ప్రతి రాత్రి నరకం.. ప్రేమ పేరుతో మోసం..వాడుకొని వదిలేశాడు..

బిగ్‌బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఇనయా సుల్తానా (Inaya Sultana). ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రేమ, ఒంటరితనం, మోసం వంటి అంశాలపై ఆమె చెప్పిన అనుభవాలు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఏం జరిగింది?

బిగ్‌బాస్ తర్వాత తన కెరీర్ మంచి దశలోకి వెళ్లిందని ఇనయా ఆ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది. వరుసగా ఈవెంట్స్, బ్రాండ్ ప్రమోషన్లు, గెస్ట్ అపియరెన్సులతో బిజీగా గడిచిందని చెప్పింది. ఆ సమయంలో తనకు అవకాశాలే అవకాశాలు వచ్చాయని, ఒక్క సంవత్సరం పాటు జీవితం ఎంతో వేగంగా, ఆనందంగా సాగిందని తెలిపింది. కానీ ఆ హడావిడి ఒక్కసారిగా తగ్గిపోయిన తర్వాత తన జీవితంలో ఒంటరితనం బలంగా కనిపించిందని ఆమె చెప్పింది.

Throwback Inaya Sultana Opens Up on Love Betrayal Emotional Trauma amp amp Life Struggles

ఆ ఒంటరితనం తనను మానసికంగా బలహీనపరిచిందని, బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం చాలా ఖాళీగా ఫీల్ అయ్యేదాన్నని ఆమె తెలిపింది. "ఎవరూ లేరు... నేను లేకపోతే ఎవరికీ పెద్దగా తేడా ఉండదేమో" అనే ఆలోచనలు కూడా తనను వెంటాడాయని చెప్పింది. ఈ భావనను పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో రెండు రోజుల పాటు ఫోన్ ఆఫ్ చేసి, ఎవరితోనూ మాట్లాడకుండా ఇంట్లోనే ఉన్నానని వెల్లడించింది. మూడో రోజు ఫ్రెండ్స్ కాల్ చేసినప్పుడు, "ఈ రెండు రోజుల్లో నాకు ఏదైనా జరిగి ఉంటే?" అనే ఆలోచన తనను మరింత కలచివేసిందని ఆమె చెప్పింది.

అదే సమయంలో తన జీవితంలో ఒక వ్యక్తి ఉంటే బాగుండేదని అనిపించిందని తెలిపింది. ఈ భావోద్వేగ పరిస్థితుల్లోనే తన జీవితంలో "గౌతమ్" అనే వ్యక్తి వచ్చాడని ఆమె చెప్పింది. ఆ వ్యక్తి తనను నిజంగా ప్రేమిస్తున్నాడని నమ్మించాడని, తనకు ఇంతవరకు ఎవరూ ఇవ్వని ప్రేమ, శ్రద్ధ ఇచ్చినట్లు అనిపించిందని తెలిపింది. ఆ ప్రేమను నిజమని నమ్మి తన జీవితాన్ని పూర్తిగా అతనిపై ఆధారపడ్డానని, తన భావాలు, విశ్వాసం, భవిష్యత్తు అన్నీ అతనికే అంకితం చేశానని ఆమె చెప్పింది. కానీ ఆ నమ్మకమే తనను మోసం చేసిందని ఇనయా కన్నీళ్లు పెట్టుకుంది.

"నా ఫేమ్, డబ్బు... అన్నింటినీ వాడుకున్నాడు. అవసరం పూర్తయ్యాక నన్ను వదిలేశాడు" అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి చేస్తానని చెప్పడంతో అతనిపై పూర్తి నమ్మకం పెట్టుకుని శారీరకంగా కూడా దగ్గరయ్యానని ఆమె వెల్లడించింది. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, చివరికి తనను మోసం చేసిన వ్యక్తే సమాజంలో తనను తప్పుగా చూపించే ప్రయత్నం చేశాడని ఆమె ఆరోపించింది. ఈ సంఘటన తన జీవితాన్ని పూర్తిగా కుదిపేసిందని, ఆ సమయంలో తాను తీసుకున్న నిర్ణయాలు తనను ఈ స్థితికి తీసుకువచ్చాయని అంగీకరించింది.

ఇలాంటి మోసాలు సమాజంలో జరుగుతాయని తెలిసినా ఎందుకు జాగ్రత్తగా ఉండలేకపోయానని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఇనయా నిజాయితీగా స్పందించింది. "నాకు అంత ప్రేమ ఎప్పుడూ దక్కలేదు. అందుకే గుడ్డిగా నమ్మేశాను. ఇందులో నాదే తప్పు" అని ఆమె చెప్పింది. ఒక దశలో ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య గురించి కూడా ఆలోచించానని, కానీ తన జీవితం ఒక వ్యక్తి కోసం ముగించుకోవడం సరైంది కాదని భావించి ఆ ఆలోచనను వదిలేసుకున్నానని తెలిపింది.

అయినప్పటికీ ఆ మానసిక గాయం ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉందని, నిద్ర మాత్రలు లేకుండా నిద్ర పట్టని పరిస్థితి వచ్చిందని చెప్పింది. "ప్రతి రోజు నరకంలా అనిపిస్తుంది" అంటూ ఆమె చెప్పిన మాటలు వినేవారిని కదిలించేలా ఉన్నాయి. ప్రస్తుతం ఆమె తన కెరీర్‌పై మళ్లీ దృష్టి సారించి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Read more about: bigg boss inaya sultana tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X