‘నేనేమీ పతివ్రతను కాదు.. తాగితే పక్కన వాళ్లు భయపడాల్సిందే'

బుల్లితెరపై ఎప్పుడూ నవ్వులు పంచే సెలబ్రిటీల పర్సనల్ విషయాలు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. వారు ప్రతి చిన్న మూవెంట్, వారి ప్రతి కామెంట్.. హాట్ టాపిక్‌గా మారిపోతుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. అయితే.. ఓ స్టార్ యాంకర్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. 'నేనేమీ పతివ్రతను కాదు' అంటూ బోల్డ్‌ కామెంట్స్ చేసింది. ఆ యాంకర్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి. అసలు ఈ కామెంట్స్ చేసిన వారు ఎవరు? ఎందుకు ఇలా అన్నారు? ఏ సందర్భంలో ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు? అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు ప్రేక్షకుల్లో చర్చకు దారితీస్తున్నాయి.

యాంకర్ ఎవరో కాదు.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని యాంకర్ సౌమ్య రావు (Jabardasth Sowmya Rao). తక్కువ కాలంలోనే యాంకర్‌గా మంచి గుర్తింపు సంపాదించి, తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను అలరించిన ఈమె, ఓ ఇంటర్వ్యూలో చేసిన బోల్డ్ కామెంట్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ మళ్లీ వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలోని షిమోగాలో జన్మించిన సౌమ్య రావు, చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకుంది. చదువులు పూర్తి చేసిన తర్వాత 2018లో టెలివిజన్ రంగంలో అడుగుపెట్టి, తమిళ సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించింది.

Throwback Interview Jabardasth Anchor Sowmya Rao Opens Up on Drinking Habit

'రోజా' వంటి సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తరువాత తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి 'శ్రీమంతుడు' వంటి సీరియల్స్‌లో నటించింది. అయితే అసలైన బ్రేక్ మాత్రం జబర్థస్త్ (Jabardasth) కామెడీ షో ద్వారానే వచ్చింది. జబర్దస్త్‌లో యాంకర్‌గా కనిపించిన సౌమ్య, తన అందం, యాంకరింగ్ స్టైల్, ఇంగ్లీష్ మిక్స్ చేసిన మాటలు, అలాగే హైపర్ ఆది వంటి కమెడియన్స్‌తో చేసిన పంచులు, కౌంటర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎక్కువ కాలం ఆ షోలో లేకపోయినా, గుర్తుండిపోయే యాంకర్‌గా నిలిచింది. తక్కువ సమయంలోనే మంచి ఫ్యాన్ బేస్ సంపాదించడం ఆమె ప్రత్యేకత.

గతంలో యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న "కిస్సిక్ టాక్" షోలో సౌమ్య రావు గెస్ట్‌గా పాల్గొంది. ఈ షోలో ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ఓపెన్‌గా చెప్పింది. ముఖ్యంగా తన డ్రింకింగ్ హాబిట్ గురించి ఎలాంటి సంకోచం లేకుండా మాట్లాడటం హాట్ టాపిక్ అయింది. 'పార్టీల్లో ఏమైనా తాగుతారా?' అనే ప్రశ్నకు సౌమ్య సూటిగా స్పందిస్తూ.. 'అప్పుడప్పుడు వైన్ తాగుతాను. మైండ్ ఫ్రెష్‌గా ఉండడానికి ఒకటి లేదా రెండు పెగ్స్ రెడ్ వైన్ తీసుకుంటాను. ఇందులో అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు. నేనేం పతివ్రతను కాదు. తాగను అని ఫేక్‌గా చెప్పడం ఎందుకు?'అంటూ ముక్కుసూటిగా మాట్లాడింది.

అయితే అదే సమయంలో ఆమె ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పింది. 'డ్రింకింగ్ అలవాటుగా మారకూడదు. లిమిట్‌లో ఉంటేనే బాగుంటుంది' అంటూ బాధ్యతాయుతమైన సందేశం ఇచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, డ్రింక్ చేసిన తర్వాత తన మైండ్‌లోకి వచ్చే ఆలోచనల గురించి కూడా ఆమె ఓపెన్‌గా చెప్పింది. 'వైన్ తీసుకున్న తర్వాత ఇండస్ట్రీ గురించే ఎక్కువగా ఆలోచిస్తాను. ఎవరు ఎలా ట్రీట్ చేశారు, ఎవరు అవకాశాలు ఇవ్వలేదు, ఎవరు డైలాగ్స్ కట్ చేశారు అన్న విషయాలే గుర్తుకొస్తాయి. నేను మాట్లాడితే ఇండస్ట్రీ గురించే మాట్లాడుతావ్ అని కొందరు అంటారు. అందుకే నాతో పార్టీకి రావడానికే నా స్నేహితులు భయపడతారు' అంటూ నవ్వుతూ చెప్పింది. ఈ వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X