‘మాది 10 ఏళ్ల రిలేషన్ ' సుడిగాలి సుధీర్ పై రష్మీ ఎమోషనల్ కామెంట్స్..
Rashmi Gautam - Sudigali Sudheer: తెలుగు బుల్లితెరపై సుడిగాలి సుధీర్ - రష్మీ గౌతమ్ జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టీవీ షోల చరిత్రలోనే అత్యంత పాపులర్ ఆన్‌స్క్రీన్ జోడీలలో వీరిద్దరూ ఒకరు. ముఖ్యంగా జబర్దస్త్ వేదికపై వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ప్రేక్షకుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. సుధీర్ కామెడీ టైమింగ్, రష్మీ హావభావాలు, ఇద్దరి మధ్య కనిపించే అద్భుతమైన కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒకే స్టేజ్‌పై ఈ జంట సందడి చేస్తే ఆ ఎపిసోడ్‌కు టీఆర్పీలు కూడా ఊపందుకునేది. వీరి రొమాంటిక్ ట్రాక్స్, సరదా స్కిట్స్, ఎమోషనల్ మూమెంట్స్ ప్రేక్షకులతో స్ట్రాంగ్ కనెక్షన్ ఏర్పడింది.
ఈ కారణంగానే రష్మీ-సుధీర్ జంటకు సోషల్ మీడియాలో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. టీవీలో కనిపించే ప్రతి సన్నివేశాన్ని నిజ జీవితానికి అన్వయిస్తూ, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం చాలా కాలంగా కొనసాగింది. "త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు", "ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారు" అంటూ అనేక రూమర్స్ వైరల్ అయ్యాయి. వీరిద్దరూ ఎక్కడైనా కలిసి కనిపించినా, ఏదైనా ఇంటర్వ్యూలో ఒకరి గురించి మరొకరు మాట్లాడినా ఆ వార్తలు మరింత వేగంగా వ్యాపించేవి.

అయితే గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మీ గౌతమ్ ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది. "మీరు చూసే ప్రతి ఎపిసోడ్‌లో మా మధ్య ఏదో స్పెషల్ ఉందనుకుంటారు. కానీ అది మా కెమిస్ట్రీ మాత్రమే" అంటూ నవ్వుతూ చెప్పింది. సుధీర్‌తో తన బంధం గురించి మాట్లాడుతూ, "మా ఇద్దరి పరిచయం దాదాపు పదేళ్లకు పైగానే ఉంది. 2013 నుంచి కలిసి పనిచేస్తున్నాం. ఆఫ్‌స్క్రీన్‌లో మేము ఎలా ఉంటామో, ఆన్‌స్క్రీన్‌లో కూడా అలానే ఉంటాం. అతను నాకు లైన్ వేసిన సందర్భం లేదు.. నేను మురిసిపోయిన సందర్భం లేదు. అన్నీ సహజంగానే జరిగాయి" అని చెప్పింది.
రష్మీ ప్రకారం.. ఇది ప్రేమ కథ కాదు.. బలమైన స్నేహ బంధం మాత్రమే. ఒకరినొకరు అర్థం చేసుకునే ఇద్దరు మంచి స్నేహితులు కలిసి పని చేస్తే వచ్చే సహజమైన అనుబంధమే ప్రేక్షకులకు ప్రేమలా కనిపించిందని చెప్పొచ్చు. ఇక సుడిగాలి సుధీర్ కూడా గతంలో ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పాడు. "రష్మీ నా మంచి స్నేహితురాలు. మా ఇద్దరి కెమిస్ట్రీని ప్రేక్షకులు ఇష్టపడటం మా అదృష్టం" అని ఆయన వెల్లడించాడు. ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ జంటకు ఇంత క్రేజ్ వచ్చిందని సుధీర్ భావించాడు.
ఇదే అంశంపై గతంలో గెటప్ శ్రీను కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సుధీర్-రష్మీ లవ్ ట్రాక్ అసలు స్క్రిప్ట్‌లో భాగమని, ముఖ్యంగా కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ ఆ ట్రాక్‌ను బాగా డిజైన్ చేశారని తెలిపాడు. "వాళ్లిద్దరి జంట స్క్రీన్‌పై చాలా బాగుంటుంది. అది నిజమా కాదా అనేది పక్కన పెడితే, ప్రేక్షకులు మాత్రం ఆ జంటను చూడటానికి ఇష్టపడతారు" అని చెప్పాడు.
ఇది చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. రష్మీ-సుధీర్ జంటపై వచ్చిన ప్రేమ, పెళ్లి వార్తలన్నీ ఎక్కువగా ప్రేక్షకుల ఊహాగానాలు, షోల్లో చూపించిన ఎంటర్‌టైన్‌మెంట్ వల్లే వచ్చినవని తెలుస్తోంది. నిజ జీవితంలో వీరిద్దరూ మంచి స్నేహితులే అయినప్పటికీ, ఆన్‌స్క్రీన్‌లో మాత్రం బెస్ట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ జంటకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. మళ్లీ ఇద్దరూ ఒకే షోలో కనిపిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే తెలుగు బుల్లితెరపై రష్మీ-సుధీర్ జంటకు ఉన్న మ్యాజిక్ ఇప్పటికీ తగ్గలేదనే చెప్పాలి.


Click it and Unblock the Notifications