Throwback: రాజమౌళి ఓల్డ్ వీడియో వైరల్, సింహాసనంపై ఊరేగింపుతో గ్రేట్ వెల్‌కం!
తెలుగు టెలివిజన్ రంగంలో బాగా పాపులర్ అయిన రియాల్టీ షోలో 'ఢీ'జోడీ డాన్స్ రియాల్టీ షో ఒకటి. 2017లో జరిగిన 'ఢీ' జోడీ గ్రాండ్ ఫినాలెకు రాజమౌళి తన భార్య రమతో కలిసి హాజరయ్యారు. ఆ సమయంలో రాజమౌళికి షో నిర్వాహకులు అద్భుతమైన స్వాగత ఏర్పాట్లు చేశారు.
'హిట్టు అనే పదానికి ఆయన కట్టుబానిస.. ఒక మనిషి తన స్థాయిని పెంచుకుంటే వీరుడు అంటారు.. అదే ఇండియన్ సినిమా స్థాయిని పెంచితే దేవుడు అంటారు..ఈ ఢీ జోడి సామాజ్యంలోకి మాహిష్మతి సామ్రాజ్య సృష్టికర్త అడుగు పెటబోతున్నారు' అంటూ జక్కన ఇంట్రడక్షన్ అదరగొట్టారు. ఈ ఇంట్రడక్షన్ వీడియో ఇప్పటికీ ఇంటర్నెట్లో వైరల్ అవుతూనే ఉంది.

ఎంట్రీ అదిరిపోయింది, ఏనుగు, సింహాసనంపై ఊరేగిన జక్కన్న
షో జరుగుతున్న సెట్లోకి రాజమౌళి ఎంట్రీ అదిరిపోయింది. మాహిష్మతి సామ్రాజ్యాన్ని నిర్మించిన శూరుడు, తెలుగు సినిమా స్థాయిని పెంచిన వీరుడు, దర్శకధీరుడి ఆగమనం అంటూ.. నృత్య కళావీరులు గజ సింహాసన అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను ఏనుగు సింహాసనం మాదిరిగా వేసిన సెట్ మీద ఊరేగించారు.

రాజమౌళి నోట ఆ మాట సూపర్
ఢీ జోడీ టీం ఇచ్చిన వెల్ కం అద్భుతంగా ఉంది. టీమ్ మొత్తానికి థాంక్స్. ఇది నాకు ఇచ్చిన గౌరవంగా కాకుండా, బాహుబలి సినిమాకు, బాహుబలి టీంకు ఇచ్చిన గౌరవంగా భావిస్తాను అని రాజమౌళి వ్యాఖ్యానించడం ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు.

మీతో పోటీ పడలేకే..
నా బిగినింగ్ సినిమాల్లో రకరకాల డాన్స్ నెంబర్లు పెట్టేవాడిని, ఈ షోను రెగ్యులర్‌గా ఫాలో అవ్వకపోయినా మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ చూసినపుడు ఢీ ప్రోగ్రాంలో పోటీ పడలేం అని డిసైడ్ అయి... డాన్స్ నెంబర్లు తీసేసి కాన్సెప్ట్ యాంగిల్‌లో సినిమాలు తీసయడం మొదలు పెట్టాను అంటూ రాజమౌళి చమత్కరించారు.

శేఖర్ మాస్టర్ గర్వంగా
నేను ఇంతకు ముందు ఇతర దేశాలకు షూటింగులకు వెళ్లినపుడు అక్కడి వారు ఏం షూటింగ్ అని అడిగేవారు. నేను ఇండియా అని అడిగితే బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడేవారు. బాహుబలి తర్వాత మన టాలీవుడ్ గురించి ఇతర దేశాల్లో గర్వంగా చెప్పుకునే పరిస్థితి వచ్చిందని ఆ షోకు జడ్జిగా వ్యవహరించిన శేఖర్ మాస్టర్ ఎమోషనల్‌గా వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











