twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చివరి కోరిక తీరకుండానే TNR మృతి.. త్వరలోనే ఒక మంచి సినిమాతో రావాలని ప్లాన్ చేసుకునేలోపే..

    |

    ప్రముఖ జర్నలిస్ట్, యాంకర్, నటుడు అయినటువంటి TNR మృతి చెందడం అందరిని కలచి వేస్తోంది. ఆయన చివరి కోరిక కూడా తీరలేదు అని ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా సరే దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని TNR చాలానే కష్టపడ్డారు. ఇక త్వరలోనే ఒక సినిమాను స్టార్ట్ చేయాలని స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ ఇంతలోనే కరోనా ఆయన ప్రాణాలను తీసేసింది.

    TNR అనగానే..

    TNR అనగానే..

    కరోనా మహమ్మారి ప్రవాహంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొంతమంది అకస్మాత్తుగా ప్రాణాలు విడుస్తుండడం కలచి వేస్తోంది. తుమ్మల నరసింహా రెడ్డి కూడా కరోనాతో సోమవారం ఉదయం ప్రాణాలు. కోల్పోవడం అందరిని షాక్ కు గురి చేసింది. TNR అనగానే అందరికి గుర్తొచ్చేది ఐ డ్రీమ్ ఫ్రాంక్లీ విత్ TNR. 189 ఇంటర్వ్యూలతో ఒక రికార్డ్ క్రియేట్ చేసిన ఆయన యూ ట్యూబ్ లో మిలియన్ల వ్యూవ్స్ అందుకున్నారు.

    ఫోకస్ మొత్తం దానిపైనే..

    ఫోకస్ మొత్తం దానిపైనే..

    జర్నలిస్టుగా కొన్నాళ్లపాటు పలు మీడియా సంస్థలలో వర్క్ చేశారు. ప్రముఖ న్యూస్ ఛానెల్స్ లలో కూడా క్రైమ్ స్టోరీస్ వంటి ఎపిసోడ్స్ ను కూడా డైరెక్ట్ చేశారు. అయితే టెలివిజన్ వరల్డ్ లో ఎంత వర్క్ చేసినా కూడా ఆయన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉండేది. ఎప్పటికైనా వెండితెరపై దర్శకుడిగా తన పేరును చూసుకోవాలని కలలు కన్నారు.

    టాలెంట్ ఉన్న వారికి TNR సపోర్ట్

    టాలెంట్ ఉన్న వారికి TNR సపోర్ట్

    టాలెంట్ ఉన్న వారిని సపోర్ట్ చేయడంలో TNR ముందుంటారు. పెయిడ్ ప్రమోషన్ చేసుకునే ఈ రోజుల్లో చిన్న తరహా షార్ట్ ఫిలిమ్స్ తీసిన వారికి కూడా తన మద్దతు ఇచ్చేవారు. కనీసం ప్రమోషన్స్ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న దర్శకులకు నిర్మాతలకు కూడా ఆయన ఇంటర్వ్యూల ద్వారా సహాయం చేసి జనాల వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

    సహాయక దర్శకుడిగా..

    సహాయక దర్శకుడిగా..

    నిజానికి TNR దర్శకుడు అవ్వాలని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాడు. ఒకవైపు ఇంటర్వ్యూలు చేస్తూనే పలు సినిమాలలో నటించేవారు. ఇక కథలు కూడా రాసుకునేవారు. ఆయనసర్కస్ సత్తిపండు, జై భజరంగ్ దళ్ , పిట్టల దొర వంటి ఎన్నో సినిమాలకు సహాయక దర్శకుడిగా వర్క్ చేశారు.

    Recommended Video

    Popular Telugu YouTube Host #TNR Lost Life | Filmibeat Telugu
    చివరి కోరిక తీరకుండానే..

    చివరి కోరిక తీరకుండానే..

    ఇక ఇంటర్వ్యూలను కొన్నాళ్ళు పక్కన పెట్టి దర్శకుడిగా ఒక మంచి విలువలున్న సినిమాను తీయాలని అనుకున్నారు. స్క్రిప్ట్ కూడా సిద్ధమయ్యింది. నటీనటులతో కూడా అప్పుడప్పుడు సంప్రదింపులు జరిపారు. ఇక కోవిడ్ అనంతరం మళ్ళీ ఆ ఆలోచనను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇక ఇంతలోనే కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో చేరారు. చివరి శ్వాస వరకు పోరాడుతూ సోమవారం కన్నుమూశారు.

    TNR దర్శకుడు అవ్వాలని ఎన్నో కలలు కన్నారు. ఆ చివరి కోరిక తీరకుండానే తనువు చాలించడం బాధాకరమని ఆయన సన్నిహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

    English summary
    T Narasimha Reddy, popularly known as TNR (for his interview show Frankly Speaking With TNR), is reportedly critical. actor tnr passed away due to covid-19.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X