Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
బాగానే వాడుకుంటున్నారు.. స్టెప్పులతో చించేసిన టిక్ టాక్ ఫేమ్ దుర్గారావ్ క్రేజ్
సోషల్ మీడియా ద్వారా ఎంత మంది ప్రపంచానికి పరిచయమయ్యారో అందరికీ తెలిసిందే. తమలోని ప్రతిభను ప్రదర్శించేందుకు సోషల్ మీడియా ఓ సాధనంగా ఉపయోగపడింది. మారుమూలల్లో మగ్గిపోతోన్న టాలెంట్ కూడా జనాల దృష్టిలో పడింది. డబ్ స్మాష్, టిక్ టాక్ వంటి ఎన్నెన్నోయాప్స్ ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అయితే అన్నింట్లోకెల్లా టిక్ టాక్ ప్రభంజనం అంతా ఇంతా కాదు.
వెలుగులోకి ఎంతోమంది..
టిక్ టాక్ ద్వారా ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. అలా సోషల్ మీడియా నుంచి వెండితెర, బుల్లితెర అంటూ ఎదుగుతూనే ఉన్నారు. ఒక్కొక్కరు తమ తమ ప్రతిభలను బయటపెట్టేసి విపరీతంగా ఫేమస్ అయ్యారు. అందులో ఒకరు దుర్గా రావ్. ఆ మధ్య దుర్గా రావ్ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో మార్మోగింది.
ఢీ షోతో మరింత ఫేమస్..
టిక్ టాక్ యాప్‌లో తనదైన సెటప్, సెటింగ్స్లతో డ్యాన్సులు వేసే దుర్గారావ్ ఢీ షోలో, డ్యాన్సర్ పండు వల్ల మరింత ఫేమస్ అయ్యాడు. నాది నక్కిలీసు గొలుసు అనే పాటకు టిక్ టాక్‌లో దుర్గారావ్ వేసిన స్టెప్పులను ఢీ వేదికపై పండు వేశాడు. ఆ దెబ్బతో పాట, పండు, దుర్గారావ్ అందరూ ఫేమస్ అయ్యారు.
అందరితో రచ్చ..
అలా ఓ నెల మొత్తం దుర్గా రావ్ టాపిక్ నడిచింది. అలా దుర్గారావ్ ఢీ స్టేజ్ మీదకు ఎక్కాడు. అక్కడి నుంచి జబర్దస్త్ వేదికపైకి ఎక్కాడు. అలా మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా అయ్యాడు. మొత్తంగా దుర్గా రావ్ అనే వ్యక్తి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయ్యాడు.
సినిమాల్లోనూ..
దుర్గా రావ్ క్రేజ్‌ను ఇటు బుల్లితెర అటు వెండితెర వాడేసుకుంటోంది. ఈ మధ్యే క్రాక్ సినిమాలోనూ ఓ స్పెషల్ సాంగ్‌లోనూ దుర్గా రావ్ సందడి చేశాడు. అలా సినిమా ఆఫర్లను కూడా దుర్గారావ్ కొట్టేస్తున్నాడు. తాజాగా మరోసారి తన డ్యాన్స్ సత్తాను చాటాడు.
ఢీ షోలో వెరైటీ స్టెప్పులు..
తాజాగా ఢీ కింగ్స్ వర్సెస్ క్వీన్ ప్రోమో వచ్చింది. అందులోనూ దుర్గారావ్ను పట్టుకొచ్చారు. అతనితో స్పెషల్ పర్ఫామెన్స్ చేయించాడు. ఇక మనోడు కూడా రెచ్చిపోయి మరీ వెరైటీ స్టెప్పులు వేశాడు. అలా మొత్తానికి దుర్గా రావ్ హవా నడుస్తుండటంతో ఇలా బుల్లితెరపై సందడి చేస్తున్నాడు.