప్పింది. అంతేకాదు.. "దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే.. నన్ను తన దగ్గరకు తీసుకెళ్లమని అడుగుతాను. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ క్షణమే చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నాను" అంటూ ఎమోషనల్‌గా చెప్పింది. ఏదేమైనా, రూ.1800 జీతం నుంచి స్టార్ యాంకర్ స్థాయికి ఎదిగిన అరియానా గ్లోరీ ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకమే అని చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X