Punch Prasad: పంచ్ ప్రసాద్ ప్రేమలో తెలుగు హీరోయిన్.. పెళ్లైన వాడైనా వదిలేదే లేదంటూ..!
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ షో జబర్దస్త్ లో చేసే పంచ్ ప్రసాంద్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కామెడీతో అందరినీ ఫుల్ గా ఎంటర్ టైన్ చేసే ఈయన జీవితంలో చాలానే కష్టాలు ఎదుర్కున్నాడు. ఈ మధ్యే ఆ సమస్యల నుంచి బయట పడ్డ ఇతడిపై ఓ కుర్ర హీరోయిన్ విపరీతమైన ప్రేమ కురిపిస్తోంది. అతడే నా జీవితం అంటూ చెబుతుంది. పెళ్లైన వాడిని ఇష్టపడుతున్న ఆ హీరోయిన్ ఎవరు, ఈ కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు పైకి ఎదిగారు. చాలా మందికి లైఫ్ ఇచ్చిన ఈ షోనే పంచ్ ప్రసాద్ కు కూడా లైఫ్ ఇచ్చింది. మంచి గుర్తింపు వచ్చేలా చేసింది. ముఖ్యంగా పంచ్ ప్రసాద్ వేసే పంచులు అయితే నెక్స్ట్ లెవెల్. దాని వల్లే ప్రస్తుతం ఈయన ఈ స్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. తనదైన కామెడీ టైమింగ్ తో.. సీరియస్ గా ఉన్న సమయంలోనూ పంచులు వేసి అందరినీ నవ్విస్తుంటారు. పంచ్ ప్రసాద్ ఉన్నాడు అంటే చాలు ఆ ప్లేస్ అంతా నవ్వులు పూయాల్సిందే.

ఇలా వేలాది మందిని కడుపుబ్బా నవ్వించే ఈయన జీవితంలో మాత్రం చాలానే కష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా అనేక అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధ పడిన ఈయన చావు అంచుల వరకూ వెళ్లి వచ్చారు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయట పడిన ఈయన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అంతేకాదండోయ్ తన భార్య సునీత వల్లే తన ప్రాణాలు నిలబడ్డాయని అని కూడా చాలా సార్లు వివరించాడు. అయితే పెళ్లై కూతురు ఉన్న ఈయనను ఓ కుర్ర హీరోయిన్ ప్రేమిస్తోంది.
ముఖ్యంగా అతడంటే చాలా ఇష్టం అని చెప్పుకొస్తుంది. అతడు లేకుండా తాను ఉండలేనని వవిరిస్తూనే.. షూటింగ్ కు ఎక్కడికి వెళ్లినా వెంట బెట్టుకుని వెళ్తుంది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే పంచ్ ప్రసాద్ ను ప్రాణంగా ప్రేమిస్తున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు తులసీవనం సినిమా హీరోయిన్ ఐశ్వర్య హొల్లల్. తాజాగా ఈమె ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు వచ్చింది. అక్కడే పంచ్ ప్రసాద్ పై ప్రేమ కురించింది. అనుక్షణం అతడి చేతిని పట్టుకుని ఉంది.

అయితే వీళ్లు ఇదంతా స్కిట్ కోసమే చేశారు. అలాగే తులసీవనం సినిమా హీరో కూడా జబర్దస్త్ నరేష్ తో లేడీ గెటప్ వేయించి మరీ లవ్ ట్రాక్ నడిపాడు. ఇలా ఆద్యంతం ఆకట్టుకున్న ఈ స్కిట్ ను నూకరాజు వేయగా.. అంతా కడుపుబ్బా నవ్వారు. కేవలం స్కిట్ కోసం మాత్రమే హీరోయిన్.. పంచ్ ప్రసాద్ పై ప్రేమను చూపించింది.


Click it and Unblock the Notifications











