బిగ్ బాస్2: చుక్కలు చూపిస్తున్న కౌశల్.. దీప్తికి నరకం కనిపిస్తోందిగా!
Recommended Video

బిగ్ బాస్ 2 చివరిదశకు చేరుకున్న నేపథ్యంలో అత్యంత రసవత్తరమైన టాస్క్ లు ప్రారంభమయ్యాయి. ఫైనల్ చేరుకునేందుకు ఇంటి సభ్యులు వారి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రస్తుతం హౌస్ లో అత్యంత కఠినమైన టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతోంది. మరోవైపు వీకెండ్ దగ్గర పడడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది.

టికెట్ టు ఫినాలే
గార్డెన్ ఏరియాలో ఉన్నా కారులో ముందుగా ఎవరు కూర్చుంటారో వారు ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ పోటీదారులు. సైరన్ మోగగానే తనీష్, దీప్తి, శ్యామల, గీత, సామ్రాట్ కారులో కూర్చున్నారు. వీరే ప్రస్తుతం పోటీలో ఉన్నారు. 24 గంటల వరకు ఎవరూ కారునుంచి కిందకు దిగకూడదు. చివరి వరకు కారులో ఉన్నవారు ఫైనల్స్ కు అర్హత సాధిస్తారు. ఒక వేళా ఒకటికన్నా ఎక్కువమంది చివరి వరకు కారులో ఉంటే ఎవరికీ అవకాశం ఉండదు.

కౌశల్‌కు ప్రాధాన్యత
కౌశల్ సీజన్ మొత్తం నామినేట్ కావడంతో ఈ పోటీకి అర్హుడు కాదని బిగ్ బాస్ ప్రకటించాడు. దీనితో కౌశల్ పోటీ నుంచి దూరంగా ఉన్నాడు. కానీ కౌశల్ కు బిగ్ బాస్ మంచి ప్రాధాన్యత ఇచ్చాడు. టికెట్ టు ఫినాలే టాస్క్ ని పర్యవేక్షించే సంచాలకుడి బాధ్యతని బిగ్ బాస్ కౌశల్ కు అప్పగించారు.

గంటల తరబడి
కారులో గంటల తరబడి కూర్చోవడంతో వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. కౌశల్ సంచలకుడిగా నిభందనలు కఠినంగా అమలు చేస్తున్నాడు. కారులో ఉన్నవారెవరూ ఆట నియమాలు తప్పకుండా చూసుకుంటున్నాడు.

చలికి వణుకుతూ
బిగ్ బాస్ నిబంధన ప్రకారం కనీసం కారు అద్దాలు కూడా మూయడానికి వీల్లేదు. దీనితో దీప్తి చలికి వణికిపోతోంది. చలిపెడుతోంది కౌశల్.. బెడ్ షీట్ ఇస్తావా అని దీనంగా అడుగుతోంది. అందుకు కౌశల్ నో చెప్పాడు. నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబందించి ప్రోమో విడుదల చేశారు.

కష్టం వృధానే
ప్రస్తుతం కారులో తనీష్, దీప్తి, గీత, శ్యామల, సామ్రాట్ ఉన్నారు. చూస్తుంటే టాస్క్ పూర్తయ్యే వరకు ఎంత కష్టం వచ్చినా వీరు కారు దిగేలా కనిపించడం లేదు. అదే జరిగితే కారులో ఉన్న అందరి కష్టం వృధా అవుతుంది.


Click it and Unblock the Notifications











