నా ప్రియుడు దారుణంగా హింసించాడు.. ఐదేళ్లు నరకయాతన.. జీవితం సర్వనాశనం!

వినోద పరిశ్రమలో యువ తార టీనా దత్తా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంచలన విషయాలను వెల్లడించారు. గతంలో ప్రియుడితో అఫైర్ పెట్టుకొన్న సమయంలో తాను అనుభవించిన దారుణమైన జీవితాన్ని పూసగుచ్చినట్టు తెలిపింది. గత ఐదేళ్ల నా రిలేషన్ నా జీవితాన్ని నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. తన జీవితంలో చోటుచేసుకొన్న దారుణమైన విషయాలను ఇటీవల ముంబై మీడియాకు వెల్లడించింది. ఆమె ఏమన్నారంటే..

ఐదేళ్లుగా ఓ వ్యక్తితో అఫైర్

ఐదేళ్లుగా ఓ వ్యక్తితో అఫైర్

పరిశ్రమకు ఏ మాత్రం సంబంధం లేని ఓ వ్యక్తితో ఐదేళ్లు అఫైర్ కొనసాగించాను. ఆ వ్యక్తి నా ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి నన్ను మానసికంగా, భౌతికంగా హింసించాడు. శారీరకంగా నన్ను వేధించాడు అని టీనా దత్తా చెప్పారు.

బ్రేకప్ తర్వాత నాకు స్వేచ్ఛ

బ్రేకప్ తర్వాత నాకు స్వేచ్ఛ

ఆ వ్యక్తితో రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు సమాజాన్ని, నా చుట్టు ఉన్న వ్యక్తులను భరించడం చాలా కష్టమైంది. బ్రేకప్ తర్వాత ఇప్పుడు నా జీవితంలో చోటుచేసుకొన్న విషయాలను బయటి ప్రపంచానికి తెలియజెప్పే స్వేచ్ఛ నాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది అని టీనా ఆవేదన వ్యక్తం చేశారు.

 నన్ను దారుణంగా కొట్టాడు

నన్ను దారుణంగా కొట్టాడు

నా మాజీ ప్రియుడు నా ఫ్రెండ్స్ ముందే దారుణంగా కొట్టాడు. ఆయన దారుణాలను తట్టుకోవడానికి పారిపోవాలనుకొన్నాను. నా వ్యక్తిగత జీవితాన్ని బయటి ప్రపంచానికి ఎన్నడూ చెప్పొద్దని అనుకొన్నాను. కానీ చెప్పకపోతే నేనేదో తప్పు చేసిన దానిని అవుతానేమో అని టీనా దత్తా పేర్కొన్నారు.

మానసిక క్షోభ నుంచి బయటపడి

మానసిక క్షోభ నుంచి బయటపడి

మానసిక, శారీరక క్షోభ నుంచి బయటపడిన తర్వాత నేను ఇప్పుడు జీవితంలో స్థిరపడాలనుకొనుకొంటున్నాను. నా హృదయం ముక్కలవ్వడంతో మరెవరితోనూ సంబంధాలు పెట్టుకోవద్దని నిర్ణయించుకొన్నాను. నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకొనే దానిని. కానీ నా వద్దకు మంచి వ్యక్తులను పంపలేదు.

అలాంటి వారిని పెళ్లి చేసుకోను

అలాంటి వారిని పెళ్లి చేసుకోను

నా జీవితంలో ఇక ముందు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోను. ముఖ్యంగా నటుడిని పెళ్లి చేసుకొంటే లైఫ్‌లో అనుమానాలు, అభద్రతభావం పెరిగిపోతుంది. సినీ పరిశ్రమలో నటులు పెళ్లిళ్లు ఎన్నో పెటాకులు అయ్యాయి. అందుకే నేను పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని మీడియాకు టీనా చెప్పింది.

నిర్మాత ఏక్తాకపూర్‌తో టీనా దత్తా

నిర్మాత ఏక్తాకపూర్‌తో టీనా దత్తా

ప్రస్తుతం కలర్స్ టెలివిజన్ ఛానెల్లో ప్రసారం అవుతున్న ఉత్తరాన్‌లో ఇచ్చా అనే పాత్రలో నటిస్తున్నాను. చిన్న వయసులోనే నాకు మంచి సక్సెస్ లభించింది. దానిని ఇప్పుడు కాపాడుకోవాలనుకొంటున్నాను. నేను సంపాదించిన సొమ్ము భద్రంగా ఉంది. దానిని జాగ్రత్తగా కాపాడుకొంటాను. అలాగే ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ రూపొందించే దాయన్‌లో నటిస్తున్నాను అని టీనా దత్తా చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X