Bigg Boss షోపై నోరు జారిన సెలెబ్రిటీ: సీక్రెట్ ఫోన్ కాల్‌ను లీక్ చేయడంతో బట్టబయలు

ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న అంశాల్లో బిగ్ బాస్ షో ఒకటి. మన బుల్లితెరపై భారీ స్థాయిలో ఆదరణను అందుకుని నెంబర్ వన్ షోగా వెలుగొందుతోన్న దీనిపై ప్రేక్షకులు రోజురోజుకూ మక్కువను పెంచుకుంటూనే ఉన్నారు. అందుకే ఈ రియాలిటీ షో తెలుగులో నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగిలిగింది.

ఈ క్రమంలోనే ఐదో దాని కోసం కూడా రంగం సిద్ధం అవుతోంది. అందుకే ఈ షో గురించి అంశాలు తరచూ వార్తల్లో ఉండడం వల్లే బిగ్ బాస్ పేరు మారుమ్రోగిపోతోంది. ఐదో సీజన్‌లోకి పలానా కంటెస్టెంట్ ఎంట్రీ ఇస్తున్నారన్న వార్తలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఓ సెలెబ్రిటీ బిగ్ బాస్ గురించి నోరు జారారు. అంతేకాదు, ఓ సీక్రెట్‌ను కూడా లీక్ చేశారు. ఆ వివరాలు మీకోసం!

అనుమానాలతో మొదలు.. సూపర్ హిట్

అనుమానాలతో మొదలు.. సూపర్ హిట్

తెలుగులో రియాలిటీ ఆధారంగా నడిచే షోలు పెద్దగా రాలేదు. ఇలాంటి సమయంలో బుల్లితెరకు పరిచయం అయిందే బిగ్ బాస్. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా మొదలైన ఈ షో మన భాషలోకి వచ్చిన సమయంలో పెద్దగా అంచనాలు లేవు. కంటెస్టెంట్లను ఇంట్లో పెట్టి నడిపించే ఇలాంటి షోను మన వాళ్లు ఆదరిస్తారా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

ఇలాంటి తరుణంలో ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి సూపర్ సక్సెస్ అయింది బిగ్ బాస్. అంతేకాదు, ఒకదానికి మించి ఒకటి సూపర్ హిట్ అవుతూ ఏకంగా నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది.

ముగ్గురు హోస్టులు.. నేషనల్ లెవెల్ క్రేజ్

ముగ్గురు హోస్టులు.. నేషనల్ లెవెల్ క్రేజ్

హిందీలో పదిహేనేళ్ల క్రితమే బిగ్ బాస్ షో ప్రారంభం అయింది. ఆ తర్వాత మరికొన్ని భాషల్లో పరిచయం అయింది. మొదటి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్, రెండో దాన్ని నేచురల్ స్టార్ నాని, మూడు నాలుగు సీజన్లను కింగ్ అక్కినేని నాగార్జున తమదైన శైలి హోస్టింగ్‌తో నడిపించారు. అందుకే మిగిలిన అన్ని భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్‌ షోకు మాత్రమే మరింత ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది నేషనల్ లెవెల్‌లోనే అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను అందుకుంటోంది. ఈ క్రమంలోనే గత సీజన్‌లో ఏకంగా 18 పైచిలుకు రేటింగ్‌తో రికార్డు నమోదైంది.

ఐదో సీజన్‌పై ప్రకటన.. ఫ్యాన్స్ సంతోషం

ఐదో సీజన్‌పై ప్రకటన.. ఫ్యాన్స్ సంతోషం

బిగ్ బాస్ షో తెలుగులో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. దీంతో ప్రతి సంవత్సరం ఈ షో కోసం వాళ్లంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా ఐదో సీజన్‌ మొదలయ్యే అవకాశాలు లేవని ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. కానీ, ఇటీవలే లోగో ప్రోమో కూడా విడుదలైంది.

తద్వారా త్వరలోనే కొత్త సీజన్ రాబోతుందని ప్రకటించారు. దీంతో బిగ్ బాస్ ప్రియులంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక, ఈ సీజన్ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రసారం కాబోతుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఇప్పుడు జరుగుతున్న వర్క్ వివరాలివే

ఇప్పుడు జరుగుతున్న వర్క్ వివరాలివే

వాస్తవానికి కరోనా ప్రభావం కారణంగా అసలు ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్‌ను ప్రారంభించాలా? వద్దా? అన్న సంశయంలో ఉండిపోయారు నిర్వహకులు. అందుకే దీనికి సంబంధించిన పనులను ఈ మధ్యనే మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే ముందుగా కంటెస్టెంట్ల ఎంపికపై దృష్టి సారించిన బిగ్ బాస్ టీమ్.. 50 మందితో ఆన్‌లైన్ ద్వారానే సంప్రదింపులు జరిపారట.

అందులో షార్ట్ లిస్టును కూడా తయారు చేశారని తెలుస్తోంది. ఈ జాబితాలోని సభ్యులతో జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూలు జరిపారు. ఇక, ఇప్పుడు సెట్‌కు సంబంధించిన ఫినిషింగ్ వర్క్ జరుగుతుందని తెలిసింది.

ఐదో సీజన్‌లో కంటెస్టెంట్ల లిస్ట్ ఇదేనంటూ

ఐదో సీజన్‌లో కంటెస్టెంట్ల లిస్ట్ ఇదేనంటూ

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌కు సంబంధించిన అన్ని విషయాలను రహస్యంగా ఉంచడానికే నిర్వహకులు ప్రయత్నాలు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్ల ఎంపిక గురించి పకడ్బందీ చర్యలు తీసుకుంటారు. కానీ, మొదటి సీజన్ నుంచే అన్నీ ముందే లీక్ అవుతున్నాయి.

ఇక, ఇప్పటికి అందిన సమచారం ప్రకారం.. త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఐదో సీజన్‌లో సిరి హన్మంత్, నవ్య స్వామి, శ్రీహాన్, గీతా సింగ్, షణ్ముక్ జశ్వంత్, హేమచంద్ర, యాంకర్ వర్షిణి సౌందరాజన్, యాంకర్ రవి, రఘు మాస్టర్, టిక్ టాక్ దుర్గారావులు పాల్గొనబోతున్నట్లు ఓ లిస్ట్ తెగ వైరల్ అవుతోంది.

Bigg Boss షోపై నోరు జారిన సెలెబ్రిటీ

Bigg Boss షోపై నోరు జారిన సెలెబ్రిటీ

బిగ్ బాస్ షోపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను అందుకునే క్రమంలో దానికి సంబంధించిన రహస్యాలను బయట పెట్టేందుకు మీడియా రంగానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నాలు సాగిస్తుంటారు.

ఇందులో భాగంగానే బిగ్ బాస్‌లో పాల్గొనబోతున్నారు అనుకున్న సెలెబ్రిటీలను గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతూ నిజాలను రాబట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టిక్‌టాక్ స్టార్ దుర్గారావును ఓ యూట్యూబ్ ఛానెల్ చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలోనే అతడి బిగ్ బాస్ ఎంట్రీపై ఎన్నో రకాలుగా ప్రశ్నలు అడిగారు. దీంతో దుర్గారావు నోరు జారి కొన్ని విషయాలను లీక్ చేసేశాడు.

Recommended Video

Hero Balakrishna Appreciates Natyam Team | నమః శివాయా అద్భుతమైన పాట
సీక్రెట్ ఫోన్ కాల్‌ను లీక్ చేయడంతో షాక్

సీక్రెట్ ఫోన్ కాల్‌ను లీక్ చేయడంతో షాక్

ఈ చిట్ చాట్‌లో భాగంగా రిపోర్టర్ 'మీరు బిగ్ బాస్ షోలోకి వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది. అసలు నిజంగానే వెళ్తున్నారా? వెళ్తే ఒక్కరే వెళ్తారా మీ భార్యను తీసుకుని వెళ్తారా' అని ప్రశ్నించారు. దీనికి దుర్గారావు 'నాకు ఆ షోలోకి వెళ్లే ఛాన్స్ వస్తే అప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు ఒక్కడినైనా వెళ్తా. ఇటీవల ఎవరో నాకు ఫోన్ చేసి బిగ్ బాస్‌లోకి వస్తారా అని అడిగారు' అంటూ సీక్రెట్‌ను రివీల్ చేసేశాడు. దీంతో దుర్గారావు ఐదో సీజన్‌లోకి వెళ్లడం దాదాపుగా ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X