twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోజాకు భారీ షాకిచ్చిన దుర్గారావు.. యాంకర్ రష్మీ సీటుకు ఎసరు పెట్టిన టిక్ టాక్ స్టార్.!

    By Manoj Kumar P
    |

    సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది తమ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు ప్రయత్నం చేశారు. అలాంటి వారిలో కొన్ని వందల మంది అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శించి పాపులారిటీని సంపాదించుకున్నారు. అలా చాలా ప్రయత్నాలు చేసి విపరీతమైన క్రేజ్‌ను అందుకున్న వారిలో దుర్గారావు ఒకడు. టిక్ టాక్ అనే యాప్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆయన.. కొద్ది రోజులుగా బుల్లితెరపై బాగా హల్‌చల్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోజాకు ఆయన భారీ షాకిచ్చాడు. అంతేకాదు, రష్మీని సైతం టార్గెట్ చేశాడు. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

    దుర్గారావు.... చాలా ఫేమస్ గురూ

    దుర్గారావు.... చాలా ఫేమస్ గురూ

    టిక్ టాక్ ద్వారా ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. కానీ కొంత మంది మాత్రమే విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. అలాంటి వారిలో దుర్గారావు ఆయన భార్య గంగారత్నం. వీళ్లిద్దరూ కలిసి ఆ కాలం నాటి నుంచి కొత్త పాటల వరకు దేనిని వదలకుండా స్పెప్పులు వేసేవారు. పాటకు తగ్గట్లు కాస్ట్యూమ్స్ ధరించే కాళ్లు కదిపేవారు. దీంతో ఈ జంట బాగా ఫేమస్ అయిపోయింది.

    ఏ షోనూ వదలని టిక్‌ టాక్ జంట

    ఏ షోనూ వదలని టిక్‌ టాక్ జంట

    టిక్ టాక్‌ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేదించిన విషయం తెలిసిందే. అయితే, అప్పటికే దుర్గారావు జంట బాగా పాపులర్ అయిపోయింది. దీంతో వీళ్లిద్దరిని చాలా షోలలోకి తీసుకొచ్చారు. హైపర్ ఆది స్కిట్ ద్వారా జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన టాక్ టాక్ జోడీ... ఆ వెంటనే మెగా బ్రదర్ నాగబాబు ప్రాతినిధ్య వహిస్తోన్న ‘అదిరింది' కామెడీ షోలోకి సైతం అడుగు పెట్టింది.

    సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్‌గా

    సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్‌గా

    తనదైన శైలి అభినయంతో ఎన్నో వీడియోలను చేశారు దుర్గారావు ఆయన భార్య గంగారత్నం. వీటిలో పలాస అనే సినిమాలోని ‘నక్కిలీసు గొలుసు' అనే పాట బాగా పాపులర్ అయింది. దీనిని ప్రధానంగా తీసుకుని ‘ఢీ' షోలో పండు మాస్టర్ ఓ పాటకు డ్యాన్స్ చేశాడు. ఈ పాట హిట్ అవడంతో పాటు దుర్గారావుకు కూడా బాగా పేరు తెచ్చింది. దీంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

    మరోసారి అలా ఎంట్రీ ఇచ్చిన జోడీ

    మరోసారి అలా ఎంట్రీ ఇచ్చిన జోడీ

    వచ్చే వారంతో ఎక్స్‌ట్రా జబర్ధస్త్ 300 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోనుంది. దీన్ని ఎంతో గ్రాండ్‌గా నిర్వహించారు షో నిర్వహకులు. ఇందులో దుర్గారావు ఆయన భార్య గంగారత్నం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుర్తింపు తీసుకొచ్చిన పాటకు మరోసారి స్టెప్పులేశారీ ఇద్దరు. అంతేకాదు, కొన్ని డైలాగ్స్ కూడా చెప్పారు. దీంతో ప్రతిష్టాత్మకమైన ఎపిసోడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

    రోజాకు భారీ షాకిచ్చిన దుర్గారావు

    రోజాకు భారీ షాకిచ్చిన దుర్గారావు

    స్కిట్‌లో భాగంగా దుర్గారావు.. జబర్ధస్త్ జడ్జ్, సీనియర్ హీరోయిన్ రోజాతో మాట్లాడుతూ... ‘మాకేమీ పెద్దగా కోరికలు లేవు మేడం. ఏదో మీ చైర్ పక్కన ఓ ప్లాస్టిక్ కుర్చీ వేసుకుని కూర్చుని జడ్జ్‌మెంట్ చెప్పుకుంటూ బతికేద్దాం అనుకుంటున్నా' అని చెప్పాడు. దీనికి షాకైన రోజా నోరెళ్లబెట్టేసింది. ఆ పక్కనే ఉన్న మరో జడ్జ్ మనో కూడా ఆశ్చర్యంతో పక పకా నవ్వేశాడు.

    Recommended Video

    Hero Sudheer Babu Special Interview On 'V' Movie
    రష్మీకీ ఎసరు పెట్టిన టిక్ టాక్ స్టార్

    రష్మీకీ ఎసరు పెట్టిన టిక్ టాక్ స్టార్

    దుర్గారావు డైలాగ్ చెప్పిన వెంటనే... ఆయన భార్య కూడా డైలాగ్ అందుకుంది. ఇందులో భాగంగానే ఆమె ‘ఏమండి నాకా చైర్ కావాలండీ' అంటూ రష్మీ సీటు వైపు చూపించింది. అంటే పరోక్షంగా తాను యాంకర్‌ను అవుతానని చెప్పింది. దీంతో ఆ యాంకర్ కూడా అవాక్కయిపోయింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ కూడా క్రియేట్ చేశారు కొందరు ఔత్సాహకులు.

    English summary
    Hyper Aadi is an Indian TV and film actor who primarily works in Telugu cinema and Telugu TV series. Having completed his B. Tech in 2012, Aadi started working in a Software firm in Hyderabad before eventually venturing in the entertainment industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X