డ్యాన్సర్, టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య.. బాలీవుడ్‌లో మరో విషాదం!

యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, క్రైమ్ పెట్రోల్ నటి ప్రేక్షా మెహతా మరణ విషాదాల నుంచి ఇంకా కోలుకోకముందే వినోద పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకొన్నది. టిక్ టాక్ ఆర్టిస్ట్, డ్యాన్సర్ సియా కక్కర్ న్యూఢిల్లీలో ఆత్మహత్య చేసుకొని మరణించడం అందర్నీ మరోసారి విషాదంలోకి నెట్టింది. సియా కక్కర్ మరణాన్ని ఆమె మేనేజర్ అధికారికంగా ధృవీకరించారు. ఆమె మరణం గురించి, మృతి కారణాలను మేనేజర్ వెల్లడిస్తూ..

వ్యకిగత జీవితంలో కలతలు

వ్యకిగత జీవితంలో కలతలు

టిక్ టాక్ స్టార్‌గా ఎంతో మందిని ఆకట్టుకొంటున్న సియా కక్కర్ న్యూఢిల్లీలో జూన్ 25వ తేదీన ఆత్మహత్య చేసుకొన్నారు. ప్రొఫెషనల్‌గా బాగా రాణిస్తున్న సమయంలో కొన్ని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఆమెకు మనస్తాపానికి గురిచేశాయి. జూన్ 24వ తేదీ ఆమెతో ఓ ప్రాజెక్టు గురించి మాట్లాడితే ఎలాంటి ఆందోళన గానీ, తీవ్రమైన మాటలు గానీ ధ్వనించలేదు అని సియా కక్కర్ మేనేజర్ అర్జున్ సరీన్ ఓ ప్రకటనలో తెలిపారు.

అత్యంత ప్రతిభావంతురాలు

అత్యంత ప్రతిభావంతురాలు

ఫేమ్ ఎక్స్‌పర్ట్స్ అనే కంపెనీ చాలాకాలంగా నిర్వహిస్తున్నాను. నా వద్ద ఉండే డ్యాన్సర్లు, నటులతో పోల్చుకొంటే సియా ప్రతిభావంతురాలు. ఆమె మరణవార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆమెకు శ్రద్దాంజలి ఘటించేందుకు వెళ్లున్నాను అని మీడియాతో అర్జున్ సరీన్ తెలిపారు.

పాటలో నటించమని అడిగా.. బాలీవుడ్ ఫొటోగ్రాఫర్

పాటలో నటించమని అడిగా.. బాలీవుడ్ ఫొటోగ్రాఫర్

బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ బియానీ తన ఇన్స్‌టాగ్రామ్‌లో తీవ్ర విషాదాన్ని పంచుకొన్నారు. 16 ఏళ్ల సియా కక్కర్ ఆత్మహత్య చేసుకొని మరణించడం చాలా బాధగా ఉంది. ఓ పాటలో నటించమని అడిగేందుకు గతరాత్రి నేను అర్జున్ సరీన్‌తో మాట్లాడాను. ఏం జరిగిందో తెల్లవారేసరికి ఆమె విగత జీవిగా మారిపోయింది. అభినయంలో వయసుకు తగిన పరిణతిని సియా చూపించే వారు. గొప్ప భవిష్యత్ ఉంటుందనే అభిప్రాయంతో ఉండేవాడిని అని వైరల్ బియానీ తన పోస్టులో పేర్కొన్నారు.

Recommended Video

Pellichoopulu Is A Big Disaster In Bollywood
సోషల్ మీడియాలో వైరల్‌గా

సోషల్ మీడియాలో వైరల్‌గా

సియా కక్కర్ దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రీత్ విహార్‌ నివాసి. గత కొన్నేళ్లుగా టిక్ టాక్, ఇన్స్‌టాగ్రామ్, స్నాప్ చాట్, యూట్యూబ్‌ ద్వారా వినోద పరిశ్రమలో రాణిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె డ్యాన్స్ వీడియోలు వైరల్‌గా మారారయి. ఇన్స్‌టాగ్రామ్‌లో ఆమెకు 104K ఫాలోవర్స్, టిక్ టాక్‌లో 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. బాలీవుడ్ చిత్రపరిశ్రమలో పలు ఈవెంట్లలో డ్యాన్సర్‌గా ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X