Bigg Boss Season 7: బిగ్ బాస్‌లోకి ఆ ఫేమస్ కపుల్ ఎంట్రీ... ఇక మామూలుగా ఉండదు అంటున్నారే?
పాపులర్ తెలుగు టీవీ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ -7 త్వరలో ప్రారంభం కానుంది. సక్సెస్ ఫుల్ గా 6 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో.. త్వరలో 7వ సీజన్ ను ప్రారంభించనున్నారు మేకర్స్. ఇక ఈ బిగ్ బాస్ గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది. ఇక తాజాగా బిగ్ బాస్ హౌజ్ లోకి ఓ ఫేమస్ జంట ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...
రోజుకో వార్త వైరల్: తెలుగులో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఇక ఈ షో త్వరలోనే తెలుగులో సీజన్ 7 ప్రారంభం కానుంది. ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ ప్రోమో కూడా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ షోలో నాగార్జునే మళ్లీ హోస్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ షోకు సంబంధించి రోజుకో వార్త ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతన్న సంగతి తెలిసిందే.

టిక్ టాక్ ద్వారా ఫేమస్: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ లో ప్రతీ ఏడాదిలాగే ఈ సారి కూడా పలువురు టీవీ, సినీ సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేయనున్నారు. తాజాగా ఈ బిగ్ బాస్ హౌజ్ లోకి ఓ ఫేమస్ జంట ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాళ్లు ఎవరో కాదు.. టిక్ టాక్ ద్వారా పాపుల్ అయిన దుర్గారావు జంట. భార్యతో కలిసి టిక్ టాక్ లో చేసిన డ్యాన్స్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి.

రవితేజతో కలిసి స్టేప్పులు: ఇక ఆయన ఇటీవల రవితేజ క్రాక్ సినిమాలోనూ... తళుక్కుమన్నారు. గత సీజన్లలోనే ఈ జంట ఎంట్రీ ఇవ్వాల్సి ఉండే. కానీ ఏమైందో కానీ... బిగ్ బాస్ లోకి అడుగు పెట్టలేదు. ఇక ఈ సారి ఈ పాపులర్ జంట.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో తనను ఒక్కడికే ఛాన్స్ ఇవ్వడంతో.. బిగ్ బాస్ కు నో చెప్పినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ సారి భార్యభర్తలను ఇద్దరినీ బిగ్ బాస్ తీసుకోవాడానకి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

మామూలుగా ఉండదు మరి: టిక్ టాక్ వీడియోలతో, జబర్ధస్త్ కామెడీ షోలో మెరిసిన దుర్గారావు... బాగా ఫేమస్ అయితే అయ్యారు. ఆయన వేసే స్టేప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అప్పటి నుంచి ఈ జంట బాగా పాపులర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ వారిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఒకవేళ వీరు బిగ్ బాస్ లోకి అడుగు పెడితే.. ఇక మాములుగా ఉండదు అంటున్నారు నెటిజన్స్.
ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే.. ఈసారి ఈ షోలో శోభా శెట్టి, సింగర్ మోహన భోగరాజు, యూట్యూబర్ స్వేత నాయుడు, యాంకర్ దీపిక పిల్లి, దుర్గారావు కపూల్, సింగర్ సాకేత్, సురేఖ వాణి, సంతోషం సురేష్ వంటి వారు బిగ్ బాస్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











