చిరంజీవితో ఆ సీన్ చేశాక.. నన్ను నేను చాలా తిట్టుకున్నాను

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు బోల్డ్ క్యారెక్టర్లతో, గ్లామర్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతి (Actress Jyothi). క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో ఆమె నటించిన, బిగ్ బాస్ తెలుగు తొలి సీజన్‌లో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించారు. ఇటీవలి సినిమాలకు దూరంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇటీవల యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న కిస్సిక్ టాక్ షోలో పాల్గొన్నారు. తన సినీ జీవితం, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి ఓపెన్‌గా మాట్లాడారు.

ఈ ఇంటర్వ్యూలో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఒక సీన్ గురించి జ్యోతి చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె మాట్లాడుతూ.. "చిరంజీవి గారితో ఒక సీన్ ఉందని కాల్ వచ్చేసరికి వెంటనే ఒప్పుకున్నాను. అందులోనూ ఆయన కాంబినేషన్‌లో ఒక్కటే సీన్ అన్నారు. చాలా ఎగ్జైటెడ్‌గా షూటింగ్‌కి వెళ్లాను' అని చెప్పింది. అయితే.. ఆ సీన్ చేసిన తర్వాత తనకు ఎంత బాధ కలిగిందో కూడా జ్యోతి చెప్పుకొచ్చారు. "షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్లాక అద్దం ముందు నిలబడి నన్ను నేనే తిట్టుకున్నాను.'నేను చిరంజీవి గారిని రిజెక్ట్ చేశానా?' అని నాకే షాక్ వేసింది.ఆయన లాంటి స్టార్‌ను వదిలేసి ఇంకొకరిని ప్రేమించడం ఏంట్రా అని అనిపించింది" అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది.

Throwback Bigg Boss Jyothi Opens Up About Chiranjeevi Scene and Life Struggles

అయితే జ్యోతి మాట్లాడింది కేవలం సినిమాల గురించి కాదు. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను కూడా ఆమె భావోద్వేగంగా పంచుకున్నారు. "నా కెరీర్ ప్రారంభంలో చాలా లైట్‌గా తీసుకున్నాను. కానీ విడాకుల తర్వాత జీవితం అసలు రంగు చూపించింది. సినిమాలు తగ్గిపోయాయి. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డాను. ఒంటరితనం, బాధ, కష్టాలు ఒక్కసారిగా జీవితాన్ని మార్చేశాయి" అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు.

తన కొడుకే ఇప్పుడు తన ప్రపంచమని కూడా జ్యోతి చెప్పారు. "నా కొడుకు పుట్టిన రెండో నెలకే నా డైవోర్స్ అయ్యింది. అప్పటి నుంచి నేను ఒంటరిగా అతన్ని పెంచుతున్నాను. అతనికి తల్లి, తండ్రి ఇద్దరూ నేనే. నా జీవితంలో ఇప్పుడు ఒకే లక్ష్యం నా కొడుకు మంచి స్థాయిలో సెటిల్ కావాలి" అని అన్నారు.

అలాగే తన వివాహం గురించి కూడా జ్యోతి సంచలన వ్యాఖ్యలు చేశారు. "నా జీవితంలో తీసుకున్న అత్యంత మూర్ఖమైన నిర్ణయం నా పెళ్లి. ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించాను. కానీ అతను మోసం చేశాడు. ఆ బాధలోనే వెంటనే ఇంకొకరి ప్రపోజల్‌కు ఓకే చెప్పి పెళ్లి చేసుకున్నాను. ఆలోచించకుండా తీసుకున్న ఆ నిర్ణయం తర్వాత జీవితాంతం బాధ పెట్టింది" అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం యువతకు, ముఖ్యంగా అమ్మాయిలకు కూడా జ్యోతి కొన్ని సూచనలు చేశారు. "పెళ్లయిన వారిని ప్రేమించొద్దు. అది చివరికి బాధనే ఇస్తుంది. ఎవరైనా తప్పుడు ఆశలు పెడితే వెంటనే దూరంగా ఉండాలి" అని పేర్కొన్నారు. అదే సమయంలో తనకు అర్థం చేసుకునే మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకునే ఆలోచన కూడా ఉందని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X