‘25 లక్షలు ఇస్తాం.. ఫామ్ హౌస్‌కి అలా రమ్మన్నారు'

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంశం అప్పుడప్పుడూ బయటకు వస్తూనే ఉంటుంది. చాలా మంది హీరోయిన్లు, నటీమణులు తమ అనుభవాలను పంచుకుంటూ ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెబుతుంటారు. ఇటీవల బిగ్ బాస్ ఫేమ్ 'కిర్రాక్ సీత'గా పాపులర్ అయిన సుప్రజ ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. చిన్న స్థాయి నుంచి కెరీర్ ప్రారంభించి, యూట్యూబ్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని, తరువాత సినిమాలు, బిగ్‌బాస్ వంటి వేదికలతో ప్రేక్షకులకు దగ్గరైన ఆమె... ఇప్పుడు తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది.

'బేబీ' సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిర్రాక్ సీత, అందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే అదే పాత్ర కారణంగా సోషల్ మీడియాలో ట్రోల్స్, బెదిరింపులు ఎదుర్కొన్నట్లు కూడా ఆమె చెప్పింది. సినిమా పాత్రను రియల్ లైఫ్‌తో కలిపి చూసే కొందరు వ్యక్తులు ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, బెదిరించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

Throwback Interview Kirrak Seetha Reveals Shocking Casting Couch Experience in Film Industry

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సీత.. తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వివరించింది. 7 ఆర్ట్స్‌తో వీడియోలు చేస్తూ ఉన్న సమయంలో తనకు ఒక వ్యక్తి ఫోన్ చేసి సినిమా అవకాశం ఉందని చెప్పాడట. మొదట్లో అది నిజమైన ఆఫర్ అనుకుని సంతోషపడిన ఆమె, ఆ తర్వాత ఆ వ్యక్తి ప్రవర్తనలో అనుమానాస్పద అంశాలను గమనించిందని చెప్పింది. ముఖ్యంగా ఆఫీస్‌కు కాకుండా ఫామ్ హౌస్‌కు రావాలని చెప్పడం ఆమెకు సందేహం కలిగించింది.

మొదట టీమ్ మొత్తం వస్తారని చెప్పడంతో ఓకే అన్నా, చివరికి పరిస్థితి కరెక్ట్‌గా లేదని భావించి అక్కడికి వెళ్లలేదని ఆమె తెలిపింది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ కాల్ చేసి ఎందుకు రాలేదని అడిగినప్పుడు... "మీకు 25 లక్షలు ఇస్తాం ఫామ్ హౌస్ కి రండి" అని చెప్పారట. ఈ మాటతో ఆమెకు అసలు విషయం అర్థమైందట.వెంటనే ఆ ఆఫర్‌ను తిరస్కరించాననీ సీత వెల్లడించింది. ఈ నిర్ణయం ఆమె కెరీర్‌లో చాలా కీలకమైందని చెప్పాలి.

ఇది ఒక్క సంఘటన మాత్రమే కాకుండా, ఇలాంటి కాల్స్, మెసేజ్‌లు తరచూ వస్తుంటాయని కూడా ఆమె తెలిపింది. ఎవరికైనా ఫోన్ నెంబర్ దొరికితే చాలు... సిరీస్, సినిమా పేరుతో సంప్రదించి, తరువాత అసలు ఉద్దేశాన్ని బయటపెడతారని చెప్పింది. కొంతమంది నిజంగా ఇండస్ట్రీకి సంబంధించినవాళ్లు కాకపోయినా, ఇలా టైమ్‌పాస్ కోసం కూడా ఇబ్బందిపెడతారని ఆమె పేర్కొంది. ఈ పరిస్థితి కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిలకు ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఈ వ్యాఖ్యలు చూపిస్తున్నాయి.

అయితే.. అలాంటి ఆఫర్లు ఇస్తే.. "అలా అడిగితే మీకు సిగ్గుందా?" అని నేరుగా ప్రశ్నిస్తానని ఆమె చెప్పడం గమనార్హం. చిన్న వయసులోనే ఈ రకమైన ఒత్తిడులను ఎదుర్కొని, తప్పు మార్గాన్ని ఎంచుకోకుండా ముందుకు సాగడం తన వ్యక్తిత్వం అని చెప్పింది. మరోసారి ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X