ఆ డైరెక్టర్ అందరి ముందు పైట విప్పమన్నారు.. బిగ్ బాస్ నటి ఎమోషనల్

టాలీవుడ్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న జ్యోతి (Jyoti Labala) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాప్ హీరోస్ నటించిన ఎన్నో మూవీస్ లో సైడ్ రోల్స్ లో, వాంప్ రోల్స్ లో నటించింది. ముఖ్యంగా 'పెళ్లాం ఊరెళితే', మహాత్మ, రంగా ది దొంగ వంటి సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్స్‌తో చాలా ఫేమస్ అయింది. అలాగే బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా కూడా వెళ్ళింది. తాజాగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయిపోయింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో నటి జ్యోతి తన కెరీర్‌లో ఎదురైన పలు సంఘటనలను నిర్మొహమాటంగా పంచుకున్నారు. ఈ తరుణంలో ఓ బడా డైరెక్టర్ పై షాకింగ్ ఆరోపణలు చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణతో పని చేసిన సమయంలో జరిగిన ఒక సంఘటనను వెల్లడించాడు. జ్యోతి సినీ ప్రయాణం సులభంగా సాగలేదు. చిన్న పాత్రలతో ప్రారంభమైన ఆమె కెరీర్, తర్వాత నెగెటివ్, వాంప్ షేడ్స్ ఉన్న పాత్రలతో ముందుకు వెళ్లింది. ముఖ్యంగా ఎవడి గోల వాడిదే సినిమాలో ఆమె చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చాయి. ఈ సినిమాతో వచ్చిన పాపులరిటీ కారణంగా ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం. ఇదే సమయంలో ఆమెకు మరోసారి అదే దర్శకుడి నుండి కిటకిటలు సినిమా కోసం పిలుపు వచ్చింది. అయితే ఈసారి జరిగిన అనుభవం ఆమె కెరీర్‌లో ఒక కీలకంగా మారింది.

Throwback bigg boss Jyothi Labala Reveals Shocking On-Set Incident with Director E V V Satyanarayana

జ్యోతి వెల్లడించిన వివరాల ప్రకారం, "కితకితలు" సినిమా కోసం పిలిచినప్పుడు తన పాత్ర గురించి ముందుగా స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. సాధారణంగా ఒక నటికి పాత్ర వివరాలు, ముఖ్యంగా సున్నితమైన సన్నివేశాలు ముందుగానే చెప్పడం ప్రొఫెషనల్ విధానం. కానీ ఈ సందర్భంలో అలాంటి సమాచారం ఇవ్వలేదని ఆమె అన్నారు. షూటింగ్‌కి వెళ్లిన తర్వాతే అసలు సన్నివేశం గురించి తెలిసిందని, అది తనకు తీవ్ర స్థాయిలో ఉందని తెలియజేసింది.

జ్యోతి చెప్పిన ప్రకారం, ఒక వాంప్ పాత్రలో అందరి ముందే చీర పైట విప్పి మంచంపై పడుకోవాలని అడిగారని చెప్పారు. ఆ సమయంలో సెట్లో లైట్‌మెన్‌లు, యూనిట్ సభ్యులు, ఇతర టెక్నీషియన్లు ఉన్నారని, అలాంటి పరిస్థితుల్లో ఆ సన్నివేశం చేయడం తనకు అవమానంగా అనిపించిందని. "నాకు ఇది కంఫర్టబుల్‌గా లేదు. కనీసం ఈ సీన్‌ను మార్చండి" అని తాను వినయంగా చెప్పానని, దర్శకుడు కోపంగా స్పందించారని ఆమె వివరించారు.

ఈ పరిస్థితుల్లో తాను అనుకున్న వెంటనే సన్నివేశంలో నటించకుండా, షూటింగ్ నుంచి బయటకు వచ్చానని. మేకప్ రూంకు వెళ్లి దుస్తులు మార్చుకుని ఇంటికి వెళ్లిపోయానని చెప్పారు. ఈ తర్వాత జరిగిన సంఘటన తాను ఆ దర్శకుడితో మళ్లీ పని చేయలేదని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ విషయాన్ని చెబుతూ, తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని, ఆ సమయంలో తాను తీసుకున్న నిర్ణయం పూర్తిగా తన స్వాభిమానానికి సంబంధించినదని చెప్పారు.

జ్యోతి ఇంకా మాట్లాడుతూ.. నటులకు కూడా హద్దులు ఉంటాయని ఆమె స్పష్టంగా చెప్పారు. "కెరీర్ కోసం ఏదైనా చేయాలి" అనే ఒత్తిడి చాలా సార్లు వస్తుందని, కానీ ఒకసారి చేసిన పాత్ర జీవితాంతం గుర్తింపుగా మిగిలిపోతుందని ఆమె సూచిస్తుంది. ఒక నటిగా తనకు అనుకూలంగా లేని సన్నివేశాలను తిరస్కరించే హక్కు ఉందని ఆమె వెల్లడించారు.

ఇదే సందర్భంలో జ్యోతి మరో సంఘటనను కూడా ప్రస్తావించారు. ఒక సీనియర్ నటి షూటింగ్ సమయంలో ముందుగా చెప్పకుండా బెడ్‌రూమ్ సీన్ చేయమని అడిగారని, ఆ సమయంలో ఆమె తీవ్రంగా బాధపడ్డారని చెప్పారు. ఈ ఉదాహరణ ద్వారా, సినిమా రంగంలో ట్రాన్స్‌పరెన్సీ ఎంత అవసరమో ఆమె వివరించారు. ముఖ్యంగా మహిళా నటిమణుల విషయంలో ముందస్తు అవగాహన, గౌరవం చాలా ముఖ్యం అని ఆమె చెప్పారు.

అయితే జ్యోతి తన అనుభవాలను చెప్పేటప్పుడు ఇండస్ట్రీ తప్పుపట్టలేదు. తాను పని చేసిన చాలా మంది దర్శకులు, నిర్మాతలు ఎంతో ప్రొఫెషనల్‌గా వ్యవహరించారని, ఇలాంటి సంఘటనలు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఎదురయ్యాయని చెప్పారు. ఇది ఆమె పనితీరు దృక్పథాన్ని చూపుతుంది. ఒకటి లేదా రెండు సంఘటనల ఆధారంగా మొత్తం పరిశ్రమను విమర్శించడం సరికాదని ఆమె భావన. మొత్తానికి, జ్యోతి గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X