‘జబర్దస్త్ లో అలాంటి రూమర్స్ క్రియేట్.. బయటకు రావడానికి కారణం అతనే '

Jabardasth Satya Sri: జబర్దస్త్ ద్వారా పాపులరిటీ సంపాదించుకున్న అతి కొద్దిమంది లేడీ కమెడియన్లలో సత్యశ్రీ (Sathya Sri) ఒకరు. దీంతో పాటు పలు టీవీషోలు, ఈవెంట్స్ లోనూ సందడి చేస్తోందీ ముద్దుగుమ్మ. ముఖ్యంగా "నా పెట్టీ తాళం తెరిచి..." పాటతో ఒక దశలో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది సత్యశ్రీ. రీసెంట్ గా అనగనగ ఒక రాజు తదితర సినిమాల్లోనూ కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ ముద్దుగుమ్మ తన కెరీర్‌, వ్యక్తిగత జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. జబర్దస్త్ లో తనపై లేనిపోని రూమర్స్ క్రియేట్ చేశారనీ, అతని వల్లనే ఆ షో నుంచి బయటికి వచ్చానని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. ఇంతకీ ఏమైంది? ఇంతకీ అతడు ఎవరు?

సత్య శ్రీ కు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూలో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఇందులో ఈ లేడీ కమెడియన్ మాట్లాడుతూ.. జబర్దస్త్ షో తన జీవితాన్ని మార్చిందని స్పష్టంగా తెలిపింది. మొదట్లో యాక్టింగ్ అంటే పెద్దగా అవగాహన లేకపోయినా, ఈ షోలోకి వచ్చిన తర్వాతే తనకు నటనపై పట్టొచ్చిందని చెప్పింది. ముఖ్యంగా కమెడియన్ చమ్మక్ చంద్ర తనకు గురువులాంటి వారని, ఆయన వల్లే తాను 'జబర్దస్త్ సత్యశ్రీ'గా గుర్తింపు పొందానని చెప్పింది. చంద్ర టీమ్‌లో పనిచేసిన అనుభవం తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడిందని ఆమె గుర్తుచేసుకుంది.

throwback Jabardasth Sathya Sri Breaks Silence on Rumours Reveals Reason Behind Exit

అయితే.. సోషల్ మీడియాలో తనపై, చమ్మక్ చంద్రతో తనకు సంబంధం ఉందన్న రూమర్స్ వస్తున్న నేపథ్యంలో, వాటిపై సత్యశ్రీ క్లారిటీ ఇచ్చింది. "ఆయన నాకు గురువు మాత్రమే. అంతకుమించి మా మధ్య ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదు. రిహార్సల్స్, షూటింగ్ సమయంలో తప్ప మేము ఎప్పుడూ బయట కలవం " అని ఆమె స్పష్టం చేసింది. ఈ రూమర్ల గురించి తనకు మొదట తన తండ్రే చెప్పారని, కానీ ఆయన తనపై పూర్తి నమ్మకం ఉంచారని చెప్పింది.

కుటుంబ సభ్యులు కూడా ఈ వార్తలను నెగటివ్‌గా కాకుండా, తనకు పెరిగిన గుర్తింపుగా తీసుకోవాలని ప్రోత్సహించారని వెల్లడించింది. ఇండస్ట్రీలోకి రావడాన్ని మొదట అంగీకరించని తన తండ్రి, ఈ పరిస్థితుల్లో తనకు అండగా నిలవడం తనకు మరింత ధైర్యం ఇచ్చిందని సత్యశ్రీ తెలిపింది. "రూమర్స్‌కి భయపడి వెనక్కి తగ్గితే, అవే నిజమని అనుకునే అవకాశం ఉంది. అందుకే నేను వాటిని పట్టించుకోకుండా నా పనిపై ఫోకస్ పెట్టాను" అని ఆమె చెప్పింది.

అలాగే జబర్దస్త్ షో నుంచి బయటకు రావడానికి గల అసలు కారణాన్ని కూడా ఆమె వెల్లడించింది. "నేను మొదటి నుంచి చంద్ర టీమ్‌లోనే పనిచేశాను. ఆయన షో నుంచి బయటకు వచ్చిన తర్వాత, నేను కూడా ఆయనతో కలిసి బయటకు వచ్చాను. అది పూర్తిగా నా నిర్ణయం. మరే ఇతర కారణం లేదు" అని సత్యశ్రీ క్లారిటీ ఇచ్చింది. తనకు గురువుగా భావించిన వ్యక్తి ఎక్కడ ఉంటే తాను అక్కడే ఉండాలని భావించి తీసుకున్న నిర్ణయమని చెప్పింది.

టీమ్ లీడర్ బాధ్యతల గురించి మాట్లాడుతూ, 'టీమ్ నడపడం చాలా పెద్ద బాధ్యత. స్కిట్స్, డైలాగ్స్, ఆర్టిస్టుల మేనేజ్‌మెంట్ అన్నింటికి చాలా ప్లానింగ్ అవసరం. నేను ఆ ప్రెషర్ తీసుకోలేను. కంటెస్టెంట్‌గా ఉండి ఎంజాయ్ చేస్తూ పని చేయడం నాకిష్టం' అని తెలిపింది. తన వ్యక్తిగత జీవితంపై కూడా ఆమె స్పష్టత ఇచ్చింది. 'ప్రస్తుతం ప్రేమ, పెళ్లి గురించి పెద్దగా ఆలోచన లేదు. నా ప్రొఫెషన్‌ను గౌరవించే వ్యక్తి వస్తే తప్ప ఆలోచించను. రిలేషన్‌లో అండర్‌స్టాండింగ్ చాలా ముఖ్యం'అని చెప్పింది. అలాగే తనకు హీరో రామ్ పోతినేనిపై క్రష్ ఉందని కూడా సరదాగా చెప్పింది. ఇక ఆమె ఇచ్చిన క్లారిటీతో చమ్మక్ చంద్రతో ఉన్న సంబంధంపై వస్తున్న రూమర్లకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X