TNR చివరి మాటలు.. జాగ్రత్తగా ఉండండి.. వాళ్ళందరిని గుర్తు చేసుకుంటూ ఆఖరి చాలెంజ్!
ఇంటర్వ్యూలతో క్రేజ్ అందుకునే వారు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో TNR ఒకరు. ఫ్రాంక్లీ విత్ టీఎన్నార్ అనే ఐ డ్రీమ్ ప్రోగ్రామ్ ద్వారా దాదాపు సెలబ్రేటీల రేంజ్ లోనే క్రేజ్ అందుకుంటూ వచ్చారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ సున్నితమైన విషయాలను కూడా అర్థమయ్యేలా చెప్పే తుమ్మల నరసింహా రెడ్డి హఠాత్తుగా మరణించడం అందరిని కలచి వేస్తోంది. ఇక ఆయన ఆఖరి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. జనాల కోసం ఆయన చెప్పిన మాటలు అందరిని ఆలోచింపజేస్తున్నాయి.

కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా..
TNR ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబలో నుంచి వచ్చాడు. కష్టం విలువ తెలిసిన వ్యక్తి. ఒకప్పుడు ఆయనతో వర్క్ చేసిన వారు ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఇన్నేళ్ల జర్నలిజం కెరీర్ లో TNR ఏనాడు కూడా కాంట్రవర్సీల జోలికి పెద్దగా వెళ్లలేదు. ఎలాంటి ఇంటర్వ్యూలు చేసినా కూడా సెలబ్రేటీలను ఇబ్బందికరమైన ప్రశ్నలు కూడా వేసేవారు కాదు.

189 ఇంటర్వ్యూలు..
తుమ్మల నరసింహా రెడ్డితో ఇంటర్వ్యూ అంటే సెలబ్రేటీలు చాలా వరకు ఇంట్రెస్ట్ చూపేవారు. ఆయన ఎక్కువగా కంఫర్ట్ ఇచ్చేవారు. మంచి నేర్చుకోవాలనే తరహాలోనే ప్రశ్నలు అడిగేవారు. ఎంతో మంది అగ్ర దర్శకులను వ్యాపారులను నటీనటులను ఇంటర్వ్యూ చేసిన అనుభవం ఉంది. ఐ డ్రీమ్ లో 189 ఇంటర్వ్యూలో చేశారు.

TNR చెప్పిన ఆఖరి మాటలు
ఇక కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఎక్కువవుతున్న తరుణంలో TNR కొన్ని రోజుకు క్రితమే ఒక వీడియో రిలీజ్ చేశారు. తన ఫాలోవర్స్ కు తగిన జాగ్రత్తలు చెబుతూ కొంతమంది స్టార్స్ కు చాలెంజ్ కూడా విసిరారు. జనాల కోసం చేసిన చివరి వీడియో అదే కావడంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఎక్కడికి వెళ్లడం లేదు
అందులో TNR ఈ విధంగా మాట్లాడారు. ' మన స్టేట్ హోమ్ గవర్నమెంట్ ఇచ్చిన స్టే హోమ్ చాలెంజ్ ను స్వీకరిస్తున్నాను. ఒక వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండబోతున్నాను. ఎక్కడికి వెళ్లడం లేదు. మంచి పుస్తకాలు చదువుతున్నాను. మంచి సినిమాలు చూస్తున్నాను.. అని చెప్పారు.

దయచేసి ఇలాంటి సమయంలో
ఇంకా ఏం చెప్పారంటే.. చెడులో కూడా మంచిని వెతుక్కోవాలి అంటారు. ఈ కష్ట సమయంలో నేను మంచి అలవాట్లు నేర్చుకుంటున్నాను. డైలీ యోగా ప్రాణాయామం చేస్తున్నాను. పిల్లలతో కూడా చేయిస్తున్నాను. దయచేసి ఇలాంటి సమయంలో పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపండి. వాళ్ళకు మంచి విషయాలతో పాటు సొంతంగా పని చేసుకునేలా అలవాట్లు నేర్పండి. భవిష్యత్తుపై ఒక నమ్మకం ఏర్పరచండి.. అన్నారు.
Recommended Video

వారికి ఆఖరి చాలెంజ్
ఇక కొంతమందికి నేను ఫోన్ చేసిన మాట్లాడినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళే ఆందోళన చెందుతున్నారు అని విన్నాను. అలా అస్సలు పానిక్ అవ్వకూడదు. తగిన జాగ్రత్తలు తీసుకొని ఉంటే కరోనా ఏమి చేయదు. ధైర్యంగా ఉండండి. రూమర్స్ ను నమ్మకండి. పాజిటివ్ గా ఉండండి అని మాట్లాడారు. ఇక చివరగా నేను స్టే హోమ్ చాలెంజ్ కోసం ఐదుగురిని నామినేట్ చేస్తున్నాను అంటూ.. యాక్టర్ సత్యదేవ్, హర్షవర్ధన్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, లిరిసిస్ట్ చంద్రబోస్ గారు, నటి గౌతమి గారి పేర్లను గుర్తు చేసుకున్నారు. ఇదే TNR ఆఖరి వీడియో కావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











