హైపర్ ఆది వల్లే జబర్దస్త్‌కు గుడ్ బై ? క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్‌ బ్యూటీ

తెలుగు బుల్లితెరలో కామెడీ షోల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ సౌమ్య రావు (Soumya Rao). ఈ కన్నడ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన టైమింగ్, ఎనర్జీ, స్టేజ్ ప్రెజెన్స్‌తో 'జబర్దస్త్' వంటి పాపులర్ షోలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె.. ఒక్కసారిగా షో నుంచి మాయమవ్వడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆమె ఎందుకు వెళ్లిపోయిందన్న విషయంపై అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా హైపర్ ఆది పేరు ఈ వివాదంలో తరచూ వినిపించడంతో, ' హైపర్ ఆది వల్లే సౌమ్యను తీసివేశారు'అనే ప్రచారం జరిగింది.అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సౌమ్య ఈ రూమర్స్‌కు క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఏమన్నారంటే?

సౌమ్య మాట్లాడుతూ... తన జబర్దస్త్ ఎగ్జిట్‌కు హైపర్ ఆది ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పింది. "పాపం ఆది ఎందుకు కారణం? మొదటి నుంచి ఆయనే నాకు సపోర్ట్ చేశారు. స్టేజ్‌పై ఎలా మాట్లాడాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అన్నవి నేర్పారు. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'కి కూడా ఆయనే నాకు అవకాశం కల్పిస్తారు' అంటూ ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన అనుమానాలకు తానే ఫుల్ స్టాప్ పెట్టింది.

Anchor Soumya Rao Breaks Silence on Jabardasth Exit Clears Air on Hyper Aadi Rumours

అంతేకాదు, షోలో తనపై బాడీ షేమింగ్ ఉంది, అందుకే బయటకు వచ్చిన వార్తలపై కూడా సౌమ్య గట్టిగా స్పందించింది. 'అది పూర్తిగా తప్పు ప్రచారం. కామెడీ షోలలో పంచులు సహజం. అవి ఎవరినైనా అవమానించడానికి కాదు, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. ఆ అర్థం చేసుకోవాలి' అని ఆమె చెప్పింది. స్టేజ్‌పై జరిగే కామెడీని వ్యక్తిగతంగా తీసుకోవడం సరికాదని, తాను ఎప్పుడూ అలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకోలేదని.

ఇక షోలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనను కూడా సౌమ్య గుర్తుచేసుకుంది. ముఖ్యంగా రోహిణి ఎపిసోడ్‌లో వచ్చిన ఒక కామెడీ సీన్ గురించి ఆమె ఓపెన్‌గా మాట్లాడింది. 'రోహిణిని 'దిష్టిబొమ్మ' అని కామెంట్ చేసే సీన్‌లో నేను కొంచెం కొత్తగా ఫీలయ్యాను. ఆ సమయంలో నాకు భాష అర్థం కాలేదని, అది నా షూటింగ్‌పై పంచ్ వేస్తున్నారా? అని అనిపించింది. ఈ ఘటన ద్వారా, భాషా అవగాహన ఎంత ముఖ్యమో తనకు అర్థమైందని కూడా చెప్పింది.

ఇక సౌమ్య తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ... 'నేను సాధారణంగా చాలా కూల్‌గా ఉంటాను. కానీ ఎవరైనా నిజంగా పెడితే మాత్రం సైలెంట్‌గా ఉండను. అవసరమైతే వార్నింగ్ ఇస్తాను' అని స్పష్టం చేసింది. ఇది తన పని పట్ల ఉన్న సీరియస్‌ని చూపిస్తుందని. ఇక యాంకర్‌గా తన స్టైల్ గురించి మాట్లాడుతూ.. అనసూయ భరద్వాజ్‌తో పోల్చడంపై చాలా మంది స్పందించారు. 'అనసూయ గారు ఇండస్ట్రీలో సీనియర్. వారి స్టైల్, వారి అనుభవం వేరే స్థాయిలో ఉంటుంది. నేను వాళ్లను రీప్లేస్ చేయడానికి రాలేదు. నా స్టైల్, నా అప్రోచ్ పూర్తిగా వేరు'అని సౌమ్య వివరించింది. తన యాంకరింగ్‌లో కొంత ఇన్‌స్పిరేషన్ తీసుకున్నా, పూర్తిగా తనదైన స్టైల్‌లోనే కొనసాగుతున్నాను.

మరో ముఖ్యమైన విషయం, 'అనసూయ వల్లే సౌమ్యరావు జబర్దస్త్‌లోకి వచ్చారు' అనే ప్రచారాన్ని కూడా ఆమె ఖండించింది. 'నాకు మొదట్లో అనసూయ గారు ఎవరో కూడా తెలియదు. తర్వాత ఈవెంట్లలో కలుసుకుని పరిచయం అయ్యింది. కానీ ఆమె వల్లనే నేను ఇండస్ట్రీకి వచ్చానని చెప్పడం పూర్తిగా తప్పుడు ప్రచారం' అని క్లారిటీ ఇచ్చింది. ఇక జబర్దస్త్‌కు తిరిగి వెళ్లే విషయంపై కూడా సౌమ్య ఓపెన్‌గా మాట్లాడింది. 'నా అగ్రిమెంట్ ముగిసింది. నేను ఎవరినీ వెళ్లి అడగలేదు. ఎవరైనా నిజాయితీగా ఆఫర్ చేస్తే తప్పకుండా ఆలోచిస్తాను. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం నాకు ఇష్టం' అని చెప్పింది. అంటే, సరైన అవకాశం వస్తే మళ్లీ బుల్లితెరపై కనిపించే అవకాశం ఉందని ఆమె మాటల ద్వారా అర్థమవుతోంది.

ఇదిలా ఉంటే, జబర్దస్త్ తర్వాత సౌమ్య 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వంటి ఇతర షోల ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇందులో కూడా ఆమె యాంకరింగ్ స్టైల్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ షోలోకి రావడానికి కూడా హైపర్ ఆది పాత్ర పోషించారని ఆమె చెబుతోంది. సౌమ్య రావ్ తన జబర్దస్త్ ఎగ్జిట్‌పై నెలలుగా కొనసాగుతున్న అన్ని రూమర్‌లకు స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఎవరి మీదా ఆరోపణలు చేయకుండా, తన అనుభవాలను నిజాయితీగా పంచుకోవడం ఆమె మెచ్యురిటీని చూపుతోంది. ఇకపై కూడా ఆమె బుల్లితెరపై మరిన్ని షోలతో ప్రేక్షకులను అలరించనుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X