ఆ సమయంలో గలీజ్ కామెంట్స్ తో వేధించారు.. బిగ్‌బాస్ బ్యూటీ ఆవేదన..

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రియాంక జైన్ (Priyanka Jain) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్స్ ద్వారా తెలుగు ఇంటింటికీ చేరుకున్న ఈ బ్యూటీ.. తన అందం, అభినయం, అమాయకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగమ్మాయిలా కనిపించే కట్టు, బొట్టు, సాంప్రదాయ లుక్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. అయితే కెరీర్‌లో ఓ దశలో అదే ప్రియాంక తన డ్రెస్సింగ్ స్టైల్ కారణంగా భారీ ట్రోలింగ్ ఎదుర్కొనడం అప్పట్లో సంచలనంగా మారింది. ఇప్పుడు ఆమె ఇచ్చిన పాత ఇంటర్వ్యూ క్లిప్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముంబైకి చెందిన ప్రియాంక జైన్ దక్షిణాది టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగులో అమ్ములు, మౌనరాగం వంటి సీరియల్స్ ద్వారా ఆమెకు మంచి పేరు వచ్చింది. కుటుంబ కథా నేపథ్య పాత్రల్లో, భావోద్వేగ సన్నివేశాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. దీంతో వరుసగా టీవీ షోలు, ఈవెంట్స్, స్పెషల్ ప్రోగ్రామ్‌లలో అవకాశాలు వచ్చాయి. సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. వినరా సోదరా వీర కుమార, ఎవడు తక్కువ కాదు వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే వెండితెరపై ఆశించిన స్థాయి సక్సెస్ రాకపోయినా.. టెలివిజన్ రంగంలో మాత్రం తన క్రేజ్ కొనసాగింది.

Bigg Boss Priyanka Jain Gets Emotional Over Trolls and Dressing Criticism

బిగ్‌బాస్‌తో పెరిగిన ఫేమ్..
అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ తెలుగు 7 లో ప్రియాంక కంటెస్టెంట్‌గా పాల్గొనడం ద్వారా మరింత పాపులర్ అయింది. హౌస్‌లో తన ఆటతీరు, మాటతీరు, ఎమోషనల్ సైడ్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది. బిగ్‌బాస్ తర్వాత ఆమెకు టీవీ షోలు, డ్యాన్స్ ప్రోగ్రామ్‌లు, ఓటీటీ అవకాశాలు పెరిగాయి. అయితే అదే సమయంలో ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌లో వచ్చిన మార్పు కొందరు నెటిజన్లకు చర్చాంశమైంది. ముఖ్యంగా ఒక డ్యాన్స్ షోలో ధరించిన అవుట్‌ఫిట్‌పై భారీ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. సోషల్ మీడియాలో ఆమెపై దారుణమైన కామెంట్లు వచ్చాయి. కొందరు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు కూడా చేశారు.

"నాపై నాకే అసహ్యం వేసింది"
జబర్దస్త్ వర్ష హోస్ట్ చేసిన ఓ టాక్ షోలో ఈ విషయం గురించి మాట్లాడిన ప్రియాంక ఎమోషనల్ అయింది. "నిజంగా చెప్పాలంటే ఆ ట్రోల్స్ చూసి నేను షాక్ అయ్యాను. ఒక్కసారిగా ప్రపంచం మొత్తం నా మీద పడిపోయినట్టు అనిపించింది. అంతమంది గలీజ్ కామెంట్లు చేస్తారని ఊహించలేదు" అని తెలిపింది. కొన్ని కామెంట్లు చదివిన తర్వాత తాను తీవ్రంగా బాధపడ్డానని చెప్పింది. "కొంతమంది హద్దులు దాటి మాట్లాడారు. సెన్స్ లేదా? మ్యానేర్స్ లేదా? అంటూ కామెంట్లు చేశారు. కొన్ని కామెంట్లు చదివాక నాపై నాకే అసహ్యం వేసింది. నేను ఏం తప్పు చేశాను?" అంటూ కన్నీటి పర్యంతమైంది.

డ్రెస్సింగ్ విషయంలో తనపై వస్తున్న విమర్శలకు ప్రియాంక ఘాటుగా సమాధానం ఇచ్చింది. "నేను ఒక యాక్టర్‌ను. పాత్రలో ఉన్నప్పుడు ఒక లుక్ ఉంటుంది. కానీ పర్సనల్ లైఫ్‌లో కూడా అదేలా ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? నాకు కూడా ఫ్రీడమ్ ఉంది. నాకు నచ్చినట్టు డ్రెస్ వేసుకోవడంలో తప్పేముంది?" అంటూ ప్రశ్నించింది. ఇంకా మాట్లాడుతూ.. "ప్రతి అమ్మాయికి తనదైన స్టైల్ ఉంటుంది. కొన్ని సార్లు కొత్తగా కనిపించాలని ప్రయత్నిస్తాం. అది అందరికీ నచ్చకపోవచ్చు. కానీ అందుకే బూతులు తిట్టడం సరైంది కాదు. నచ్చకపోతే అన్‌ఫాలో చేయండి" అని చెప్పింది.

ఈ ట్రోలింగ్ సమయంలో తనకు అండగా నిలిచింది తన ప్రియుడు శివకుమార్ అని ప్రియాంక వెల్లడించింది. "నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి శివ్. 'వాటిని ఎందుకు చదువుతున్నావ్? పట్టించుకోకు' అంటూ నన్ను ఓదార్చాడు. ఆ సమయంలో అతని సపోర్ట్ నాకు చాలా అవసరం అయ్యింది" అని తెలిపింది. తన డ్రెస్సింగ్ కారణంగా ఇంట్లో అమ్మ కొట్టిందంటూ వచ్చిన వార్తలపై కూడా ఆమె స్పందించింది."అది పూర్తిగా అబద్ధం. ఎవరికి తోచినట్టు వాళ్లు రాస్తారు. అందులో నిజం ఏమీ లేదు" అంటూ ఫేక్ ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

బిగ్‌బాస్ తర్వాత తన కెరీర్ మారిందని, అందుకే తన స్టైల్ కూడా మారిందని ప్రియాంక స్పష్టం చేసింది. బిగ్‌బాస్‌కు ముందు నేను సీరియల్స్‌లో మాత్రమే కనిపించేదాన్ని. ఇప్పుడు షోలు, ఈవెంట్స్, ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అందుకే నా డ్రెస్సింగ్ కూడా మారింది. అప్పటి ప్రియాంక వేరు.. ఇప్పటి ప్రియాంక వేరు. ఇది నా స్టైల్‌, నా ఐడెంటిటీ" అని చెప్పింది. ప్రస్తుతం ఈ థ్రోబ్యాక్ ఇంటర్వ్యూ క్లిప్ మళ్లీ వైరల్ అవుతోంది. కొందరు ఆమెకు మద్దతుగా "డ్రెస్‌పై కాదు, టాలెంట్‌పై మాట్లాడాలి" అంటుండగా.. మరికొందరు సెలబ్రిటీలు కూడా ట్రోలింగ్ వల్ల ఎంత బాధపడతారో ఈ సంఘటన చూపించిందని అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X