ఆ రాత్రంతా బస్టాండ్ లోనే.. అక్కడ చేతులేశాడు.. స్టార్ యాంకర్ ఎమోషనల్

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు సౌమ్యా రావు (Anchor Soumya Rao). పాపులర్ కామెడీ షో 'జబర్దస్త్' ద్వారా యాంకర్‌గా బుల్లితెరపైకి వచ్చిన ఆమె, తన అందం, టాలెంట్, చలాకీతనంతో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. కొత్త కాలమే యాంకరింగ్ లో ఉన్నా.. తన ప్రత్యేకమైన స్టైల్‌తో ప్రేక్షకుల మది చెరుగని స్థానాన్ని సంపాదించుకుంది. ఈ అమ్మడు ఇటీవల జబర్దస్త్ ఫేమ్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో 'కిసిక్క్ టాక్స్'లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, చేదు అనుభవాలను ఎమోషనల్‌గా పంచుకుంది. చిన్ననాటి నుంచి ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు, అలాగే తన కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన వేధింపుల గురించి ఆమె ఓపెన్‌గా మాట్లాడటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

కన్నడకు చెందిన సౌమ్యా రావు 2018లో నటిగా కెరీర్ ప్రారంభించింది. మొదట తమిళ టెలివిజన్‌లో 'రోజా' సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకుని, తర్వాత పలు తమిళ సీరియల్స్‌లో నటించి మంచి పేరు సంపాదించింది. అనంతరం తెలుగు టీవీ రంగంలోకి అడుగుపెట్టి 'శ్రీమంతుడు' సీరియల్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది.అయితే 'జబర్దస్త్' కామెడీ షోలో యాంకర్‌గా వచ్చిన తర్వాత ఆమెకు భారీ పాపులారిటీ వచ్చింది. తన ఇంగ్లీష్ ప్రొనన్సియేషన్, స్పాంటేనియస్ కౌంటర్లు, సరదా స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా హైపర్ ఆది టీంతో చేసిన పంచులు షోకు హైలైట్‌గా నిలిచాయి. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తన అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఓ టాక్ షో తాను ఎదురైన వేధింపుల గురించి ఆమె ఓపెన్‌గా మాట్లాడింది.

Throwback Jabardasth Anchor Soumya Rao Opens Up on Childhood Struggles Harassment Revealed

సౌమ్యా రావు వెల్లడించిన వివరాల ప్రకారం.. తన చిన్నతనం చాలా కష్టాల్లో గడిచిందని చెప్పింది. తన తండ్రి చేసిన అప్పుల వల్ల కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని, అప్పులవాళ్లు ఇంటికి వచ్చి తల్లిని మానసికంగా వేధించేవారని ఆమె గుర్తు చేసుకుంది. ఆ పరిస్థితిని తట్టుకోలేక ఒకరోజు తన తల్లి, తమ్ముడితో కలిసి కేవలం రూ.100-120 రూపాయలతో తిరుపతికి వెళ్లినట్లు చెప్పింది. అక్కడ రాత్రంతా బస్టాండ్‌లోనే గడిపిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. 'రెండు రోజులు అన్నం కూడా తినకుండా ఉన్నాం. అన్నదానం కోసం ఎదురు చూసిన రోజులు ఇప్పటికీ మర్చిపోలేను. అప్పుడు మా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే... కనీసం వాష్‌రూమ్‌కి వెళ్లడానికే కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చింది" అంటూ ఆమె ఆ రోజుల్ని గుర్తుచేసుకుంది.

ఇక ఆ సమయంలో తనకు పీరియడ్స్ ఉండటం పరిస్థితిని మరింత కష్టంగా మార్చిందని భావోద్వేగంతో తెలిపింది. 'అలాంటి పరిస్థితుల్లో కూడా తిరుపతికి వెళ్లి దేవుడి దర్శనం కంటే... ఎప్పుడు అన్నం పెడతారో అని ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. అందరూ దర్శనం కోసం లైన్‌లో ఉంటే, నేను మాత్రం ఆకలితో అన్నం కోసం ఎదురు చూస్తున్నాను' అంటూ కన్నీటి పర్యంతమైంది. అప్పుల కారణంగా తమ కుటుంబం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు, కొన్ని సందర్భాల్లో ఇంటికి తిరిగి వెళ్లాలనే ఆలోచనే రాకుండా ఉండేదని చెప్పింది. తన చిన్ననాటి కష్టాలను గుర్తు చేసుకుంటూ, 'నేను పూర్తిగా జీరో నుంచి ఇక్కడికి వచ్చాను. పెన్ను, పెన్సిల్, పుస్తకం కొనడానికి కూడా అప్పు చేయాల్సిన రోజులు ఉన్నాయి. ఎప్పుడూ సెకండ్ హ్యాండ్ బుక్స్‌తోనే చదివానని, కాలేజీ చదువుతూనే పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చానని చెప్పింది.

అయితే, జీవితంలో అత్యంత బాధాకరమైన అనుభవాల్లో ఒకటి తన పార్ట్‌టైమ్ జాబ్ సమయంలో ఎదురైందని సౌమ్య తెలిపింది. ఒక లాయర్ దగ్గర టైపిస్ట్‌గా పనిచేసే సమయంలో, ఆ వ్యక్తి తనపై అసభ్యంగా ప్రవర్తించేవాడని, తన పరిస్థితిని అర్థం చేసుకుని దానిని దుర్వినియోగం చేశాడని చెప్పింది. 'నా మీద ఇష్టం వచ్చినట్టు చేతులు వేయడం చాలా బాధ కలిగించింది. ఆ పరిస్థితిని తట్టుకోలేక ఆ పని వదిలేశాను' అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

తన వ్యక్తిగత జీవితంలో మరో పెద్ద దెబ్బ తన తల్లి అనారోగ్యమని సౌమ్య తెలిపింది. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లికి చికిత్స చేయించడానికి తాను ఎంతో కష్టపడ్డానని, డబ్బుల కోసం ఎన్నో మంది వద్ద సహాయం కోరినట్లు తెలిపింది. రేడియోథెరపీ చేయించినప్పటికీ, తల్లి పూర్తిగా కోలుకోలేదని, చివరకు చిన్నపిల్లలా మారిపోయిందని ఆమె భావోద్వేగంతో వివరించింది. "ఆమెకు నేను కూతురే కాదు, తల్లిగా మారాల్సి వచ్చింది. చిన్నపిల్లలా చూసుకున్నాను" అని చెప్పింది. సౌమ్యా రావు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X