Bigg Boss Telugu 7: ఫ్యామిలీ వీక్ తర్వాత స్ట్రాటెజీ మార్చిన టైటిల్ ఫేవరెట్లు.. శివాజి గెలవనిచ్చేనా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో తెలియదు కానీ.. అద్భుతమైన రేటింగ్ తో దూసుకు వెళ్తుంది. బిగ్ బాస్ కూడా తాను గెలిపించాలనుకున్న వాళ్లను గెలిపించలేకపోతున్నాడు. ముఖ్యంగా బిగ్ బాస్ ప్లాన్ కు శివాజి, పల్లవి ప్రశాంత్ లు బాగా అడ్డొస్తున్నారు. ముఖ్యంగా శివాజి అయితే అద్భుతమైన ఆటతో అందరినీ అల్లాడిస్తున్నాడు. ఏం చేస్తే ప్రేక్షకల మనుసులో స్థానం సంపాధించొచ్చే తెలుసుకుని మరీ అలాగే మెలుగుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఒక్కొక్కరిపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ తన గేమ్ ను ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు.

Title Favourites Priyanka Jain Amardeep Shobha Shetty Ambati Arjun Changed Thier Game Strategy in Bigg Boss Telugu 7

పదో వారంలో భాగంగా వచ్చి ఫ్యామిలీ వీక్ తర్వాత టైటిల్ ఫేవరెట్లు తమ గేమ్ స్ట్రాటెజీని మార్చేశారు. ఈసారి కప్పు కొట్టాలని విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ స్టార్ మా బ్యాచ్ వాళ్లను టాప్ 5 లో ఉంచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ శివాజి గేమ్ కు అదంతా కుదరట్లేదు. ఎప్పుడూ ఒకే గ్రూపుగా ఉండి గేమ్ ఆడుతున్న టైటిల్ ఫేవరెట్లు.. శోభా శెట్టి, అమర్ దీప్, ప్రియాంక జైన్ లకు ఎప్పటికప్పుడు శివాజి గట్టిగానే ఇస్తున్నాడు. వారు గ్రూపు గేమ్ ఆడుతున్నారని ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చెబుతున్నారు.

Title Favourites Priyanka Jain Amardeep Shobha Shetty Ambati Arjun Changed Thier Game Strategy in Bigg Boss Telugu 7

ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ తర్వాత శోభా శెట్టి, అమర్ దీప్, ప్రియాంక జైన్ లు గ్రూపుగా గేమ్ ఆడట్లేదు. అలాగే వాళ్లలో వాళ్లే గొడవలు పెట్టుకుంటూ తాము ఓ గ్రూపు కాదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇప్పటికే గేమ్ చూసి వచ్చి సింగిల్ గా విన్ అయ్యేందుకు కృషి చేస్తున్న మరో టైటిల్ ఫేవరెట్ అంబటి అర్జున్ కూడా ఎమోషన్స్ ను చూపించమని భార్య చెప్పగా... రెచ్చిపోతున్నాడు. అగ్రెషన్ చూపిస్తూ హల్ చల్ చేస్తున్నాడు. అయితేతాజాగా ఎవిక్షన్ పాస్ కోసం పోటీ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.

Title Favourites Priyanka Jain Amardeep Shobha Shetty Ambati Arjun Changed Thier Game Strategy in Bigg Boss Telugu 7

ఈ పోటీలో భాగంగా నిన్న బిగ్ బాస్ బాల్ బ్యాలెన్సింగ్ టాస్క్ నిర్వహించారు. ఇందులో పల్లవి ప్రశాంత్, శోభా శెట్టిలు సంచాలకులుగా ఉండగా.. శివాజి, ప్రియాంక జైన్, యావర్ లు గేమ్ ఆడారు. అయితే ఇందులో సంచాలకులు డిస్ట్రబ్ చేయడం వల్లే తన గేమ్ నాశనం అయిందని శివాజి ఫైర్ అయ్యాడు. అయితే ముందుగానే ప్రియాంక జైన్ బాల్స్ కింద పడిపోయాయి. కానీ శోభా శెట్టి మాత్రం శివాజి ఎక్కువ సేపు ఆపలేకపోయారంటూ ఆయనను తొలగించింది. దీంతో శివాజి ఫుల్ ఫైర్ అయ్యాడు. అమర్ దీప్, ప్రియాంక జైన్ లను శోభాశెట్టి ఎప్పుడూ గెలిపిస్తుందంటూ వ్యాఖ్యానించాడు.

Title Favourites Priyanka Jain Amardeep Shobha Shetty Ambati Arjun Changed Thier Game Strategy in Bigg Boss Telugu 7

అలాగే పల్లవి ప్రశాంత్ కూడా అన్న ఎక్కువ సేపే ఉంచాడని చెబుతుంటే శోభా శెట్టి ఫైర్ అయింది. ఈక్రమంలోనే శోభా స్నేహితుడు అమర్ దీప్ కూడా మీరు సరిగ్గా చూడలేదని నాకనిపిస్తోందని అన్నాడు. దీంతో శోభా మరింత హర్ట్ అయి గట్టిగా అరిచింది. ఆపై ఫుల్లుగా ఏడ్చింది. అమర్ దీప్ చెప్పిందే కరెక్టే అని ప్రియాంక కూడా అనగా.. శోభాశెట్టి మరింత హర్ట్ అయింది. ఇలా ఒంటరి అయిపోయి ఏడుస్తోంది. గ్రూపుగా ఆడట్లేదని చెప్పుకోవడానికే.. అమర్, ప్రియాంకలు శోభాకు ఫేవర్ గా మాట్లాడలేదు. అలాగే అర్జున్ అంబటి కూడా అనవసరమైన దానికి అరుస్తున్నాడు. మరి శివాజి తన గేమ్ ను మార్చుకుని వీరి ఎత్తులకు పైఎత్తులు వేస్తాడో లేదో చూడాలి.

Title Favourites Priyanka Jain Amardeep Shobha Shetty Ambati Arjun Changed Thier Game Strategy in Bigg Boss Telugu 7

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X