టెన్షన్‌ తగ్గడానికి ఆ వీడియోలు చూస్తా.. ఓపెన్‌‌గా చెప్పేసిన జబర్దస్త్ కమెడియన్

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్‌ నరేష్‌ (Jabardasth Naresh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్థస్త్ (Jabardasth), ఎక్స్ ట్రా జబర్థస్త్ (Extra Jabardasth) షోల ద్వారా తనదైన కామెడీ టైమింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నరేష్. ప్రస్తుతం టీవీ రంగంలో బిజీ కమెడియన్‌గా కొనసాగుతున్నాడు. వయసులో యువకుడైనా, జన్యులోపం కారణంగా చిన్న పిల్లాడిలా కనిపించే నరేష్.. అదే విషయాన్ని బలహీనతగా కాకుండా బలంగా మార్చుకుని కెరీర్‌ను నిర్మించుకున్నాడు. తనపై వచ్చిన విమర్శలు, అవమానాలను ఎదుర్కొంటూ, నవ్వులను పంచే కళాకారుడిగా ఎదిగిన తీరు చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

Also Read
Top 10 Heroes: మరోసారి నెంబర్ 1గా ప్రభాస్.. అల్లు అర్జున్, మహేష్, రామ్ చరణ్ ర్యాంక్ ఎంతంటే?
Top 10 Heroes: మరోసారి నెంబర్ 1గా ప్రభాస్.. అల్లు అర్జున్, మహేష్, రామ్ చరణ్ ర్యాంక్ ఎంతంటే?

జబర్దస్త్ ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన నరేష్, ఇప్పుడు టీవీ షోలతో పాటు ప్రైవేట్ ఈవెంట్స్, స్టేజ్ ప్రోగ్రామ్స్, విదేశీ ఈవెంట్లలో కూడా పాల్గొంటూ మంచి ఆదాయం పొందుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకుల మధ్య కూడా అతనికి మంచి గుర్తింపు ఉంది. చిన్నపాటి పాత్రలతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు స్టార్ కమెడియన్ స్థాయికి చేరడం విశేషం. అయితే ఇటీవల ఇస్టాగ్రామ్ రీల్స్, ట్రోలింగ్ వీడియోలు, ఒత్తిడి తగ్గించుకునే విషయంపై చేసిన కామెంట్స్‌తో నరేష్ మరోసారి వార్తల్లో నిలిచాడు.

Recommended For You
Top Heroines: టాప్ 10 హీరోయిన్స్ వీరే! చెక్కుచెదరని సమంత స్థానం
Top Heroines: టాప్ 10 హీరోయిన్స్ వీరే! చెక్కుచెదరని సమంత స్థానం
Throwback Interview Jabardasth Naresh Reveals How He Beats Stress Watching Videos

గతంలో యాంకర్ వర్ష హోస్ట్‌గా నిర్వహిస్తున్న కిసిక్ టాక్ షోలో పాల్గొన్నారు నరేష్. ఈ సమయంలో తన జీవితంలోని అనేక విషయాలను బయటపెట్టాడు. సాధారణంగా స్టేజ్‌పై నవ్వులు పంచే నరేష్, ఈసారి తన బాధలు, ఎదుర్కొన్న అవమానాలు, వ్యక్తిగత కష్టాలను పంచుకోవడం అందరినీ ఆలోచింపజేసింది. నరేష్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి తన హైట్ కారణంగా చాలా మంది హేళన చేశారని చెప్పాడు. చిన్న పిల్లాడిలా కనిపిస్తావంటూ అసభ్య పదాలతో పిలిచేవారని, ఆ అవమానాలు తాను మాత్రమే కాదు, తన కుటుంబం కూడా భరించిందని భావోద్వేగానికి లోనయ్యాడు. ముఖ్యంగా తన తల్లి ఈ విషయాల వల్ల తీవ్రంగా మానసికంగా బాధపడిందని వెల్లడించాడు. పేదరికం కారణంగా తాను 9వ తరగతి వరకే చదవగలిగానని చెప్పిన నరేష్, కుటుంబ పరిస్థితులు మెరుగుపరచాలనే లక్ష్యంతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపాడు.

You May Also Like
చెల్లికి సెట్ చేద్దాం అనుకుని నేనే పెళ్లి చేసుకున్నా.. సీరియల్ నటి లవ్ స్టోరీలో సినిమాకి మించిన ట్విస్ట్!
చెల్లికి సెట్ చేద్దాం అనుకుని నేనే పెళ్లి చేసుకున్నా.. సీరియల్ నటి లవ్ స్టోరీలో సినిమాకి మించిన ట్విస్ట్!

"మా ఇంట్లో సంతోషం రావాలంటే నేను సంపాదించాలి. అందుకే ఎన్ని అవమానాలైనా భరించాను. రోజూ కష్టపడి కుటుంబాన్ని నిలబెట్టాలనుకున్నా" అని నరేష్ అన్నారు. సాధారణంగా నవ్వించే వ్యక్తి వెనుక ఇంత బాధ ఉందా అంటూ అభిమానులు స్పందిస్తున్నారు. ఇక గతంలో బులెట్ భాస్కర్ (Bullet Bhaskar) చేసిన వ్యాఖ్యలపై కూడా నరేష్ స్పందించాడు. భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో "నరేష్ చాలా కమర్షియల్.. చావు ఇంటికైనా వెళ్తే పెట్రోల్ డబ్బులు అడుగుతాడు" అని అన్న విషయం అప్పట్లో వైరల్ అయ్యింది. ఈ వ్యాఖ్యలు తన ఇమేజ్‌పై తీవ్ర ప్రభావం చూపాయని నరేష్ తెలిపాడు. చాలామంది నిజంగానే తాను అంత డబ్బు ఆశపడేవాడినని భావించారని, కొందరు దూరమయ్యారని చెప్పాడు. తరువాత భాస్కర్ వ్యక్తిగతంగా సారీ చెప్పినా, అప్పటికే తనపై నెగిటివిటీ ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

టెస్టీ తేజకు బిగ్ బాస్ బ్యూటీ మ్యారేజ్ ప్రపోజల్.. కానీ, ఆ కండిషన్!
టెస్టీ తేజకు బిగ్ బాస్ బ్యూటీ మ్యారేజ్ ప్రపోజల్.. కానీ, ఆ కండిషన్!

ఇక ఒత్తిడి, టెన్షన్‌ను ఎలా హ్యాండిల్ చేస్తావని యాంకర్ వర్ష అడగగా సోషల్ మీడియాలో టైమ్ దొరికినప్పుడల్లా వీడియోలు చూస్తుంటానని చెప్పాడు. ముఖ్యంగా ట్రోలింగ్ వీడియోలు, ఫన్నీ క్లిప్స్ చూస్తూ బాగా నవ్వుకుంటానని తెలిపాడు. అదే సమయంలో సరదాగా మాట్లాడుతూ "బూ*** వీడియోలు కూడా చూస్తుంటా" అని చెప్పడంతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. యాంకర్ కూడా ఆశ్చర్యంగా 'ఏంటి.. అలాంటి వీడియోలా?' అని ప్రశ్నించింది. వెంటనే తన మాట అర్థం తప్పుగా వెళ్లిందని గ్రహించిన నరేష్, "అవి కాదు అమ్మా.. అలా బూతులు మాట్లాడుతూ చేసే కామెడీ వీడియోలు" అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X