అనసూయ ఎవరో నాకు తెలియదు... నోరుజారిన బుల్లితెర స్టార్ యాంకర్..

యాంకర్‌గా, నటిగా రెండు రంగాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పేరు అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj). మొదటి న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, తరువాత యాంకర్‌గా మారి బుల్లితెరపై తనదైన ముద్ర వేసుకుంది. ముఖ్యంగా జబర్దస్త్ ద్వారా ఆమెకు అపారమైన పాపులారిటీ వచ్చింది. ఈ క్రేజ్‌తోనే ఆమెకు వెండితెరపై అవకాశాలు వరుసగా వచ్చాయి. క్షణం, రంగస్థలం, కథనం, విమానం, పుష్ప: ది రైజ్, ఖిలాడి వంటి సినిమాల్లో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్ లాంటి క్రేజ్ సంపాదించుకున్న అనసూయపై బుల్లి తెర స్టార్ యాకంర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ యాంకర్ ఎవరు? ఇంతకీ ఏమన్నారంటే?

ఆ షాకింగ్ కామెంట్స్ చేసింది ఎవరో కాదు.. యాంకర్ సౌమ్య రావు (Soumya Rao). తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ఇది. పాపులర్ కామెడీ షో 'జబర్దస్త్'ద్వారా యాంకర్‌గా బుల్లితెరపైకి వచ్చిన ఆమె, తన అందం, అభినయం, టాలెంట్, చలాకీతనంతో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకుల మదిలో చెరుగని స్థానాన్ని సంపాదించుకుంది. హైపర్ ఆది టీంతో చేసిన పంచులు షోకు హైలైట్‌గా నిలిచాయి. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తన అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఓ పాత ఇంటర్య్యూలో ఈ అమ్మడు చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా అనసూయపై సౌమ్యరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Throwback Interview Jabardasth anchor Soumya Rao Shocking Comments on Anasuya Bharadwaj Goes Viral

అనసూయపై క్లారిటీ
"మీరు జబర్దస్త్‌లో అనసూయ ప్లేస్‌లోకి వచ్చారు కదా.. ఆమె నుంచి ఎలాంటి సజెషన్స్ వచ్చాయా?" అనే ప్రశ్నకు ఆమె స్పష్టమైన సమాధానం ఇచ్చింది. అనసూయ వీడియోలు చూసి ఆమె యాంకరింగ్ స్టైల్‌ను అర్థం చేసుకున్నానని చెప్పింది. అయితే, "ఆమె తన పాయింట్ ఆఫ్ వ్యూలో యాంకరింగ్ చేసింది.. నేను నా స్టైల్‌లో చేశాను" అంటూ పోలికలకు తావులేదని క్లారిటీ ఇచ్చింది. అలాగే, అనసూయ వల్లే మీరు జబర్దస్త్‌లోకి వచ్చారనే ప్రచారం ఎంతవరకు నిజం?'అన్న ప్రశ్నకు షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. 'ఆ సమయంలో నాకు అనసూయ గారు ఎవరో కూడా తెలియదు'అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు మాత్రం ఆమెను పలుమార్లు ఈవెంట్స్, రియాలిటీ షోలలో కలిసినట్లు తెలిసింది. "ఆమె చాలా టాలెంటెడ్ పర్సన్.. వ్యక్తిగతంగా కూడా చాలా మంచివారు.. నా కెరీర్‌కు సపోర్ట్, ఎంకరేజ్ కూడా ఇచ్చారు" అంటూ అనసూయపై పాజిటివ్ కామెంట్స్ చేసింది.

జబర్దస్త్ నుంచి ఎగ్జిట్‌పై స్పందన
జబర్దస్త్ షో నుంచి బయటికి రావడంపై కూడా ఆమె ఆసక్తికరంగా స్పందించింది. "నా కాంట్రాక్ట్ పూర్తయ్యాక నేను ఎవరినీ అవకాశాల కోసం అడగలేదు. నాకు నా టాలెంట్ మీద నమ్మకం ఉంది. నా ప్రతిభతోనే అవకాశాలు రావాలి అనుకుంటాను" అని చెప్పింది. ఇండస్ట్రీలో ఎవరి వద్ద సిఫార్సులు, రిక్వెస్ట్‌లు చేయడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. 'న్యాయంగా వచ్చే అవకాశాలనే నేను స్వీకరిస్తాను. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయగల సామర్థ్యం నాలో ఉంది'తన కాన్ఫిడెన్స్‌ను చూపించింది.

రష్మీతో రిలేషన్‌పై నిజం
ఇక రష్మీ గౌతమ్ గురించి కూడా ఆమె ఓపెన్‌గా మాట్లాడింది. 'మా మధ్య అంతగా క్లోజ్ రిలేషన్ లేదు. హాయ్ అంటే హాయ్.. బై అంటే బై అనే స్థాయిలోనే ఉంటాం' అని చెప్పింది. ఇద్దరూ షోలలో ఉండటం వల్ల ఎక్కువగా కలుసుకునే అవకాశం ఉండదని. 'ఇక్కడ వర్క్ వరకే ఫ్రెండ్స్.. ఇండస్ట్రీలో నాకు ఎక్కువగా సన్నిహితులు లేరు'అంటూ నిజాయితీగా చెప్పింది. తాను ఎక్కువగా బెంగళూరులోనే ఉంటానని, షూటింగ్ ఉన్నప్పుడు హైదరాబాద్‌కు వస్తానని. షూటింగ్ పూర్తయ్యాక వెంటనే తిరిగి వెళ్తానని, అవసరమైతే సర్వీస్ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటానని చెప్పింది. హైదరాబాద్‌లో తనకు చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారని, అందులో ప్రియాంక సింగ్, శ్రీ సత్య మాత్రమే దగ్గరగా ఉంటారని చెప్పింది.

జబర్దస్త్ టీమ్‌తో బంధం
జబర్దస్త్‌ను వదిలిన తర్వాత కూడా టీమ్‌తో తన అనుబంధం అలాగే కొనసాగుతోందని చెప్పింది. టీమ్ లీడర్లు తరచూ ఫోన్ చేసి మాట్లాడుతారని, తాను షోలో లేకపోవడం వల్ల మిస్ అవుతున్నామని చెబుతారని అన్నారు. "ఆ సెట్లో ఎవ్వరూ నన్ను హర్ట్ చేయలేదు. అందరూ చాలా సపోర్టివ్‌గా ఉన్నారు" అని చెబుతున్నారు. మొత్తానికి, ఈ యాంకర్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఉన్న అపోహలకు క్లారిటీ ఇచ్చేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్లలో చర్చకు దారి తీస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X